7 వేల బడ్జెట్ లో 3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ప్రవేశ పెట్టిన కూల్ ప్యాడ్ అదే ప్రైస్ తో మరో కొత్త మోడల్ ను సేల్ఫీ లవర్స్ కు టార్గెట్ గా లాంచ్ చేసింది.. దీని క్లోజ్ పిక్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయగలరు.
ముందుగా స్పెక్స్..
Display: 5.5-inch, 720p
SoC: MediaTek MT6735P
RAM: 3GB
Storage: 16GB
Camera: 8MP, 8MP
Battery: 2500mAh
OS: Android 6.0 Marshmallow
దీనిలోని మీడియా టెక్ MT MT6735P ప్రొసెసర్ కూల్ ప్యాడ్ నోట్ 3 Lite లో ఉన్న MT6735 చిప్ సెట్ కన్నా స్లో గా ఉంటుంది. అయితే అదే క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 CPU Cluster ఉంది ఫోన్ లో కాని క్లాక్ స్పీడ్ 1.3GHz కు బదులు 1GHz కు పడిపోయింది.
డిస్ప్లే
HD స్క్రీన్ మంచి వ్యూయింగ్ angles ఇస్తుంది. అదనంగా 2.5D curved గ్లాస్ panel ఉంది డిస్ప్లే పైన. ఇది ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది ఈ బడ్జెట్ ఫోన్ కు. అలాగే స్క్రీన్ to బాడీ రేషియో కూడా 70% కు పెరిగింది. అంటే మరింత కాంపాక్ట్ గా ఉంటుంది. అయితే గడిపిన కొద్ది సేపటికి, డిస్ప్లే కొంచెం రిఫ్లెక్షన్స్ ఇస్తుంది అని తెలిసింది.
Build (తయారీ)
బ్యూటిఫుల్ గా ఉంది ఫోన్ డిజైన్. curved డిస్ప్లే మరియు మెటల్ ఫినిషింగ్ ప్రీమియం గా చేశాయి ఫోన్ ను ఓవర్ ఆల్ గా. అయితే ఫోన్ కు మాత్రం మెటల్ బిల్డ్ లేదు. అలాగని క్వాలిటీ బాలేదు అని చెప్పలేము.
Note: metallic finish అంటే మెటాలిక్ కలర్స్ షేడ్స్ వేస్తారు ప్లాస్టిక్ panel పై. మెటల్ బాడీ ఉండదు నిజంగా.
కనెక్టివిటి
డ్యూయల్ సిమ్ స్లాట్స్ ఉన్నాయి ఫోన్ పై. డ్యూయల్ స్టాండ్ బై, 4G LTE, VoLTE సపోర్ట్ చేస్తుంది ఫోన్. అయితే డ్యూయల్ సిమ్ అనేది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది.
ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా
8MP సెన్సార్ f/2.2 aperture తో 83.6 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. డీసెంట్ క్వాలిటీ వస్తుంది.
రేర్ కెమెరా
కూల్ ప్యాడ్ మెగా లో వెనుక కూడా 8MP ఉంది. ఇది సింగిల్ LED ఫ్లాష్ తో వస్తుంది. సోనీ సెన్సార్ కలిగి ఉన్న ఈ కెమెరా కూడా డీసెంట్ ఫోటోస్ ఇస్తుంది ప్రస్తుత్తానికి.
బ్యాటరీ
2500 mah బ్యాటరీ తో ఫోన్ 140 గ్రా ఉంది బరువు. అయితే 5.5 in పెద్ద డిస్ప్లే కు బ్యాటరీ కొంచెం చిన్నదిగా ఉంది అనిపిస్తుంది. అయితే బ్యాక్ అప్ టెస్ట్ లో మంచి రిజల్ట్స్ వస్తే ఫర్వాలేదు అనుకోవాలి.