బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jul 07 2015
బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

చాటింగ్ చేసుకునేందుకు ఆండ్రాయిడ్ లో చాలా అప్లికేషన్లు ఉన్నాయి. కాని వాటిలో కొన్ని మాత్రమే నిజంగా రియల్ లైఫ్ వాడుకలో ఉపయోగ పడే ఫీచర్స్ ఇస్తున్నాయి. రెగ్యులర్ ఫేమస్ చాట్ యాప్స్ ను ఇక్కడ పొంది పరచటం లేదు. మీకు తెలియని ఫీచర్స్ తో కొన్ని మెసేజింగ్ (స్టాండర్డ్ మెసేజింగ్ మరియు చాట్ యాప్స్) అప్లికేషన్స్ ఉన్నాయి. అవి మీకు తెలియజేయటానికే ఈ స్లైడ్ షో.  ఈ యాప్స్ ను వాటి పేరు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు.

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

RakEM

  • మీరు మీ దగ్గరి వారికి కాని లేదా ఎవరికైనా అనుకోకుండా మెసేజ్ పంపెసారా? దానిని డిలిట్ చేసుకునే ఫీచర్ ఇస్తుంది ఈ చాట్ అప్లికేషన్.
  • ఈ వీడియో లింక్ చూడండి అంతా సింపుల్ గా అర్థమైపోతుంది, ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుందో.

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Textra SMS

  • ఇది బేసిక్ మెసేజింగ్ యాప్ కు రిప్లేస్మెంట్. చాట్ యాప్ కాదు
  • పాప్ అప్ నోటిఫికేషన్లు
  • షెడ్యూల్డ్ sms sending
  • క్విక్ sms రిప్లై 

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Mighty TEXT

  • స్టాండర్డ్ మెసేజింగ్ యాప్. చాట్ యాప్ కాదు.
  • PC నుండి sms చేయటం దీని ప్రత్యేకత
  • sms షెడ్యూలింగ్ కూడా ఉంది

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

JOTT MESSENGER

  • AirChat ఆప్షన్ తో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్, లేదా WiFi లేకుండా పని చేసే చాట్ యాప్
  • మీ కాలేజ్ లో లేదా ఆఫీస్ లో ఉన్నప్పుడు అందరూ కలిసి ఫ్రీ గా చాట్ చేయగలరు.
  • ప్లే స్టోర్ లో మాత్రం రేటింగ్ తక్కువుగా ఉంది.

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Zello PTT Walkie Talkie

  • ఇది చాటింగ్ యాప్ కాదు. వాకీ టాకీ లాంటిది.
  • జస్ట్ బటన్ ప్రెస్ చేసి ఫ్రెండ్స్ తో live వాయిస్ టాకింగ్ చేయగలరు.
  • ఇంటర్నెట్ ఉంటే చాలు

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Way2SMS

  • మీకు మెసేజ్ చేయటానికి ఎక్కువ చార్జ్ చేస్తుందా నెట్వర్క్? అయితే ఇంటర్నెట్ ద్వారా sms చేయగలరు. 
  • జస్ట్ మీ ఫోన్ నంబర్ తో ఎకౌంట్ ఉంటే చాలు.

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Telegram

  • ఇది చాలా మంచి ఫీచర్స్ తో బెస్ట్ చాట్ అప్లికేషన్
  • సిక్రెట్ చాటింగ్
  • నో Ads
  • బెస్ట్ ప్రైవెసి ఫీచర్స్
  • hashtag ద్వారా ఫ్రెండ్స్ కు గ్రూప్ లో మెసేజ్ పోస్ట్ చేస్తే ఆ గ్రూప్ ను వాళ్లు సైలెంట్ లో పెట్టుకున్నా hashtag వలన నోటిఫికేషన్ వెళ్తుంది.
  • ఇమేజెస్, వీడియోస్ అవి మీరు డౌన్లోడ్ చేసి చూసిన, అవి మీ ఫోన్ లో స్టోర్ అవకుండా ఆప్షన్ పెట్టుకోగలరు
  • టెలిగ్రాం id ద్వారా ఉపయోగిస్తారు. ఇది తెలిసిన వాళ్లు ఎవరైనా మీతో కనెక్ట్ అయ్యి మాట్లాడగలరు

బెస్ట్ ఫీచర్స్ ఉన్న చాటింగ్ అప్లికేషన్స్

Google Messenger

  • ఇది గూగల్ డెవలప్ చేసిన స్టాండర్డ్ మెసేజింగ్ అప్లికేషన్
  • అనవసర మెసేజ్ లను డిస్టర్బ్ చేయకుండా బ్లాక్ చేయటం  దీనిలో ఉండే ఏకైక యూజ్ఫుల్ ఫీచర్