మీ ఆండ్రాయిడ్ ను కంప్యుటర్ లేదా, లాప్ టాప్ లకు కనెక్ట్ చేసి, ఫోన్లోని మెసేజ్ లను, కాంటాక్ట్స్, ఇంకా యాప్స్ ఇతర డేటా ను అనుసంధానం చేసి, backup, సేవ్, డిలిట్ వంటివి చేసుకునేనందుకు వీలు కలిపించే 5 ఆండ్రాయిడ్ PC Suite లను ఇక్కడ చూడనున్నారు. వీటిని చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి. సాఫ్ట్ వేర్స్ ను డౌన్లోడ్ చేయటానికి వాటి పేర్ల పై క్లిక్ చేయండి.
MobileGo ఫీచర్స్
1. మీ ఫోన్ లో స్క్రీన్ ఏమి చూపిస్తుందో అదే కంప్యుటర్ లో కూడా చూడగలరు - స్క్రీన్ mirroring అంటారు దీనిని
2. గేమ్స్, మెసేజింగ్, యాప్స్ అన్నీ కంప్యుటర్ నుండి కూడా వాడగలరు.
3. రెగ్యులర్ PC Suite ఆప్షన్స్.. backup, restore, యాప్స్, transfering డేటా అన్నీ ఉన్నాయి..
MOBILedit 1. ఇది కంప్లీట్ డేటా మేనేజ్మెంట్ PC suite. రెగ్యులర్ ఫంక్షన్స్ తో పాటు slight గా స్క్రీన్ మిర్రరింగ్ కూడా ఉంది.
2. పై దానిలో ఉన్న ఫీచర్స్ తో పాటు దీనిలో యాప్స్ ను కంప్యుటర్ నుండి చూడగలరు, save అండ్ uninstall చేయగలరు.
MOBO ROBO
ఇది చాలా మందికి తెలిసు. దీని హై లైట్ ఏంటంటే, ఐ ఫోన్ నుండి ఆండ్రాయిడ్ లేదా ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ కు మారుతుంటే mobo robo pc suite ద్వారా కాంటాక్ట్స్ ను transfer చేసుకోగలరు. ఎందుకంటే కేవలం mobo robo ఒక్కటే అటు ఆపిల్ ఇటు ఆండ్రాయిడ్ లో పనిచేస్తే సాఫ్ట్ వేర్/యాప్.
1. ఫాన్సీ అండ్ useful యూజర్ ఇంటర్ఫేస్ - ఫంక్షన్స్
2. దీనిలో స్ట్రాంగ్ గా పనిచేసే ఎలిమెంట్, ఫైల్ మేనేజర్. మీడియా trasfer లో చాలా ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా చూపించి, యాప్స్, సాంగ్స్, ఇమేజెస్ అన్నీ డౌన్లోడ్ చేయగలిగే sources ఇస్తుంది PC suite లోనే.
AirDroid
హైలైట్స్-
1. ఫోన్లోని నోటిఫికేషన్స్ కంప్యుటర్ కు కూడా వస్తాయి దీని ద్వారా
2. కంప్లీట్ text మెసేజింగ్ సపోర్ట్. అంటే మీరు దీని నుండి సెండ్ చేయగలరు, అలాగే మెసేజెస్ రిసివింగ్ కూడా పొందగలరు దీనిలోనే.
3. ఇక పైన చెప్పుకున్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి.
Droid Explorer స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ లేదు. కాంటాక్ట్స్, మెసేజెస్, మీడియా transfer వంటి రెగ్యులర్ ఆప్షన్స్ అన్ని ఇస్తుంది.
MOBO GENIE అనే మరొక ఆండ్రాయిడ్ PC suite ఉంది కాని ఇది ఏదైనా unsual లాంటి వెబ్ సైట్ స్ఓపెన్ చేస్తే, ఆటోమేటిక్ గా apk ఫైల్ డౌన్లోడ్ అవటం వంటి యాడ్ ప్రొమోషన్స్ వంటివి చేసింది. అందుకే పర్సనల్ గా రికమేంట్ చేయలేను. కాని దీనితో రూటింగ్ కూడా చేయగలరు ఫోన్ ను.