మధ్యస్థ ధరలో ఉత్తమ స్మార్ట్ ఫోన్ కోనాలను కుంటున్నారా ?ఈ సంవత్సరం, చాలా కొత్త ఫోన్లు 20000 స్మార్ట్ ఫోన్ విభాగంలో లాంచ్ చేయబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్లు చాలా మంచి పనితీరును అందించినప్పటికీ, కొన్నిమాత్రం నిజంగా హై ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ జాబితాలోకి వెళతాయి. కాబట్టి, మీరు 20000 కంటే తక్కువ ధరలో ఉత్తమ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తే మీకు చాలా ఎంపికలు ఉన్నాయి, కాని ఏది కొనాలి ? అనే విషయాలను సరళంగా చేయడానికి, 2017 మార్చి నాటికి భారతదేశంలో 20000 లోపు ఉన్న టాప్ 10 మొబైల్ ల జాబితా అందించనున్నాము . ఈ ఫోన్లు మంచి పనితీరు, కెమెరా నాణ్యత, స్పెసిఫికేషన్లు మరియు మంచి ఫీచర్లు తో పాటుగా మధ్య శ్రేణి ధర వద్ద అందుతాయి మరియు 20000 కంటే తక్కువ బడ్జెట్ లో వినియోగదారులకు సిఫార్సు చేయబడతాయి. ఇక్కడ భారతదేశంలో 20000 లోపు టాప్ 10 ఉత్తమ మొబైల్ ఫోన్లు ఇవిగో.
షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో
మీరు 20వేల కింద ఉత్తమ ఫోన్ కోసం చూస్తుంటే గనక, షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో దాని 6GB తో దీనిని బీట్ చేయడం కష్టం.ఫోన్ లో అన్ని చెక్ బాక్స్ కూడా కుడి వైపునే ఉంటుంది, ఒక రెండు రోజుల బ్యాటరీ జీవితం అందించడం, ఫోన్ వెనుక భాగంలో ఒక నాణ్యత గల అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇవ్వగల కెమెరా వుంది.
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది . 18: 9 యూనివిసమ్ డిస్ప్లే చక్కని అనుభూతినిస్తుంది అయితే మేము ఫోన్ లో ఓకే ఫిర్యాదు ఉంటుంది ,అది దీనిలో ఆండ్రాయిడ్ క్రొత్త వెర్షన్ అయిన oreo 8.0 ఫోన్ తో పాటుగా రావకపోవడామే. మొత్తం మీద, షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో దాని 6GB వేరియెంట్ తో 20000 కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్లు అన్నింటికంటే బెస్ట్ ఫోన్ గా నిలిచింది.
అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1
అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 ఎదావిదిగా షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో ను పోలివుంటుంది ఫీచర్ల పరంగా కానీ దీనిలో స్టాక్ ఆండ్రాయిడ్ ఒరేయో 8.1 వెర్షన్ తో పాటుగా వస్తుంది. ఇది హార్డ్వేర్ మరియు పెరఫార్మెన్స్ పరంగా చూస్తే ఒకే పోలికతో ఉంటుంది కానీ 3జీబీ వేరియంట్లో దీన్ని తక్కువ ధరకు అందిస్తున్నారు ,కాబట్టి జెన్ ఫోన్ మాక్స్ ప్రో ని స్పష్టమైన విజేతగా ప్రకటించవచ్చు . ఒకవేళ దీని కెమేరా గనుక మరింత నాణ్యమైనది ఉన్నట్లయితే ఇది కచ్చితంగా నెంబర్ ఫోన్ గా ఉండేది , కానీ రెడ్ మీ నోట్ 5 ప్రో యొక్క కెమేరా అత్యంత ఉన్నతమైనది కావడం వల్ల , కొంచెం తేడాతో 20000 కింద లభించే టాప్ టెన్ ఫోన్లలో రెండవ స్థానంలో నిలిచింది.
నోకియా 6 (2018)
నోకియా తిరిగి వచినసంగతి అందరికి విధితమే అంటే కాకుండాఇది ఇప్పుడు పుంజుకొని టాప్ టెన్ లో చోటు సంపాదించింది. ఈ నోకియా 6 (2018) లేదా నోకియా 6.1 HMD చేత డెవలప్ చేయబడింది ఇంకా ఇది ఒక ట్యాంక్ లాగ నిర్మించబడినది అలాగే ఇది ఆండ్రాయిడ్ వన్ సర్టిఫై పొందింది. ఇది ఒక స్నాప్ డ్రాగన్ 630 చిప్సెట్తో 5.5 అంగుళాల ప్యానల్ ని కలిగి ఉంది, ఇది 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో జత చేయబడింది.దీనికి వెనుకవైపు 16ఎంపీ కెమెరా చాలా నమ్మదగినది. మొత్తంమీద, రూ .20,000 ధరలో ఈ ఫోన్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చు.
