ప్రస్తుతం, యువత ఎక్కువగా గేమింగ్ మరియు కెమేరా ప్రత్యేకతలను కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ను ఎంచుకోవడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇందుకు కారణం లేకేపోలేదు. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ యాక్టింగ్ ప్రతిభను నిరూపించుకోవడానికి మరియు మరింత ఫన్ గా లైఫ్ ను ఉంచుకోవడానికి, స్మార్ట్ ఫోన్ను ఒక సాధనముగా ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. TikTok వాటి ఆన్లైన్ వీడియో ప్లాట్ఫారం పైన యువత తమ వీడియోలను చిత్రీకరించండంలో స్మార్ట్ ఫోన్ అందులోనూ మంచి కెమేరా సామర్ధ్యాలను కలిగిన ఫోన్ చక్కగా ఉపయోగపడుతుంది.
అంతేకాదు, ప్రస్తుతం ఒక స్మార్ట్ ఫోన్ ఎంచుకునేవారికి గేమింగ్ కూడా ఒక ప్రధానాంశంగా మారింది. PUBG మరియు Aspalt 9 వంటి భారీ గేమ్స్ కి సపోర్ట్ చేయగల స్మార్ట్ ఫోన్లను ఎంచుకోవడానికి మక్కువ చూపుతున్నారు. అందుకోసమే, ప్రస్తుతం కేవలం రూ.10,000 ధరలో బెస్ట్ గేమింగ్ & కెమేరా స్మార్ట్ ఫోన్ల లిస్ట్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. అయితే, మనం అందరం కూడా ఒక్క విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, గేమింగ్ లేదా మరేదైనా ఇతర టెక్నాలజీ కేవలం మనం టైం పాస్ లేదా సరదాగా రిలాక్స్ అవ్వడానికి మనం సృష్టించుకున్న విషయాలు. అన్నింటికీ ఒక సమయాన్ని కేటాయించడం అందరికి మంచింది.
రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో క్వాడ్ కెమెరాల సెటప్పుతో కేవలం బడ్జెట్ ధరలో అత్యధికంగా అమ్ముడవవుతున్ననటువంటి ఈ రియల్మీ 5 స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ఇది ఒక అతిపెద్ద 5,000 mAh బ్యాటరీతో మద్దతునిస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగం నుండి ఉత్తమ ఫోనుగా అవార్డును సొంతం చేసుకుంది.
షావోమి సంస్థ బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, విడుదల చేసినటువంటి ఈ రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 4GB/6GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది ఈ ధరలో ఒక అతిపెద్ద కెమేరా సెటప్పు కలిగిన స్మార్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇది వెనుక 48MP+8MP+2MP+2MP క్వాడ్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కెమేరా విభాగం నుండి ఉత్తమ ఫోనుగా అవార్డును సొంతం చేసుకుంది.
ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో మోటోరోలా నుండి వచ్చినటువంటి స్మార్ట్ ఫోనుగా, ఈ మోటోరోలా వన్ మ్యాక్రో గురించి చెప్పొచ్చు. ఇది ఒక 2.0GHz వద్ద క్లాక్ చెయ్యబడిన మీడియ టేక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 13MP +2MP+2MP AI ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 8MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అలాగే, 2019 డిజిట్ జీరో 1 అవార్డు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ విభాగంలో మూడవ ఫోనుగా తన స్థానాన్ని పదిల పరచుకుంది.
వివో నుండి కేవలం బడ్జెట్ ధరలో కొత్తగా వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.35 అంగుళాల HD+ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, వెనుక 13MP+8MP+2MP ట్రిపుల్ వెనుక కెమెరా మరియు ఒక 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం రూ.8,499 రూపాయల ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది 2.2 GHz వద్ద క్లాక్ చేయబడిన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది వెనుక 48MP + 5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 13MP సెన్సారును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ను ప్రస్తుతం 8,999 రుపాయల ప్రారంభదరతో కొనవచ్చు.
శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 30 స్మార్ట్ ఫోన్, ముందుగా మిడ్ రేంజ్ ధరలో అమ్ముడవుతుండగా, ప్రస్తుతం ఇది కేవలం రూ.9,499ప్రారంభదరతో లభిస్తుంది. ఈ ఫోన్ వెనుక 13MP +5MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి అదనంగా, 5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.
శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో HD రిజల్యూషన్ అందించగల సూపర్ AMOLED వస్తుంది మరియు దీనికి అదనంగా, 4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది. ఈ ఫోన్ సంస్థ యొక్క ఎక్సినోస్ 7884B ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజితో వస్తుంది మరియు దీన్ని కేవలం రూ.7,999 ధరతో కొనవచ్చు.
హానర్ నుండి ముందుగా మిడ్ రేంజ్ ధరలో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం కేవలం రూ.9,999 ధరతో అమ్ముడవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల FHD+ డిస్ప్లే తో వస్తుంది. ఒక 16MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్, 2.2 GHz వద్ద క్లాక్ చేయబడిన, కిరిణ్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 4GB/6GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 64GB/128GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 20+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 16MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 3750 mAh బ్యాటరీతో ఉంటుంది.
గత సంవత్సరం మంచి స్పెక్స్ తో రియల్మీ లాంఛ్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్లలో రియల్మీ 3 ప్రో ఒకటిగా చెప్పొచ్చు. వాస్తవానికి, ముందుగా మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్, ప్రస్తుతం కేవలం రూ.9,999 రుపాయల ప్రారంభదరలో లభిస్తుంది. ఈ ఫోన్, ఒక 6.3 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే (2340x1080) FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 25 MP సెల్ఫీ కెమెరా, 16MP+5MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 4045mAh బ్యాటరీతో వస్తుంది.ఈ ప్రధాన 16MP కెమేరా SonyIMX 519 సెన్సార్ కావడం విశేషం. ఈ ఫోన్, గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది PUBG మొబైల్ గేమ్ ను ఆడుకొవడానికి అనువైన ఫోనుగా చెప్పొచ్చు.
షావోమి నుండి ముందుగా బెస్ట్ కెమేరాతో వచ్చిన ఈ కెమేరా ఫోన్, 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 FHD+ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 48MP +5MP డ్యూయల్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.9,999 దరతో లభిస్తోంది. వాస్తవానికి, ఇది ముందుగా 13,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇందులోని ప్రధాన 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో వస్తుంది.