JIO ఫ్రీ ఆఫర్స్ ని మార్చ్ 31 వరకు విచ్చలవిడిగా వాడుకున్నాక ఒక్కసారే
ఫ్రీ ఆఫర్స్ ని రిలయన్స్ సంస్థ ఎత్తివేసింది. ఒకవేళ ఈఆఫర్ లో
కంటిన్యూ అవ్వాలనుకుంటే వున్నా నెంబర్ ని JIO ప్రైమ్ అప్గ్రేడ్
చేసుకోవాలి
మరియు ఏడాది మొత్తం ఈ ఆఫర్ పొందాలి అనుకుంటే మొదట 99 రూ
చెల్లించాలి తరువాత ప్రతినెలా 303 రూ చెల్లిస్తే ఇప్పటిలాగే రోజుకి 1
జీబీ డేటా పొందవచ్చు.
ఏడాది మొత్తానికి అయ్యే ఖర్చు 3,735 రూ ఇలా చూస్తే JIO కి ఇతర
నెట్వర్క్ కి పెద్దగా తేడా లేదు
జిఓ ఫ్రీ కాదని తెలుసుకున్న మిగతా టెలికాం కంపెనీస్ కొత్త కొత్త ఆఫర్స్
తో జనాకర్షణ పొందటానికి తెగ ట్రై చేస్తున్నాయి. దానిలో భాగంగా
ఈఅవకాశాన్ని అదునుగా చేసుకున్న ప్రభుత్వ రంగ BSNL సంస్థ ఒక సంచలన ఆఫర్ ను
అందిస్తుంది.
BSNL బ్రాడ్ బ్యాండ్ ల్యాండ్ లైన్ లో ఒక కొత్త ఆఫర్ అందిస్తున్నది. JIO
తో పోలిస్తే ఇది చవక ఆఫర్ కేవలం 49 రూ ల్యాండ్ లైన్ సబ్స్క్రిప్షన్
పొందవచ్చు.
నెలకి 249 రూ చెల్లిస్తే అన్లిమిటెడ్ హైస్పీడ్ ఇంటర్నెట్ ను పొందవచ్చు .
ఏడాది మొత్తానికి అయ్యేఖర్చు 3,307 రూ మాత్రమే JIO కన్నా 700 రూ తక్కువ
పైగా JIO లాగా రోజుకి 1 జీబీ లిమిట్ లేదు. కానీ ఇంట్లో వైఫై కనెక్షన్కి
ల్యాండ్ లైన్ సర్వీస్ కిమాత్రమే వర్తిస్తుంది. కాకపోతే JIO సిం బేస్డ్
సర్వీస్ కాకపోవటం ఒక్కటే లోపం. చూద్దాం ఏ మేరకు ఆకర్షిస్తుందో .