ఫోన్ లోనే వీడియో, ఆడియో, photos, gifs, రింగ్ టోన్స్ ఇలా అన్నీ ఎడిటింగ్స్ చేయగలిగే బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్. యాప్ పేరు Video2me. ప్లే స్టోర్ లో దీని సైజ్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. 19MB ఉంది సుమారు. కాని ఇది చేయగలిగే పనులు unlimited అని చెప్పాలి. క్రింద స్క్రోల్ చేయండి మరింత సమాచారం కొరకు.
వీడియో సెగ్మెంట్ లో ఇది చేయగలిగే పనులు...
వీడియో కు టెక్స్ట్ యాడ్ చేయటం, వీడియో ను కట్ చేయటం , వీడియో సైజ్ తగ్గించటం, crop చేయటం, వీడియో ను ఆడియో కు మరియ GIF ఇమేజ్ గా కన్వర్ట్ చేయటం ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి.
ఆడియో విభాగంలో చేయగలిగే పనులు..
ఆడియో సెట్టింగ్స్ లో మీ ఫోన్ లో డిఫాల్ట్ రింగ్ టోన్స్ ను మార్చటం. నచ్చిన పాటను రింగ్ టోన్ గా మార్చటం, ఆడియో ఫైల్ కత్తిరించటం చేస్తుంది.
GIF ఇమేజెస్ విభాగంలో చేసే పనులు...
GIF లు క్రియేట్, ఎడిట్, trim, కన్వర్ట్ చేయటం తో పాటు ఉన్న GIF లను crop, సైజ్ reduce, స్పీడ్ ఎడిటింగ్ వంటి అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి..
ఫోటోస్ విభాగంలో చేయగలిగే పనులు...
ఫోటోస్ కు టెక్స్ట్ యాడ్ చేయటం, బ్రైట్ నెస్ మార్చటం, ఫోటో ఫిల్టర్స్, instagram సైజ్ ఫోటోస్ క్రియేట్ వంటి పనులు చేస్తుంది.
ఇతర పనులు...
ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ లో ఎక్కడ చూసినా GIF ఇమేజెస్ బాగా హాల్ చల్ చేస్తున్నాయి. మీ ఫోన్ లోని వీడియో ను లేదా ఏదైనా వీడియో ను GIF గా మారుస్తుంది. మీ ఫోన్ లోని ఫోటోస్ తో GIF క్రియేట్ చేస్తుంది. డైరెక్ట్ గా వాటిని ఫేస్ బుక్, ట్విటర్ లో ఈజీగా ఎటువంటి లింక్స్, లోగోస్ లేకుండా షేర్ చేస్తుంది. స్లో మోషన్ వీడియో ను కూడా క్రియేట్ చేయగలరు. ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేయగలరు యాప్ ను.