మీ ఇంటికి తగిన LED TV కొనాలంటే, మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. విషయాలు మీరు గుర్తుంచుకుంటే మీ ఇంటికి తగిన LED, OLED లేదా QLED TV ని ఎంచుకోవడం చాలా సులభమవుతుంది. మీ ఇంటికి తగిన LED, OLED లేదా QLED టీవీ ఎంచుకోవడంలో ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మీకు సహాయపడే ఈ కంప్లీట్ TV BUYING గైడ్ ను ఇక్కడ చూడవచ్చు.
ముందుగా మీ గది పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని టీవీ ని ఎంచుకోవడం మంచిది. ఇందులో, సైజుతో పాటుగా రిజల్యూషన్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రిజల్యూషన్ ను సామాన్యంగా, (వెడల్పు x ఎత్తు) పరంగా కొలుస్తారు. రిజల్యూషన్ అనేది డిస్ప్లే లో ఉన్న పిక్సెల్స్ సంఖ్యను మీకు తెలియజేస్తుంది.
డిస్ప్లే యొక్క మంచి నాణ్యత, మెరుగైన వీక్షణానుభూతి ని అందిస్తుంది. సరైన డిస్ప్లేని ఎంచుకోవడం అనేది ఒక టీవీని కొనుగోలు చేసేటప్పుడు అత్యంత క్లిష్టమైన భాగం. డిస్ప్లే నాణ్యత మీకు మెరుగైన చిత్ర నాణ్యతను అందిస్తుంది.
డిస్ప్లే టైప్ అనేది స్క్రీన్ పైన చిత్రాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే టెక్నాలజీని సూచిస్తుంది. ప్రస్తుతం, మార్కెట్లో ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న మూడు ప్రముఖ రకాలు LED, OLED మరియు QLED ఉన్నాయి. ఈ మూడు రకాలు కూడా LED టెక్నాలజీ (లైట్ ఎమిటింగ్ డయోడ్) ఉపయోగిస్తాయి. అయితే, అవి ఉత్పత్తి చేసే చిత్రాల నాణ్యత అనేది వాటి ధరను నిర్ధేశిస్తుంది.
ఈరోజు టీవీల్లో ఉపయోగించిన అత్యంత ప్రజాదరణ టెక్నాలజీ ఇది. ఇవి సన్నగా ఉంటాయి, ఎటువంటి స్థలంలో అయినా సులభంగా సులభముగా ఇమిడిపోతాయి. బడ్జెట్ ధరలో వచ్చే టీవీలలో అధిక శాతం దాదాపుగా LED టీవీలే అయ్యుంటాయి. LED (లైట్ ఎమిటింగ్ డయోడ్) అనేది టీవీలో పిక్సెల్స్ వెలిగించే ఒక రూపం. ట్రెడిషనల్ LCD TV లేదా CRT టీవీల కంటే LED టివిలు మరింత శక్తివంతమైనవి.
IPS డిస్ప్లేలు గొప్ప వ్యూవింగ్ యాంగిల్ (178-డిగ్రీల) తో పాటు లైఫ్ - లైక్ సాదృశ్య రంగులను అందిస్తాయి. అయితే, Non-IPS ప్యానెల్ టీవీలు తక్కువ రేటుకే వస్తాయి. కానీ, IPS టీవీలతో పోలిస్తే Non-IPS ప్యానెల్ టీవీలు తక్కువ వ్యూవింగ్ యాంగిల్ కలిగి ఉంటాయి. అంటే, సైడ్ నుండి చూస్తే మీకు టీవీ అంత గొప్పగా అనిపించదు మరియు రంగులు తేలిపోయినట్లు అస్పష్టంగా కనిస్పిస్తుంది.
OLED (ఆర్గానిక్ లైట్ - ఏమిటింగ్ డయోడ్) టీవీలు ఖచ్చితత్వంతో పూర్తి స్థాయి రంగులను, గొప్ప కాంట్రాస్ట్, వైడ్ యాంగిల్ మరియు దాదాపుగా అస్పష్ట - రహిత చిత్రాన్ని అందిస్తాయి. లక్షల పిక్సెల్లలో ప్రతి ఒక్కటి కూడా వెడల్పుగా ఉంటుంది, దీనివల్ల TRue Blak మరియు అద్భుతమైన కలర్ రేంజ్ ఉత్పత్తి చేస్తుంది. OLED టివి యొక్క పిక్చర్ క్వాలిటీ నేడు మార్కెట్లో ఉత్తమంగా ఉంచుతుంది, అందుకే అవి ప్రీమియం ధరలో విక్రయించబడతాయి.
