10 నుండి 15 వేల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోరుకునే వారికోసం తగిన లిస్ట్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. ఈ లిస్ట్ లో అందించిన ఫోన్లు విశ్వసనీయమైన పెర్ఫార్మెన్స్ తో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తాయి.
ఈ ఫోన్లు మీరు ఆశించే బడ్జెట్ లోనే మీకు తగిన ఫీచర్లు మరియు స్పెక్స్ తీసుకువస్తాయి. మీ బడ్జెట్ లో మీరు కోరుకునే కెమెరా, డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి ముఖ్యమైన డిటైల్స్ ఈ ఫోన్ల సొంతం. మరింకెందుకు ఆలశ్యం 10 నుండి 15 వేల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమిటో చూసేద్దాం పదండి.
రెడ్ మీ 1ఓ స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల సెగ్మెంట్ లో విశ్వసనీయమైన పర్ఫార్మెన్స్ మరియు బిగ్ బ్యాటరీ తో వచ్చే ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 SoC మరియు 6,000 mAh హెవీ బ్యాటరీ వంటి ప్లస్ పాయింట్స్ ను కలిగి వుంది. Check Price Here
మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి22, కేవలం 10 వేల రూపాయల ధరలో స్టాక్ ఆండ్రాయిడ్ కోరుకునే వారికి గొప్ప అప్షన్. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ గల బిగ్ 5,000mAh బ్యాటరీ మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. Check Price Here
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో కూడా దాదాపుగా రెడ్ మి 10 వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు 10 వేల రూపాయల సెగ్మెంట్ లో గొప్ప ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ కలిగిన బిగ్ 6,000mAh బ్యాటరీ మరియు డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. Check Price Here
10 వేల రూపాయల ధరలో పోకో C3 స్మార్ట్ ఫోన్ ను విశ్వసనీయమైన పెర్ఫార్మెన్స్ మరియు బిగ్ 5,000 mAh బ్యాటరీ కలిగిన డీసెంట్ ఎంట్రీ లెవల్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీ మరియు గొప్ప బ్యాటరీ లైఫ్ తో ఉంటుంది. Check Price Here
10 వేల రూపాయల బడ్జెట్ ధరలో గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం ఫోన్ చూసేవారికి ఇది గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ఫోన్ Helio G85 SoC, పెద్ద డిస్ప్లే మరియు హెవీ 6,000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Check Price Here
షియోమి రెడ్ మి 10ఎ స్మార్ట్ ఫోన్ 'దేశ్ కా స్మార్ట్ ఫోన్' క్యాప్షన్ తో ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మాటకు తగ్గట్టుగానే 10 వేల ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్, గొప్ప బ్యాటరీ లైఫ్ మరియు పెద్ద డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగివుంది. Check Price Here
రియల్ మి సి31 10 వేల రూపాయల బడ్జెట్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించగల క్లాసీ లుక్ కలిగిన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ క్లాసీ డిజైన్, స్లిమ్ బిల్డ్ మరియు గొప్ప బ్యాటరీ లైఫ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. Check Price Here
రెడ్ మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల ధరలో నమ్మదగిన పర్ఫార్మర్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ FHD+AMOLED స్క్రీన్, 50MP క్వాడ్ కెమెరా మరియు 5,000 mAh వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. Check Price Here
15 వేల ధరలో 5G ఫోన్ కోరుకునే వారికి రియల్ మి 9 5జి గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Dimensity 810 SoC, 48MP క్వాడ్ కెమెరాతో పాటుగా 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టి కలిగివుంది. Check Price Here
15 వేల ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు పవర్ ఫుల్ బ్యాటరీని కోరుకునే వారికి శామ్సంగ్ గెలాక్సీ ఎం21 ఫోన్ నమ్మదగినది. ఈ ఫోన్ సూపర్ AMOLED స్క్రీన్, 48MP ట్రిపుల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh హెవీ బ్యాటరీ తో పాటుగా 20MP సెల్ఫీ కెమెరా కలిగివుంది. Check Price Here
రెడ్ మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ 15 వేల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ గేమింగ్ SoC తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G88, 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, 50MP క్వాడ్ కెమెరా మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. Check Price Here
స్వదేశీ కంపెనీ మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన ఇన్ నోట్ 2 ఫోన్ పవర్ ఫుల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ తో పాటు అల్ రౌండ్ ప్రతిభను కనబరచగలదు. ఈ ఫోన్ Helio G95 SoC, 48MP క్వాడ్ రియర్ కెమెరా, FHD+AMOLED డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. Check Price Here
15 వేల రూపాయల బడ్జెట్ ధరలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి ఇది గొప్ప అప్షన్. ఈ ఫోన్ బిగ్ FHD+AMOLED డిస్ప్లే, స్టాక్ ఆండ్రాయిడ్ 12, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీ తో పాటుగా 50MP ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. Check Price Here
రియల్ మి ఐ స్మార్ట్ ఫోన్ 15 వేల ధరలో పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 SoC, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగివుంది. Check Price Here