బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Feb 12 2022
బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ మొబైల్ మార్కెట్ ని స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్లు బాగా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే, మొబైల్ లో చేసే అన్ని పనుల కంటే,మొబైల్ కెమెరాటోన్ ఎక్కువ అవసరం అవుతుంది.యూత్ తో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రతి క్షణాన్ని తమ గుప్పెట్లో పట్టుకొవడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ప్రపంచానికి వారి గురించి వెల్లడించాలనే ఉత్సాహాం కూడా ఇందుకు కారణం. నేటి సార్ట్ ఫోన్ కెమెరా పరిధులు మరింతగా విస్తరించబడ్డాయి. అందుకే, బడ్జెట్ ధరలో కూడా 48MP, 64MP మరియు 108MP వరకూ భారీ కెమెరాలతో వచ్చే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను గురించి ఈరోజు చూద్దాం.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Redmi Note 11s:

ఈ స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ లను కూడా కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది. నోట్ 11s వెనుక క్వాడ్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP Samsung HM2 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో మరియు 2MP డెప్త్ కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు FHD లో 30fps వరకూ రికార్డ్ చేయగలదు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈఫోన్ 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Realme 8 Pro

ఈ Realme 8 Pro ఒక 6.44 అంగుళాల SuperAMOLED డిస్ప్లేని 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగివుంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో,  f/1.88 ఎపర్చర్ కలిగిన ఒక 108MP Samsung HM2 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ని అందించింది. ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Xiaomi 11i 5G మరియు 11i Hyper Charge 5G

ఈ ఫోన్లు 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 4K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ చెబుతోంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లలో గమనించదగిన వ్యత్యాసం బ్యాటరీ ఫీచర్. Xiaomi 11i 5G ఫోన్ 67W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,160mAh బ్యాటరీతో వస్తే, 11i Hyper Charge 5G మాత్రం 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Motorola Edge 20

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్  6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Vivo V23 5G

Vivo V23 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 64MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది మరియు సెల్ఫీల కోసం ఫోన్‌ ముందుభాగంలో 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఈ ఫోన్ 4200mAh బ్యాటరీని కలిగివుంది మరియు MediaTek డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Realme GT Master Edition 5G

Realme యొక్క ఈ లేటెస్ట్ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0తో వస్తుంది మరియు ఇది 6.43-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 778G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఇందులో, 64MP ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు శక్తిని అందించడానికి, 4300mAh బ్యాటరీని 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Samsung Galaxy M52 5G:

ఈ శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ 6.7 ఇంచ్ FHD+ ఇన్ఫినిటీ 0 డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన SuperAMOLED డిస్ప్లే తో వస్తుంది. వేగవంతమైన Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ ను అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వచ్చింది మరియు వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి + 12ఎంపి + 5ఎంపి కెమెరాలను అందించింది. ఇక ముందుభాగంలో, భారీ 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. గెలాక్సీ M52 5G 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

iQOO Z3 5G

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ 768G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది మరియు 1GB ఎక్స్ టెండడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా FunTouch 11.1 స్కిన్ పైన పనిచేస్తుంది. ఇందులో 64MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ 55W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,400 బ్యాటరీ కూడా వుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Realme 8s

రియల్ మీ 8s ఫోన్ 6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 89GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా RealmeUI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది. ఇందులో 64MP ప్రధాన కెమెరా మరియు జతగా 2ఎంపి B&W పోర్ట్రైట్ కెమెరా మరియు 2ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది.   ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది మరియు ఇది కూడా EIS వీడియో స్టెబిలైజేషన్ కు మద్దతునిస్తుంది.రియల్ మీ 8s ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 5,000 బిగ్ బ్యాటరీతో వస్తుంది.  

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Redmi Note 10 Pro 

Redmi Note 10 Pro స్మార్ట్ ఫోనులో మీరు 64MP ప్రధాన కెమెరాని పొందవచ్చు. దీనితో పాటుగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లు కూడా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం సెల్ఫీ 16ఎంపీ సెల్ఫీ కెమెరాని కూడా ముందు భాగంలో అందించింది. ఈ ఫోన్ పెద్ద 6.67 అంగుళాల FHD+ Super AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Samsung Galaxy M32 5G

ఈ శాంసంగ్ ఫోన్ 6.5 అంగుళాల HD+ ఇన్ఫినిటీ V డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Redmi Note 10T 5G

రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు 22.5W ఫాస్ట్ చార్జర్ బాక్స్ తోపాటుగా వస్తుంది. 

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Realme 8 5G

Realme 85G ఫోన్ 6.5 అంగుళాల పరిమాణంతో 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో FHD+ డిస్ప్లే  మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 4CM మ్యాక్రో మరియు B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఫోన్ ఒక 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.

బడ్జెట్ ధరలో 108MP, 64MP మరియు 48MP బెస్ట్ కెమెరాతో వచ్చిన ఫోన్లు

Realme 9i

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.