QLED (క్వాంటమ్ డాట్ LED): టీవీలు కూడా LED TV లు, ఇవి క్వాంటమ్ డాట్ లను చిత్ర నాణ్యతా ప్రాంతాలలో పనితీరును పెంచుతాయి. LED టివిలతో పోలిస్తే QLED టివీల బ్రైట్నెస్ స్థాయిలు చిత్ర నాణ్యతను అందించడానికి సహాయం చేస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే, QLED టీవీ క్వాంటం డాట్స్ లేకుండా LED టీవీల కంటే ఎక్కువ రంగులు పునరుత్పత్తి చేయవచ్చు. డిస్ప్లే వీక్షణా అనుభవానికి వచ్చినప్పుడు QLED మరియు OLED దాదాపు సమానంగా ఉంటాయి.
ముందుగా మీ గది పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని టీవీ ని ఎంచుకోవడం మంచిది. ఇందులో, సైజుతో పాటుగా రిజల్యూషన్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రిజల్యూషన్ ను సామాన్యంగా, (వెడల్పు x ఎత్తు) పరంగా కొలుస్తారు. రిజల్యూషన్ అనేది డిస్ప్లే లో ఉన్న పిక్సెల్స్ సంఖ్యను మీకు తెలియజేస్తుంది. అధిక సంఖ్యలో పిక్సెళ్ళు అధిక స్పష్టత మరియు షార్ప్ నెస్ ను అందిస్తుంది. HD- Ready (720p), Full-HD (1080p) లేదా UHD (4K) వంటి టీవీల పేర్లను మీరు తరచుగా చూస్తారు.
HD Ready టీవీ 1366x766 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. మీ గది చిన్నగా వున్నా లేక పాత CRT TV నుండి కొత్త టీవీ కి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారు, లేక మొట్టమొదటి ఫ్లాట్ స్క్రీన్ టీవీని కొనుగోలు చేసేవారికి అనువైనది. ఈ టీవీలు మీకు బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. అయితే, మీ స్టాండర్డ్ డెఫినిషన్ (SD) సెట్ టాప్ బాక్సుల ద్వారా మాత్రమే టీవీ చూడలనుకునే వారికి మాత్రమే సరిపోతుంది లేదా 32inch లేదా చిన్న బడ్జెట్ టీవీని మాత్రమే చూసేటప్పుడు ఇది మంచి ఎంపిక.
Full HD లేదా FHD టీవీలు 1920x1080 పిక్సల్స్ రిజల్యూషన్ అందిస్తాయి. FHD టీవీలు HD రెడీ టీవీల కంటే రెండు రెట్ల పిక్సెళ్ళను కలిగి ఉంటాయి మరియు అధిక స్పష్టతని ఇస్తాయి. HD క్లారిటీతో షోలు మరియు సినిమాలను చూడాలి నుకునేవారికి ఇది ఉత్తమమైన ఎంపిక.
ఇది 4K టీవీ లేదా Ultra HD లేదా UHD అని కూడా పిలువబడుతుంది. ఇది 3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీలు FHD TV లకు కంటే 4 రెట్ల ఎక్కువ పిక్సల్స్ కలిగి ఉంటాయి. సినిమా హల్ వంటి పూర్తి స్థాయి సినిమా వ్యూవింగ్ అనుభవాన్ని కోరుకునేవారు ఈ టీవీలను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం, 4K కంటెంట్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, Disney+ Hotstar, Zee5 మరియు మరిన్ని OTT ప్లాట్ ఫామ్స్ పైన లభిస్తున్నాయి. ఇప్పుడు 4K టీవీలు 20 వేల బడ్జెట్ ధరలో కూడా లభిస్తున్నాయి.
