ఎప్పుడైనా ఒకే అవసరానికి రెండు మూడు అప్లికేషన్స్ ఉంటే, దేనిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయో దానిని చూస్ చేసుకోవటం మంచిది. కాని ఆ ఫీచర్స్ అన్నీ మీరు వాడేవి అయితేనే ఆ యాప్ ను సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీకు ఉపయోగం లేని ఆ ఫీచర్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యి బ్యాటరీ లైఫ్ మరియు ర్యామ్ స్పీడ్ ను తగ్గిస్తాయి. అలాగే, ఒక్కొక్క అవసరానికి ఒక్కక్క యాప్ ను ఇంస్టాల్ చేసుకోవటం స్మార్ట్ యూసేజ్ కాదు, మీకు కావలిసిన అవసరాలన్నీ ఒకే యాప్ లో తీర్చే యాప్స్ ప్లే స్టోర్ లో చాలా ఉంటాయి. వాటిని తెలుసుకొని ఇంస్టాల్ చేసుకోండి, మీ ఇంటర్నెల్ మెమరీ స్పేస్ కూడా మిగులుతుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే, వాటితో పాటు బేసిక్ ఫీచర్స్ కోసం కొన్ని డిఫాల్ట్ యాప్స్ వస్తాయి. అవే అవసరాలకు వాటి కన్నా బెస్ట్ థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కవు ఫీచర్స్ తో ప్లే స్టోర్ లో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Launcher
అన్ని ఫోనులు తమ సొంత లాంచర్స్ ను ఇస్తుంటాయి. అయితే అవి బేసిక్ ఫీచర్స్ తో మాత్రమే లభిస్తాయి. వాటికీ బెస్ట్ ఆల్టర్నేటివ్..
Google Launcher
ఇది గూగల్ యాప్. సో స్టాండర్డ్ మరియు స్టేబిల్ గా ఉంటుంది.
Nova Launcher
కస్టమైజేషన్ ఎక్కువుగా ఇష్టపడితే, ఈ లాంచర్ ను ఇంస్టాల్ చేసుకోండి. చాలా లంచార్స్ ఉన్నాయి ప్లే స్టోర్ లో కాని నోవా లాంచర్ అన్నిటి కన్నా స్టేబుల్ మరియు ఫాస్ట్ లాంచర్. దీనికి ఐకాన్ ప్యాక్స్ కూడా ఎక్కువుగా ఉన్నాయి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇంస్టాల్ చేసుకొని చూడండి.
కీ బోర్డ్
ఫోన్ తో వచ్చే యాప్స్ లో కీ బోర్డ్ యాప్ ఉంటుంది. కాని డిఫాల్ట్ గా వచ్చే ఆండ్రాయిడ్ కీ బోర్డ్ కన్నా మెరుగైనవి చాలా ఉన్నాయి ప్లే స్టోర్ లో.
SwiftKey
ఇది బాగా పాపులర్ కీ బోర్డ్ యాప్. కొంత కాలం వరకూ పెయిడ్ యాప్ గా ఉన్న స్విఫ్ట్ కీ ఇప్పుడు ఫ్రీ గా దొరుకుతుంది. దీనిలో కస్టమైజేషన్ ఎక్కువ. మీరు ప్రతీ లెటర్ పై టైప్ చేయనవసరం లేకుండా జస్ట్ ఆ లెటర్స్ పై వేలుతో స్వైప్ చేసుకుంటూ మీరు టైప్ చేస్తున్న వర్డ్ చివరి లెటర్ వరకూ వెళితే ఆ వర్డ్ ఎంటర్ అయిపోతుంది. దీని సైపింగ్ అంటారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు ఇది అతి పెద్ద ప్లస్ పాయింట్.
