ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేతిలో లేదంటే కాలం ఆగిపోయినట్లే అనిపిస్తుంది. అంతగా స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోయాం.
ఫోటోలు, వీడియోలు మొదలు కొని కాలింగ్, ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని పనులు అరచేతిలో పెడుతుంది స్మార్ట్ ఫోన్.
స్మార్ట్ ఫోన్ తో ప్రపంచాన్ని చుట్టేసే వారికి ఇందులో ముఖ్యమైన సమస్య కూడా ఒకటి ఎండా కాలంలో కనిపిస్తుంది.
ప్రస్తుతం దేశంలో ఎండలు మండి పోతున్నాయి. దేశంలో అత్యధికంగా 52 డిగ్రీలకు పైగా వేడిమిని దేశ రాజధాని ఢిల్లీ నమోదు చేసింది.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండి పోతున్నాయి. ఈ ఎండల్లో స్మార్ట్ ఫోన్ టెంపరేచర్ పైన ఒక కన్ను వేయడం మరియు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే, స్మార్ట్ ఫోన్ వేడెక్కడం వలన ఫోన్ పనితీరుతో పాటుగా ఫోన్ ఉనికి పైన కూడా ప్రభావం ఉంటుంది.
అందుకే, ఈ సమ్మర్ వేడి నుండి స్మార్ట్ ఫోన్ హీట్ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
ఫోన్ హీటెక్కడానికి ప్రధాన కారణంగా ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో నడిచే యాప్స్ అని తడుముకోకుండా చెప్పవచ్చు.
ముఖ్యంగా గేమింగ్, వీడియో మరియు మ్యాప్ లకు సంబంధించిన యాప్స్ మీ ఫోన్ బ్యాటరీని డ్రైన్ చేయడంతో పాటు ఫోన్ ను కూడా వేడెక్కిస్తాయి.
అందుకే స్మార్ట్ ఫోన్ బ్యాగ్రౌండ్ లో నడిచే యాప్స్ రెగ్యులర్ గా చెక్ చేసుకుని, ఏదైనా ఉంటే వాటిని వెంటనే క్లోజ్ చెయ్యాలి.
మీ స్క్రీన్ బ్రైట్నెస్ ను తగ్గించండి. ఫోన్ లో ఎక్కువ శాతం బ్యాటరీని ఫోన్ డిస్ప్లే ఉపయోగిస్తుంది. స్క్రీన్ బ్రైట్నెస్ ను తగ్గించడం ద్వారా ఫోన్ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉంటుంది.
ఎండ వేడిమికి తోడు మీ ఫోన్ వాడకంతో వచ్చే వేడిమి తోడైతే మీ ఫోన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే, సమ్మర్ లో స్మార్ట్ ఫోన్ ను ఎండలో వాడకపోవడం ఉత్తమం.
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మీ ఫోన్ ను ఉపయోగించ వలసి వస్తే, మీ ఫోన్ లో బ్లూటూత్ ను ఆఫ్ చేయండి. బ్లూటూత్ ఆన్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ కొంత హీట్ ఇష్యూ ని చూస్తుంది.
మీ ఫోన్ ను బ్యాక్ కవర్ తో కప్పి కప్పి ఉంచడం కూడా ఫోన్ అతిగా వేడెక్కడానికి కారణంగా పరిగణించవచ్చు. అందుకే, మీ ఫోన్ కవర్ ను కొంత సమయమైనా తొలగించడం మంచిది.
మీ ఫోన్ ను చల్లని ప్రదేశంలో లేదా కనీసం ఫ్యాన్ గాలి తగిలే విధంగా కొంత సమయం ఉంచండి. లేదా ఫోన్ బాగా వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే కవర్ ను తొలగించి నోటితో గాలి ఊదండి.
మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ సమయంలో ఫోన్ ను కొంత రెస్ట్ ఇవ్వడం కూడా చాలా అవసరం. ఫోన్ ను ఏకధాటిగా గంటల తరబడి రెస్ట్ ఇవ్వకుండా వాడకం తగ్గించండి.
మీ బ్యాగ్ లో మీ ల్యాప్ టాప్, ట్యాబ్ లేదా మరింకేదైనా ఇతర పరికరాలతో మీ ఫోన్ కలిపి ఉంచినట్లయితే మీ ఫోన్ వాటి వేడిని గ్రహిస్తుంది. అందుకే, ఇతర పరికరాలతో మీ ఫోన్ ను కూడా కలిపి ఉంచకండి.
ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తే కూడా ఈ సమ్మర్ లో మీ ఫోన్ ను అతిగా వేడెక్కకుండా చూసుకోవచ్చు.