ప్రతీ సంవత్సరం ఇయర్ లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయో లెక్కపెట్టటం కూడా కష్టం కాని ప్రతీ కొత్త ఫోన్ కు ప్రత్యేకంగా కొత్త విషయాలు లేకపోయినా కెమెరా విషయంలో improvement ఉంటుంది. సో మొబైల్ లో కూడా మనం మంచి ఫోటోగ్రఫి చేయగలము. కాని అలాంటి ఫోన్లు ఏంటి అని మొబైల్ users కు క్లారిటీ ఉండదు. ఇక్కడ మీకు ఆ ఫోనులు ఏంటో తెలిపే ప్రయత్నమే ఈ ఆర్టికల్. లిస్టు కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫి స్మార్ట్ ఫోన్: Apple iPhone 7 Plus
Portrait Mode depth of field పెద్దగా బాలేకపోయినా ఐ ఫోన్ 7 ప్లస్ బెస్ట్ కెమెరా ఫోన్ అయ్యింది. ఆపిల్ నుండి రిలీజ్ అయ్యే ఫోనులు ఎప్పుడూ ఫోటోస్ విషయంలో టాప్ గా ఉండటం చూశాము ఇప్పటివరకూ. దీనిలో కూడా best-in-class sharpness, colour accuracy, సరిపడా noise reduction algorithm అండ్ సరిక్రొత్త backgrounds soft చేయటం దీనిలోని బెస్ట్ విషయాలు. telephoto lens కేవలం 2x optical zoom మాత్రమే ఇస్తున్నప్పటికీ డిటేల్స్ ను బాగా ఇస్తూ అన్నిటినీ బాగా మేనేజ్ చేసే ఫోటోలను ఇవతంలో సక్సెస్ఫుల్ అయ్యుంది ఐ ఫోన్ 7 ప్లస్.
Low లైటింగ్ కలర్ accuracy ఫోన్: Google Pixel/Pixel XL
DxOMark rating తో గూగల్ వీటిని బెస్ట్ కెమెరా in world అని ప్రొమోషన్స్ చేస్తుంది కాని ప్రతీ సారి అంత బెస్ట్ కాదు అని తెలుసుకున్నాము ఐ ఫోన్ 7 ప్లస్ ఫోన్ తో పోల్చినప్పుడు. అయితే Pixel smartphones - రెండూ very good low లైటింగ్ ఫోటోస్ ను ఇస్తున్నాయి. కలర్ విషయంలో కూడా బాగున్నాయి. Image stabilisation అండ్ noise reduction విషయాలలో కొంచెం ఐ ఫోన్ 7 ప్లస్ కన్నా తక్కువగా ఉన్నాయి పిక్సెల్ ఫోనులు. అయితే దానిని కూడా ఈ ఫోనులు Low లైటింగ్ ఫోటో క్వాలిటీ విషయంలో మించుతున్నాయి.
Ultra low లైటింగ్ ఫోటోస్ అండ్ fast focus ను ఇచ్చే ఫోన్: Samsung Galaxy S7 edge
dual-edge తో వచ్చే ఈ సామ్సంగ్ Galaxy S7 edge లో బెస్ట్ డ్యూయల్ ఇమేజ్ సెన్సార్ ఉంది. సో ఫోటో తీసేటప్పుడు సెన్సార్ నుండి ఎక్కువ పిక్సెల్స్ వాడుకుంటుంది. ఇందువలన రెండు ఇంపార్టెంట్ విషయాలు రిజల్ట్స్ లో కనిపిస్తాయి. ఒకటి బెస్ట్ డిటేల్స్ అండ్ రెండవది ఫాస్ట్ ఆటో ఫోకస్. అయితే దీనిలో కొంచెం oversaturated కలర్స్ అండ్ highcontrast లెవెల్స్ ఉండటం వలన పిక్సెల్ మరియు ఐ ఫోన్ 7 ప్లస్ దీనికి కన్నా ముందు వున్నాయి ఫోటోగ్రఫీ విషయం లో. కాని Galaxy S7 edge ఇప్పటికీ మంచి కెమెరా ఫోన్ తో పాటు ఇప్పటికీ fastest camera స్మార్ట్ ఫోన్ గా నిలిచి ఉంది.