Google Keyboard
ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్పేస్ మరియు ర్యామ్ Consumption లేకుండా సింపుల్ గా కావలిసిన మినిమమ్ ఫీచర్స్ తో లభిస్తుంది ఇది. నా ఫేవరేట్ కీ బోర్డ్. Swift Key అన్ని ఫీచర్స్ ఇందులో లేకపోవచ్చు, కాని లేని వాటిని నేను వాడను, నాకు డైలీ లైఫ్ లో అవి ఏమాత్రము ఉపయోగపడవు, స్వైపింగ్ మరియు ఇతర ఫీచర్స్ ఉన్న Google Keyboard ను వాడుతాను. సింపుల్, సెక్యూర్, లెస్ ర్యామ్ యూసేజ్ యాప్.
మ్యూజిక్ ప్లేయర్
డిఫాల్ట్ గా దాదాపు అన్ని ఫోనుల్లో గూగల్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది లేదా ఆండ్రాయిడ్ డిఫాల్ట్ ప్లేయర్ వస్తుంది. ఆ రెండింటి కన్నా చాలా మంచి మ్యూజిక్ యాప్స్ ఉన్నాయి.
Poweramp
దీనిని MusixMatch ప్లేయర్ కన్నా ముందు ప్రస్తావిస్తున్నాము అని MusixMatch కన్నా బెటర్ అని అనుకోకండి. కాని ఇది చాలా మందికి ఇష్టం, కారణం సౌండ్ Equalizer ఆప్షన్స్. కాని సౌండ్ సిస్టం మీ ఫోనులో మరియు హెడ్ ఫోన్స్ లో ఉంటే దీనిపై ఆధారపడనవసరం లేదు.
MusixMatch music & lyrics
ది బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్. దీని స్పెషల్ తెలుగు పాటలకు లిరిక్స్ ను చూపించటం. MusixMatch యాప్ రివ్యూ లో దీని గురించి బాగా తెలుసుకోగలరు ఇక్కడ.
కెమేరా
ఫోన్ తో పాటు వచ్చే స్టాక్ కెమేరా లో ఎక్కువ ఫీచర్స్ ఉండవు. కెమేరా కు ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్స్ లో మొదటిది..
Google Camera
సింపుల్, స్టాండర్డ్, స్టేబుల్ గూగల్ యాప్ ఇది. ట్రూ పాయింట్ అండ్ షూట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది.
Camera FV- 5
దీనిలో కస్టమైజేషన్ ఎక్కువ. Raw ఇమేజెస్ షూటింగ్, సన్ లైట్ ఆప్షన్స్, లాంగ్ ఎక్స్పోషర్ ఇఎమ్జెస్, షట్టర్ స్పిడ్స్ అన్నీ ఇందులో సెట్ చేసుకోగలరు.
Gallery
స్టాక్ ఆండ్రాయిడ్ లో వచ్చే మరో బేసిక్ యాప్, Gallery. దీనికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు.
Quick Pic
ఇది పాపులర్ యాప్, యుస్ఫుల్ ఫీచర్స్ స్పీడ్ దీని ప్రత్యేకత. ఇమేజెస్ లాకింగ్ చేసుకునే ఆప్షన్దీనిలో ఉంది.
Tidy
మంచి ఆర్గనైజింగ్ మరియు ఎడిటింగ్ ఫీచర్స్ ఈ గేలరీ యాప్ లో ఉన్నాయి.
అయితే Scene అనే పేరుతో మరో గేలరీ యాప్ ఉంది. దీనిలో ఫోల్డర్స్ వైస్ గా కూడా మీ ఫోనులోని ఇమేజెస్ చూసుకోవచ్చు. మంచి లుక్స్ ఉంటాయి యాప్ కు. ఒకసారి ఇంస్టాల్ చేయండి మైక్ తెలుస్తుంది.
ఈ మెయిల్
ఈ-మెయిల్ చేసుకోవటానికి ప్రతీ ఫోన్ లో ఆండ్రాయిడ్ తరుపూన E mail యాప్ అని ఉంటుంది. మెయిలింగ్ కోసం బెస్ట్ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి.
Inbox
బీటా స్టేజ్ లో ఉంది ఈ యాప్. ఇది గూగల్ చే డెవలప్ చేయబడిన అప్లికేషన్. attractive లుక్స్, mimimal డిజైన్ ఉంది దీంట్లో. మీ టికెట్స్ మరియు రిమైన్దర్స్ ను చూపిస్తుంది ఆటోమేటిక్ గా.
