మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ కొరకు బెస్ట్ 5 విండోస్ సాఫ్ట్ వేర్స్ ఇక్కడ చూడగలరు. సాఫ్ట్ వేర్లను వాటి పేర్ల మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు. అవేంటో చూడటానికి "ముందుకు" ప్రెస్ చేయండి.
Unchecky
మీరు సాఫ్ట్ వేర్స్ ఇంస్టాల్ చేస్తున్నప్పుడు, ఆటోమేటిక్ గా అనవసర సాఫ్ట్ వేర్స్ కొన్ని మీకు తెలియకుండా ఇంస్టాల్ అయిపోతున్నాయి కదా? అవి ఆటోమేటిక్ గా ఇంస్టాల్ అవ్వవు. ఏదైనా సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మీరు గమనించని కొన్ని ఆప్షన్స్ డిఫాల్ట్ గా టిక్ అయ్యి వాటిని ఇంస్టాల్ చేస్తాయి. సో అలా అనవసరమైన సాఫ్ట్ వేర్ ఇంస్టాల్లెషన్స్ జరగకుండా టిక్ మార్క్ ను అన్ చెక్ చేస్తుంది ఇది ఆటోమేటిక్ గా.
Easy File Locker
మీ PC లో ఫైల్స్, ఫోల్డర్స్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ లాక్ చేయగలరు. అన్ని ఫీచర్స్ ఫ్రీ. ఎటువంటి ప్రో వెర్షన్స్ అవసరం లేదు. సింపుల్ గా ఏమి చేయాలో అదే చేస్తుంది.
Ninite
ఇది మీ దగ్గర ఉంటే అన్ని సాఫ్ట్ వేర్లు మీ దగ్గర ఉన్నట్టే. మీరు కొత్త PC కొన్నా లేక ఫార్మాట్ చేసినా, లేదా ఎప్పుడైనా PC లో ఉండవలసిన మినిమమ్ సాఫ్ట్ వేర్ల అన్ని దీని నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిని వాడుటకు ఇంటర్నెట్ కావాలి. వెబ్ బ్రౌజర్ రూపంలో ఉంటుంది. మీకు నెట్ దొరకినప్పుడు కచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ సైటు ను ఓపెన్ చేసి చూడండి.
Flux
మీరు ఉంటున్న ప్లేస్ ద్వారా మీ టైమ్ జోన్ కు అనుగుణంగా నైట్ అయితే ఆటోమేటిక్ గా మీ PC స్క్రీన్ బ్రెట్ నెస్ ను తగ్గించటమే కాదు, మీ కళ్లకు ఇబ్బంది కలగని స్లైట్ కలర్ షేడింగ్ వేస్తుంది స్క్రీన్ కు. దీనికి సైంటిఫిక్ explaination కూడా ఇస్తుంది Flux సాఫ్ట్ వేర్.
Microsoft Security Essentials
దీనిని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. కాని మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన బెస్ట్ యాంటి మాల్వేర్ వైరస్ సాఫ్ట్ వేర్. మీకు కనిపించని చాలా బ్యాక్ గ్రౌండ్ హెల్ప్ చేస్తుంది. సాఫ్ట్ వేర్లను వాటి పేర్ల మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు.