Blackberry కంపెని సొంతంగా ఫోనులు తయారు చేయదు అనే సందేశాలు పంపినా ఇంకా కొత్త ఫోనులు మాత్రం రిలీజ్ చేస్తుంది సొంత బ్రాండ్ నుండి., లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లో BlackBerry DTEK50 మరియు DTEK60 రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి గ్లోబల్ మార్కెట్ లో కొంతకాలం క్రితమే రిలీజ్ అయ్యాయి. Android Marshmallow. పై నడిచే ఈ ఫోనులలో, DTEK 50 mid-tier డివైజ్( Rs. 21,990). మరోక మోడల్ DTEK60 Snapdragon 820 ప్రొసెసర్ తో మార్కెట్ లో ఫ్లాగ్ షిప్ ఫోన్ గా రిలీజ్ అయ్యింది 46,990 రూ లకు.
Flagship phone - DTEK60 తో మొదలు పెడదాం.. .ఇది Snapdragon 820 తో ఉండటం వలన, OnePlus 3, Moto Z, Samsung Galaxy S7 మరియు ఇతర flagship phones తో పోటీ పడే అవకాశాలున్నాయి. ముందుగా స్పెక్స్
Display: 5.5-inch, AMOLED, 1440p
SoC: Qualcomm Snapdragon 820
Storage: 32GB
RAM: 4GB
Camera: 21MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0
Blackberry Priv లానే DTEK60 డిస్ప్లే కూడా oleophobic కోటింగ్ తో వస్తూ బాగుండి. AMOLED panel కు మంచి కలర్ saturation ఉంది.
DTEK60 స్లిమ్ ఫోన్. 7mm ఉంటుంది మందం. ఆలగని ఇది అతి సన్నని ఫోన్ కాదు. కానీ ఉన్నవాటిలో ఒకటి. మెటల్ ఫ్రేమింగ్ కారణంగా ఫోన్ ప్రీమియం గా ఉంటుంది. అయితే అలాగని గుడ్ లుక్స్ కలిగిన ఫోన్ అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది.
ఫోన్ వెనుక భాగం అంతా గ్లాస్ బాడీ కలిగి ఉండటం వలన బాగా slip అవుతుంది ఫోన్.
ఫోన్ వెనుక 21MP - f/2.0 aperture కెమెరా phase detection autofocus మరియు dual-tone flash తో వస్తుంది. అయితే 46,990 రూ లలో అది కూడా OIS లేకుండా రావటం అంత సమంజసం గా లేదు.
రెండవ ఫోన్ DTEK50. దీని ప్రైస్ 21,990 రూ. ముందుగా స్పెక్స్...
Display: 5.2-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 617
RAM: 3GB
Storage: 16GB
Camera: 13MP, 8MP
Battery: 2610mAh
OS: Android 6.0
The DTEK50 లో కూడా మంచి డిస్ప్లే ఉంది. IPS LCD panel మంచి viewing angles ఇస్తుంది. ఇది కూడా oleophobic కోటింగ్ కలిగి ఉంది.
DTEK50 కి కూడా మెటల్ ఫ్రేమింగ్ ఉంటుంది. edges లో చాంఫెర్ చేయబడింది.
Blackberry రెండు ఫోనుల్లో OS - యూజర్ ఇంటర్ఫేస్ ను ఎటువంటి మార్పులను చేయకుండా బాగా క్లీన్ గా ఉంచింది అని చెప్పాలి.
The DTEK సూట్ లో మీ ఫోన్ ఎంత secure గా ఉందో తెలియజేయటానికి గ్రాఫికల్ డిటేల్స్ ఉన్నాయి. one-window access ఇస్తుంది సెక్యూరిటీ సెట్టింగ్స్ అంతటికీ. అలాగే ఏదైనా యాప్ ఫోన్ యొక్క ఫీచర్స్ ను ఏమైనా అనవసరంగా వాడుతుంటే నోటిఫికేషన్ ఇస్తుంది. అన్నీ privacy కొరకు బ్లాక్ బెర్రీ అదనంగా అందిస్తున్న యాప్స్ అండ్ ఫీచర్స్.