ప్రస్తుతం వినియోగదారుల మొబైల్ వినియోగంలో గణనీయమైన మార్పులు చేసుకున్నాయి. ముందుగా, తక్కువ ధరలో సాధారణమైన ర్యామ్ తో ఒక ఫోన్ను కొనుగోలు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి కనబరిచే వినియోగదారులు, ఇప్పుడు హై ఎండ్ గ్రాఫిక్స్ గేమింగ్, HD వీడియో కంటెంట్ మరియు HD వీడియో కాలింగ్ వంటి వాటిని సునాయాసంగా నిర్వహించగల సామర్ధ్యం కలిగిన ర్యామ్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.
వాస్తవానికి, ప్రాసెసరుకు తగిన ర్యామ్ కూడా ఫోనుకుకచ్చితంగా అవసరమవుతుంది. కాబట్టి, 8GB ర్యామ్ తో వచ్చే స్మార్ట్ ఫోనాల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ హువావే P30 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.7 అంగుళాల డిస్ప్లేతో మరియు గొప్ప కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, హువావే యొక్క సొంత ప్రాసెసర్ అయినటువంటి, హై సిలికాన్ కిరిణ్ 980 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో వస్తుంది. అలాగే, ఇది 40MP + 20MP + 8MP మరియు ఒక ToF సెన్సార్
ఇటీవల, SAMSUNG సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి, ఈ స్మార్ట్ ఫోన్ 8GBర్యామ్ / 128GB స్టోరేజి వేరియంట్ తో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్, 12MP + 16MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరాతో మరియు 10MP + 8MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో అందించింది. ఇది SAMSUNG యొక్క సొంత ప్రాసెసర్ అయినటువంటి, Exynos 9820 ఆక్టా కోర్ ప్రాసెసరుతో నడుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్, ఒక AMOLED డిస్ప్లేతో అందుతుంది. SAMASUNG సంస్థ దీన్ని ఒక ఇన్ఫినిటీ - O డిస్ప్లేతో తీసుకొచ్చింది. శామ్సంగ్, కేవలం తన ఫ్లాగ్ షిప్ ఫోన్లా కోసం మాత్రం ఈ డిస్ప్లేలు తయారు చేసినట్లుగా తెలిపింది. అంతేకాదు, దీనితో మీరు HDR 10+ యొక్క సపోర్టును కూడా తీసుకువస్తుంది. ఈ స్మార్ట్ ఫోను కూడా 8GB ర్యామ్ తో జతగా వస్తుంది.
ఈ రియల్మీ 2 ప్రో ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 OS పెయిన్ నడుస్తుంది మరియు ఒక 3,500 mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్, 19:9 ఆస్పెక్టు రేషియోతోకలిగిన ఒక 6.3 FHD+ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోనుకూడా 8GB ఎంపికతో లభిస్తుంది మరియు జతగా 128GB స్టోరేజితో, కేవలం రూ.15,999 రూపాయల ధరతో లభిస్తుంది.
VIVO నుండి మంచి స్పెక్స్ తో వచ్చినటువంటి ఈ NEX స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ ఎంపికతో లభిస్తుంది. ఇది ఒక 6.59 అంగుళాల FHD +రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది . ఇది మీకు 1080 X 2316 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది.
ఈ OPPO R17 PRO స్మార్ట్ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కొర్ ప్రాసెసరుతో తో వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి ఎంపికతో లభిస్తుంది. ఇందులో అందించనటవంటి VOOC ఛార్జింగ్ టెక్నాలజీతో అత్యంత వేగంగా వేగంగా ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫోనులో ఒక 3,700 mAh బ్యాటరీని అందించారు. ఇది 91.5 స్క్రీన్ టూ బాడీ రేషియో కలిగి ఒక 6.4 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది.
ఈ OPPO FIND X ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి ఎంపికతో లభిస్తుంది. ఇది ఒక FHD+డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది ఎటువంటి బెజెల్స్ లేకుండా ఉంటుంది. అలాగే, ఇది ఒక 91.8% బాడీ టూ స్క్రీన్ రేషియాతో వస్తుంది మరియు మంచి విక్షణానుభూతిని అందిస్తుంది. ఇక వెనుక భాగంలో ఒక 16MP + 20MP డ్యూయల్ కెమేరా మరియు ముందు భాగంలో ఒక 25MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
ASUS నుండి ఒక స్నాప్ డ్రాగన్ 845 ఆకతా కోర్ ప్రాసెసరుకు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి తో వచ్చిన ఈ ROG స్మార్ట్ ఫోన్ చాల వేగంగా పనిచేస్తుంది. ఇది ఒక 2.96 GHz వద్ద క్లాక్ చెయ్యబడింది కాబట్టి చాల శక్తివంతంగా ఉంటుంది. అలాగే ఇది ఒక 6 అంగుళాల FHD + AMOLED డిస్ప్లేతో వస్తుందికాబట్టి మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది.
ఈ OPPO R17 స్మార్ట్ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 670 ఆక్టా కొర్ ప్రాసెసరుతో తో వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి ఎంపికతో లభిస్తుంది. ఇందులో అందించనటవంటి VOOC ఛార్జింగ్ టెక్నాలజీతో అత్యంత వేగంగా వేగంగా ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. ఇది ఒక 6.4 అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది.
ONEPLUS గత సంవత్సరం విడుదలైన, ఈ 6T స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చాల మంచి పేరునే సంపాదించింది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 8GB ర్యామ్ తో శక్తినందిస్తుంది. ఇందులో అందించిన 6.41 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో అత్యదికంగా 401ppi డెన్సిటీతో, కంటెంట్ ని చాలా గొప్పగా ఆస్వాదించవచ్చు.