హువాయ్ పి 20 లైట్
హువాయ్ పి 20 లైట్ ఖరీదైన పి 20 ప్రో యొక్క రూపకల్పన తత్వశాస్త్రం అలాగే కెమెరా పరాక్రమాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన ఫోటోలు! తీయగల ఒక డ్యూయల్ - కెమేరా సెటప్వెనుక భాగం లో వుంది. పి 20 లైట్ మిడ్-రేంజ్ లో ఉన్న మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం ఖరీదైనదిగా ఉంటుంది, కానీ కెమెరా విభాగంలో ఉన్న సాప్యత ఈ జాబితాలో దాని విలీనాన్ని వివరిస్తుంది.
షియోమీ రెడ్ మీ నోట్ 5
షియోమీ రెడ్ మీ నోట్ 5 గతసంవత్సర రెడ్ మీ నోట్ 4 స్థానాన్ని భర్తీ హెస్తుందని చెప్పవచ్చు. అంతేకాక ముందు వండి వడ్డించిన అన్ని రుచులతో కొనసాగింపుగా వచ్చింది.ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 చిప్ శక్తీతో పనిచేస్తుంది,కానీ ఇది రెడ్ మీ నోట్ మీ 5 ప్రోలో వాడిన స్నాప్ డ్రాగన్ 636 అంత శక్తివంతమైనది కాదు. కానీ అదే సమయంలో మరింత సరసమైన మరియు ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉంది . 64జీబీ వేరియంట్ కొనడానికి మంచి ఎన్నికగా ఉంటుంది.
షియోమీ Mi A1
Mi A1 అనేది షియోమీ యొక్క ఆండ్రాయిడ్ వన్ యూ అందించే ప్రయత్నం మరియు అది మంచి ఫలితాన్నిఇచ్చింది కూడా. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 SoC, 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి కలిగి ఉంది. డివైజ్ చక్కగా నిర్మించబడింది మరియు ఫోన్ ధర పరంగా ఒక మంచి కెమెరా అందిస్తుంది. గత ఏడాది రూ .20,000 క్రింద Mi A1 ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్ గా నిలిచింది.
మోటో జి6
మోటో జి6 ఈసారి ముఖంగా డిజైన్ ను పునరుద్ధరించడం మీదే దృష్టి సారించింది మరియు కెమెరా నాణ్యత ముడి పెర్ఫార్మెన్స్ గ వుంది అదృష్టవశాత్తూ, ఈ రెండు అంశాలపై అధిక స్కోర్ ని సాధించింది. మరియు దాని తేలికపాటి UI కూడా ఒక ప్రారంభ స్థాయి ప్రాసెసర్ మరియు సున్నితంగా అనిపిస్తుంది .
షియోమీ మీ మాక్స్ 2
మీరు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి బ్యాటరీ లైఫ్ కూడిన పెద్ద ఫోన్ కోసం చూస్తునట్లైతే , అప్పుడు మీకు మాక్స్ 2 ఖచ్చితంగా మీ ఉత్తమ ఛాయిస్ అవుతుంది. ఇది రెడ్ మీ నోట్ 4 లో చూసి నట్లుగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 6.44 అంగుళాల డిస్ప్లేతో మంచి వీక్షణ కోణాలు అందిస్తుంది , మరియు ఎక్కువ వీడియోలను చూడటానికి దోహదపడడం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన లక్షణం. సినిమాలను చూడడం ఎక్కువగా ఇష్టపడే వారికి అనుగుణంగా,ఒక రోజు మొత్తం పనిచేసే విధంగా దీనిలో 4850mAH తో కూడిన భారీ బ్యాటరీని అందించారు.
శామ్సంగ్ గెలాక్సీ జె7 ప్రో
శామ్సంగ్ గెలాక్సీ జె7 ప్రో డెసెప్టివ్లీ ఒక మంచి స్మార్ట్ ఫోన్. ముందుగా శామ్సంగ్ ఈ ఫోన్ ని రూ. 20,000 ధరాగా నిర్ణయించింది, కానీ ఇప్పుడు దీని ధర తగ్గించడం ద్వారా ఇది రూ. 20 వేల ధర విభాగంలో ఇది కూడా ఒక బెస్ట్ ఫోన్ గా వుంది. ఇది కెమేరా విభాగాములో ఇతర ఫోన్లకు పోటీ ఇచ్చేలా మెరుగైన కెమెరాను కలిగి ఉంది మరియు దీనిని మధ్య శ్రేణి విభాగంలో ఉత్తమంగా నిర్మించిన ఫోన్ గా చెప్పవచ్చు. ఒక మంచి బ్యాటరీ లైఫ్ తో బాటుగా అద్భుతమైన అమోల్డ్ స్క్రీన్ ని కూడా పొందవచ్చు.అయితే,తన ప్రత్యర్థులంత శక్తివంతంగా లిడి ఉండక పోవడమే దీని ఇబ్బందిగా చెప్పవచ్చు . అయినా సరే ఇప్పుడు మార్కెట్లో లబించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో దీన్ని ఒకటిగా చెప్పవచ్చు.