ఎటువంటి అదనపు పరికరాలతో అవసరం లేకుండా, టీవీ నుండి నేరుగా తెరపైకి బ్రాడ్ క్యాస్టింగ్ (ఛానెల్స్) మరియు సినిమాలు ప్రసారం చేయడానికి స్మార్ట్ టీవీలు మీకు అనుమతిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఒక పెద్ద స్మార్ట్ ఫోను వంటిదే ఒక స్మార్ట్ టీవీ. మీరు స్మార్ట్ టీవీ పైన నచ్చిన కంటెంట్ ను చూడండంతో పాటుగా గేమ్స్, వీడియో కాల్ లను కూడా నిర్వహించవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ పైన Apps మరియు గేమ్స్ అమలు చేయడం, ఇంకా ముఖ్యంగా Netflix, Hotstar, Amazon Prime లేదా Youtube నుండి నేరుగా మీకు ఇష్టమైన సినిమాలు మరియు షోలను చూడవచ్చు.
ఉపయోగం : మెరుగైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది మరియు దాని యాప్ స్టోర్ లో మరిన్నిApps ను కలిగి ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ల వలెనే, ఈ స్మార్ట్ టీవీలు కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన నడుస్తాయి. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లు చాలానే తమ టీవీలలో ఈ ఫీచరును అందించాయి మరియు ఉపయోగించుకుంటాయి. SAMSUNG టివిలు సంస్థ యొక్క సొంత Tizen OS తో, LG TV లలో సంస్థ యొక్క WebOS తో అమలు అవుతాయి. ఇక Xiaomi విషయానికి వస్తే ఇది PatchWall అనే దాని స్వంత OS కలిగివుంది.
గూగుల్ సర్టిఫైడ్ టీవీ కావాలంటే మీరు ఆండ్రాయిడ్ OS తో పనిచేసే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు టీవీలో ఉత్తమ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇస్తుంది మరియు Google Play స్టోరుకు యాక్సెస్ తో సహా, ఇది Apps, గూగుల్ గేమ్స్, గూగుల్ మ్యూజిక్ మరియు మరిన్నిటిని మీకు అందిస్తుంది.
వాయిస్ రిమోట్, ఎయిర్ రిమోట్ లేదా అంతర్నిర్మిత క్రోమ్కాస్ట్ వంటి అదనపు ఫీచర్లను మనం చెక్ చెయ్యవచ్చు, ఇది నావిగేషన్ తో సహాయం చేస్తుంది.
ఇంటర్నెట్-ఎనేబుల్ టీవీ స్మార్ట్ టీవీలాగా కాదు. మీరు ఇంటర్నెట్ కి అనుసంధానించబడిన టీవీని WiFi కి కనెక్ట్ చేయవచ్చు మరియు వెబ్ బ్రౌజింగ్ మరియు యూట్యూబ్ వంటి కొన్ని యాప్స్ ను మరియు ఇలాంటి మరిన్ని వంటి ప్రాథమిక ఇంటర్నెట్ ప్రాప్యతను కలిగి ఉంటాయి. చాలా బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ యొక్క మొబైల్ వెర్షన్ పైన పనిచేస్తాయి.
మీరు మీ ఫోనులో స్టోర్ చేయబడిన ఫోటోలు మరియు వీడియోలను మీ టీవీ పైన నేరుగా చూడవచ్చు.
కొన్ని టీవీలు ఈ ఫీచర్ ను అంతర్నిర్మితంగా కలిగి ఉంటాయి. ఇది మీ ఫోన్ స్క్రీన్ యొక్క కాపీగా టీవీ పైన కనిపిస్తుంది. దీనిని "మిర్రరింగ్" అని పిలుస్తారు. ఈ ఫీచర్ మీ ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు పెద్ద స్క్రీను పైన మీ ఫోటోలను మరియు హోమ్ సినిమాలను పంచుకోవడానికి మీకు చక్కగా ఉపయోగపడుతుంది.
కొన్ని టీవీలు మీ ఫోన్ నుండి సంగీతాన్ని ప్రసారం చేయగల సామర్థ్యాన్ని అందిస్తాయి మరియు టీవీని పెద్ద బ్లూటూత్ స్పీకరుగా కూడా మార్చుకునే వీలుంటుంది. టీవీ డిస్ప్లేను ఆఫ్ చేసి ఈ టివి యొక్క స్పీకర్లను వాడుకోవచ్చు.