ఫోటోగ్రఫీలో ఎవరు ఎంత నిష్ణాతులో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే డిజిటల్ ఫోటోగ్రఫీ అడుగుపెట్టిన దగ్గర నుండి 100 క్లిక్స్ తీస్తే కనీసం ఒకటైనా అద్భుతంగా వస్తుంది. ఆ ఒక్కటీ చాలు కావలసినంత పబ్లిసిటీ చేసుకోవటానికి. దానికి తోడూ తక్కువ క్లిక్స్ లో మంచి ఫోటో తీయాలి అనే నియమాలు వంటివి ఏమి కూడా లేవు. సో డిజిటల్ యుగం లో ఎవరికి ఎప్పుడు, ఏ కెమెరా తో ఆకర్షణీయంగా ఫోటోస్ క్లిక్ అవుతాయో తెలియదు. కావలసినదల్లా తీసిన ఫోటో లేదా ఫోటోలో ఉన్నవారు రిచ్ గా, attractive గా ఉన్నారా లేదా అనేదే. అంతే! వాస్తవ జీవితంలో కన్నా ఫోటోగ్రఫీ జీవితంలో స్టైల్ గా ఉండటం వలన ఎక్కువ ఇందులోనే బతుకుతున్నారు కొంతమంది. రోజుకి ఒక ఫోటో సెషన్ చేసుకొని, కనీసం ఒక ఫోటోకు అయినా ఎక్కువ లైక్స్ వస్తే ఇంక ఆ రోజుకు సంతృప్తి అయిపోయి time వెస్ట్ చేసుకుంటున్నారు. అలా తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడి మిగిలిపోకుండా ఫోటోగ్రఫీ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే కేరిర్స్ ను ఎంచుకొని ముందుకు వెళితే మీరు దీనిపై ఆధారపడి మంచి స్థాయిలో ఉండగలిగే అవకాశాలున్నాయి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ లో బెస్ట్ ఫోటో ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీ యాప్స్ ను పొందిపరచటం జరిగింది. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
VSCO cam
బెస్ట్ సెలెక్షన్ ప్రీ సెట్ filters తో ఫోటోస్ ను మరింత బ్యూటిఫుల్ గా మారుస్తుంది. exposure, temperature, contrast, crop, rotate, fade, vignette కంట్రోల్స్ తో పాటు సొంతంగా VSCO community ఉంది యాప్. కమ్యూనిటీ లో ఫోటోస్ షేరింగ్ అండ్ viewing చేయగలరు.
Photoshop Express
ఇది Adobe Photoshop చే తయారు చేయబడ్డ మొబైల్ ఫోటో ఎడిటింగ్ యాప్. బేసిక్ ఎడిటింగ్,cropping, sharpening, color correction, exposure control ఫీచర్స్ తో పాటు చాలా ఉన్నాయి దీనిలో. యాప్ కు paid version కూడా ఉంది మరింత బెటర్ కంట్రోల్స్ తో.
Snapseed
ఇది బాగా ఫేమస్ యాప్. బేసిక్ ఎడిటింగ్ తో పాటు ఫిల్టర్స్, effects, boarders వంటి ఆప్షన్స్ ఉన్నాయి. Adobe Photoshop కు మోస్ట్ పాపులర్ ప్లగ్ ఇన్స్ తయారు చేసే కంపెనిచే ఇది డెవెలప్ చేయబడింది.
వివిధ ఫిల్టర్స్ తో పాటు బేసిక్ ఎడిటింగ్ ఫీచర్స్ అందిస్తూ మోస్ట్ ఫేమస్ ఫోటో సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇది. డిజిట్ తెలుగు కు కూడా instagram లో అఫీషియల్ అకౌంట్ ఉంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే డిజిట్ తెలుగు(ఐడి - DigitTelugu) డెమో వీడియోస్, క్విక్ రివ్యూస్, ఫోటోస్ అన్నీ చూడగలరు.
Camera 360
రకరకాల మోడ్స్ ఉంటాయి దీనిలో. Easy Camera, Sony Camera, Effects Camera, Self-portrait Camera, Funny Camera, Tilt-shift Camera, Color-shift Camera, Audio Camera etc. ఇవన్నీ వాడటం కూడా చాలా ఈజీ. ఇంకా వివధ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉన్నాయి. క్లౌడ్ ఫీచర్ ద్వారా ఫోటోస్ ను ఇంటర్నెట్ లో సేవ్ చేసుకోగలరు.
Pixlr
ఫిల్టర్స్ మరియు ఎఫెక్ట్స్ ను ఇష్టపడే వారికి ఇది మంచి ఫన్ యాప్. రెగ్యులర్ ఎడిటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
FxCamera
30 కన్నా ఎక్కువ filters అండ్ editing tools తో మీ ఫోటోలను నిజంగా enhance చేస్తుంది ఈ యాప్. ఫోటోస్ కు text అండ్ voice tags యాడ్ చేసి వాటిని organize చేసుకోగలరు. సొంతంగా కమ్యూనిటీ కూడా ఉంది ఫోటోస్ షేరింగ్ మరియు చూడటానికి.
Google Camera
బేసిక్ కంట్రోల్స్ ఉన్నాయి కాని మీ ఫోన్ తో పాటు వచ్చే కెమెరా యప్ లో అంతగా ఇంటరెస్టింగ్ అనిపించకపోతే ఇది నచ్చుతుంది. panaroma మరియు lens blur mode ఉన్నాయి దీనిలో.
Mextures
అద్భుతమైన ఫిల్టర్స్ ఇస్తుంది ఇది. అయితే ఆండ్రాయిడ్ లో లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వారి ఈ లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ ద్వారా ఫిల్టర్స్ ను చూడగలరు.