డ్యూయల్ కెమెరా డిటేల్స్ అండ్ Leica: Huawei P9
Huawei P9 లో certified Leica SUMMARIT లెన్స్ మరియు కెమెరా algorithm ఉన్నాయి. ఫోటోస్ తీయటానికి ఫోన్ లో ఉన్న రెండు Sony IMX286 image sensors ను వాడుకుంటుంది. సో డిటేల్స్ గ్రేట్ గా ఉంటాయి. అందువలన బెస్ట్ ఇన్ క్లాస్ ఫోటోస్ ఇస్తుంది. optical stabilisation అండ్ గుడ్ లెన్స్ కూడా long exposure ఫోటోగ్రఫి కు హెల్ప్ చేస్తున్నాయి. మరొక విషయం ఫోన్ పై మీకు Leica బ్రాండింగ్ కూడా ఉంటుంది. ఈ బ్రాండింగ్ తో ఉన్న ఏకైక స్మార్ట్ ఫోన్ ఇది.
Ultra-wide angle ఫోటోగ్రఫి ఇచ్చే ఫోన్: LG G5
LG G5 modular design తో వస్తుంది కాని ఇది రియాలిటీ లో అంత సునాయాసంగా లేదు. దానికి తోడూ కెమెరా కూడా స్లో గా ఉంది. కానీ దీనిలోunique డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. రెండు రేర్ కెమెరాస్ లో 8MP camera module అనేది ultra-wide angle lens తో రావటం వలన 135-degree field of view అస్థిర ఫోటోస్ షూట్ చేస్తుంది. మన కళ్ళతో చూడగలిగే దాని కన్నా ఎక్కువ చూపిస్తుంది. డిటేల్స్ కూడా impressive అని అనుకోవచ్చు.
Modular కాన్సెప్ట్ తో పాటు సొంతంగా మంచి కెమెరా కలిగిన ఫోన్ : Moto Z
excellent బ్రైట్ షూటింగ్, crisply detailed ఫోటోస్, accurate colours ఉన్నాయి దీనిలో. దీనికి తోడూ mods కాన్సెప్ట్ కారణంగా జూమ్ లెన్స్ యాడ్ చేసుకొని ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లాభాలు పొందగలరు దీనితో.
అద్భుతమైన కెమెరా తో వస్తున్న బడ్జెట్ ఫోన్ : Nubia Z11 Mini
మీరు ఎక్కువుగా వినని ఫోన్లలో ఇది ఒకటి అని చెప్పాలి. కాని అసలు విషయం ఏంటంటే Oneplus 3(29,000 రూ) లో అదే సెన్సార్ ఉంది ఈ ఫోన్ లో. దీని ప్రైస్ 12,999 రూ. దీనితో తీసే ఫోటోలు ఈ బడ్జెట్ లో తీయవలసిన క్వాలిటీ కాదు. ధరకు కన్నా చాలా ఎక్కువ నాణ్యత ఇస్తుంది. ఒరిజినల్ కలర్స్, natural వైట్ బాలన్స్, మంచి షార్ప్ నెస్ ఉన్న దీనిలో అన్నిటికంటే బెస్ట్ పాయింట్ low లైటింగ్ లో కూడా impressive ఫోటోస్ ఇస్తుంది.
ఇవి కూడా మంచి కెమెరా ను అందించగల ఫోనులు..
OnePlus 3, HTC 10
OnePlus 3 ఫోన్ ప్రతీ లిస్టు లో కచ్చితంగా ప్లేస్ సంపాదించుకుంటుంది. దీనిలో కూడా depend అవగలిగే కెమెరా ఉంటుంది.
మరొక ఫోన్ HTC 10 - దీనిలో కూడా గ్రేట్ ఫోటోస్ తీయగలరు.. మరీ ముఖ్యంగా Low లైటింగ్ లో. మంచి కలర్స్. మంచి నాయిస్ eduction algorithms ఉన్నాయి.