Nine
మెయిలింగ్ కోసం మరో సింపుల్ యాప్. కావలిసిన ఫీచర్స్ తో లభిస్తుంది.
Browser
ఫోన్ తో పాటు వచ్చే బ్రౌజర్ డౌన్లోడ్ లను కరెక్ట్ గా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. కాని ఆప్షన్స్ తక్కువ.
Google Chrome
మీరు డెస్క్టాప్ లో క్రోమ్ ను వాడుతునట్లు అయితే దీని గురించి తెలుస్తుంది. మీ డెస్క్టాప్ బ్రౌజర్ డేటా (బుక్మార్క్స్, ఫేవరెట్స్, పాస్వర్డ్స్, ఆటో ఫిల్స్, హిస్టరీ) ను మొబైల్ లో కూడా పొందాలి అంటే ఇది కరెక్ట్ బ్రౌజర్. స్టేబుల్ మరియు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి గూగల్ క్రోమ్ మొబైల్ బ్రౌజర్ లో.
UC Browser
డౌన్లోడ్ లకు గూగల్ క్రోమ్ కరెక్ట్ బ్రౌజర్, జావా సపోర్టింగ్ మరియు డౌన్లోడ్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ బ్రౌజర్ అండ్ క్రోమ్ బ్రౌజర్ లో బాగుంటుంది. కాని UC లో ఫాస్ట్ డౌన్లోడింగ్ ను చేసుకోగలరు. స్పీడ్ బ్రౌజింగ్. అలాగే నైట్ మోడ్ ఆప్షన్. అన్నితికన్నా బెస్ట్ ఆప్షన్ పుష్ నోటిఫికేషన్స్ ను సపోర్ట్ చేసే బ్రౌజర్ ఇది ఒకటే. మీకు ఫేస్బుక్ యాప్ ఎక్కువుగా స్పేస్, ర్యామ్ మరియు బ్యాటరీ ను తీసుకుంటుంది అనే అభిప్రాయం ఉందా, అయితే UC ని ఇంస్టాల్ చేసుకోండి, తక్కువ సైజ్, తక్కువ ర్యామ్, తక్కువ బ్యాటరీ లైఫ్ తీసుకుంటుంది కాని మంచి ఫేస్బుక్ UI తో పాటు Fb పుష్ నోటిఫికేషన్స్ ను ఇస్తుంది. UC బ్రౌజర్ లో ఉండే ఆప్షన్స్ చాలా ఎక్కువ, మరి దేనిలోని ఇన్ని ఆప్షన్స్ ఉండవు. ట్రై చేయండి.
UC Browser fast
UC Browser mini
Video ప్లేయర్
డిఫాల్ట్ వీడియో ప్లేయర్ కు బెస్ట్ మరియు ఓన్లీ one టాప్ వీడియో ప్లేయర్ యాప్..
MX Player
ఇది ప్లే చేయని ఫైల్ ఉండదు. ఒక వేల చేయలేదు అంటే అది మీ ఫోన్ హార్డ్ వేర్ సరిపోక ప్లే అవదు. ది బెస్ట్ మరియు పాపులర్ వీడియో ప్లేయర్ యాప్.
File Explorer
ఆండ్రాయిడ్ తో వచ్చే యాప్స్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఒక్కటే మంచిగా సింపుల్ గా ఉంటుంది. కానీ దీనికి కూడా మంచి ఆల్టర్నేటివ్ యాప్స్ ఉన్నాయి.
Ex File Explorer
మోస్ట్ పాపులర్ ఓల్డ్ నెట్వర్క్ డ్రైవ్స్ సపోర్టింగ్ యాప్. అవసరం అయిన ఫీచర్స్ ఉంటాయి. దీని స్పెషన్ ఏంటంటే, వీడియో ప్లేయర్, ఇమేజ్ వ్యూయర్, మ్యూజిక్ ప్లేయర్ కూడా దీనిలో సొంతంగా ఉన్నాయి.