వివో వీ9 యూత్
వివో వీ9 యూత్ అనేది ఐఫోన్ X వలె కనిపించే సెల్ఫ్ -సెంట్రిక్ ఫోన్. ఇది 6.3-ఇంచ్ డిస్ప్లేతో పాటుగా వెనుక భాగంలో ఒక డ్యూయల్ కెమెరా ని కూడా కలిగివుంది. అలాగే 16-మెగా పిక్సెల్ ముందు భాగంలో ఉంటుంది .
హానర్ ప్లే
ఈ హానర్ ప్లే 409 ppi గల ఒక 6.3 అంగుళాల IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. లెన్స్ పరంగా, 16ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ ప్రధాన కెమెరాని వెనుక మరియు 16 ఎంపీ ముందు కెమెరాని అందించారు. ఇది స్పీడ్ ఛార్జ్ టైప్ -c కి మద్దతివ్వగల 3,750 mAh బ్యాటరీతో వుంది.
షియోమీ మీ ఏ 2
ఈ షియోమీ మీ ఏ 2 కెమెరా పరంగా అద్భుత ఫీచర్లని కలిగి ఉంటుంది. ఇందులో వెనుక LED ఫ్లాష్ తో కూడిన 12ఎంపీ + 20ఎంపీ ప్రధాన కెమెరాని మరియు 20ఎంపీ ముందు కెమెరాని అందించారు. ఈ డివైజ్లో 1080 x 2160 పిక్సెల్స్ గల ఒక 5.99 అంగుళాల IPS LCD డిస్ప్లే ని ఇచ్చారు. ఇది స్పీడ్ ఛార్జ్ టైప్ -c కి మద్దతివ్వగల 3,010 mAh బ్యాటరీతో వుంది.
ఒప్పో ఎఫ్ 7
ఈ ఒప్పో ఎఫ్ 7 సెల్ఫీ కోసం అద్భుతం గా ఉంటుంది ఎందుకంటె ఇందులో ముందు 25 ఎంపీ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు మరియు వెనుక ప్రధాన 16ఎంపీ కెమెరాని అందించారు. ఇది 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజి తో లభిస్తుంది ఇంకా 1080 x 2280పిక్సెల్స్ అందించగల ఒక 6.23 - అంగుళాల IPS LCD డిస్ప్లేయ్ ని కూడా కలిగి వుంది.
శామ్సంగ్ గెలాక్సీ జె 8 2018
ఈ శామ్సంగ్ గెలాక్సీ జె 8 ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 450 శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజి కలిగి వుంది. ఇందులో 720 X 1480 పిక్సెల్స్ అందించగల ఒక 6.0 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ని ఇచ్చారు. 16 ఎంపీ +5ఎంపీ డ్యూయల్ కెమెరా వేనుక మరియు 16 ఎంపీ ముందు సెన్సర్ని అందించారు.
మోటో ఎక్స్ 4
ఈ మోటో ఎక్స్ 4 ఆక్టా కొర్ స్నాప్ డ్రాగన్ 630 చిప్సెట్ ని కలిగి వుంది. ఈ డివైజ్ ని 424 ppi ఇవ్వగల 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే తో అందించారు. వెనుక డ్యూయల్ కలర్ LED ఫ్లాష్ గల 12ఎంపీ + 8ఎంపీ ప్రధాన కెమెరా మరియు 16 ఎంపీ ముందు సెన్సార్ ని ఇచ్చారు.
శామ్సంగ్ గెలాక్సీ ఏ 6
ఈ శామ్సంగ్ గెలాక్సీ ఏ 6 ఆక్టా కోర్ శామ్సంగ్ ఎక్సినోస్ 7 శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజి కలిగి వుంది. ఇందులో 720 X 1480 పిక్సెల్స్ అందించగల ఒక 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ని ఇచ్చారు. 16 ఎంపీ ప్రైమరీ కెమెరా వేనుక మరియు 16 ఎంపీ ముందు కెమెరాని అందించారు.