ఇండియాలో ఎక్కడ చూసిన 5G మొబైల్ హవా నడుస్తోంది. 5G నెట్ వర్క్ ఇండియాలో లాంచ్ అయిన తరువాత 5G మొబైల్ కోసం ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. 5G మొబైల్ ద్వారా కేవలం 5G నెట్ వర్క్ స్టార్ట్ అవ్వడమే కాదు, సింపుల్ గా ప్రస్తుతం వాడుతున్న అదే 4G SIM కార్డ్ పైన 1Gbps స్పీడ్ తో 5G డేటాని కూడా ఆనందించవచ్చు.
Jio మరియు Airtel టెలికం కంపెనీలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తమ 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. 4G రీఛార్జ్ పైనే 5G లాభాలను కూడా అందుకోవచ్చు. Jio అయితే ఒకడుగు ముందుకు వేసి 5G Unlimited డేటాని కూడా అర్హత పొందిన యూజర్లకు అఫర్ చేస్తోంది.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీ 4G ఫోన్ నుండి 5G మొబైల్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే, ఇండియన్ మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ 5G మొబైల్ అదీకూడా రూ.25,000 లోపలే లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ పైన ఒక లుక్కేయండి.
ధర: రూ.10,999
బడ్జెట్ ధరలో ఇండియన్ మొబైల్ బ్రాండ్ అందించిన 5G స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G మరియు ఈ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో లభిస్తున్న ఏకైక ఫోన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ 5Gరెడీ ఫోన్ మరియు 50MP ట్రిపుల్ కెమేరా, బిగ్ డిస్ప్లే, ప్రీమియం గ్లాస్ డిజైన్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
ధర: రూ.11,499
ఈ ఫోన్ కూడా అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమేరా, Dimensity 700 5G ప్రోసెసర్ మరియు 5000mAh పెద్ద బ్యాటరీతో వస్తుంది.
ధర: రూ.11,499
ఈ ఫోన్ కూడా 12 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 810 5G ప్రోసెసర్, FHD+ డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమేరా, 5000 mAh పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఎక్స్ టెండేడ్ ర్యామ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఉంటుంది.
ధర: రూ.12,999
శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G SoC ని కలిగి వుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమేరా, 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే, 15 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వుంది.
ధర: రూ.13,999
షియోమి యొక్క బడ్జెట్ 5G ఫోన్ గా రెడ్ మి 11 ప్రైమ్ 5g నిలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G, 50MP డ్యూయల్ రియర్ కెమేరా, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే మరియు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ పోకో ఫోన్ 15 వేల సెగ్మెంట్ లో బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఫోన్ 6.6 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమేరా, Dimensity 810 5G ప్రోసెసర్ మరియు 33MMT సపోర్ట్ తో 5000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది.
ధర: రూ.13,999
ఐకూ బడ్జెట్ 5G ఫోన్ గా iQOO Z6 Lite 5G కూడా ఈ బడ్జెట్ ధరలో బెస్ట్ 5G ఫోన్ గా చెప్పబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4Gne 1 SoC తో వస్తుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమేరా, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది.
ధర: రూ.14,490
ఈ శామ్సంగ్ ఫోన్ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ Exynos 1330 5G ప్రోసెసర్,90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమేరా, 6000 mAh హెవీ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు RAM Plus సపోర్ట్ వంటి ఫీచర్లతో ఉంటుంది.
ధర: రూ.15,999
మోటోరోలా ఇటీవల అందించిన ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ Fluid డిస్ప్లే, Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్స్, 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా, నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12OS, 5000 mAh బిగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు వున్నాయి.
ధర: రూ.16,599
ఇన్ఫినిక్స్ యొక్క ఈ 5G మొబైల్ ఈ సెగ్మెంట్ లో Dimensity 920 5G ఫాస్ట్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ ఫినిష్ డిజైన్, బిగ్ FHD+ డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమేరా, 33ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.
ధర: రూ.17,999
ఈ రెడ్ మి 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 Gne 1 5G ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 6.6 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 48MP ట్రిపుల్ రియర్ కెమేరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వున్నాయి.
ధర: రూ.18,999
పోకో యొక్క ఈ 5G స్మార్ట్ ఫోన్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో బెస్ట్ 5G ఫోన్ గా చెప్పబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC తో వస్తుంది. ఈ ఫోన్ 64MP ట్రిపుల్ రియర్ కెమేరా, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ సూపర్ AMOLED డిస్ప్లే మరియు 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 mAh బిగ్ బ్యాటరీతో పాటుగా Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కలిగి వుంది.
ధర: రూ.18,999
రియల్ మి 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో 108MP కెమేరాతో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ బౌండ్ లెస్ డిస్ప్లే మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ తో 5000 mAh బ్యాటరీని కలిగి వుంది.
ధర: రూ.18,999
వన్ ప్లస్ బ్రాండ్ నుండి బడ్జెట్ ధరలో వచ్చిన ఫోన్. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 6GB ర్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ మరియు వెనుక 64MP AI ట్రిపుల్ కెమెరా సిస్టం వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
ధర: రూ.19,999
వన్ ప్లస్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 108MP కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 SoC, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ మరియు Android 13 OS వంటి ఫీచర్లను కలిగి వుంది.
ధర: రూ.22,999
మోటోరోలా యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G+ 5G ప్రోసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ 10bit pOLED డిస్ప్లే, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 50MP+50MP+2MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా, నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS, 5000 mAh బిగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు వున్నాయి.
Redmi K50i 5G
ఈ రెడ్ మి 5G ఫోన్ ఈ 5G ఫోన్ Dimensity 8100 5G SoC తో వస్తుంది. ఈ ఫోన్ 64MP ట్రిపుల్ రియర్ కెమేరా, Dolby Vision సపోర్ట్ కలిగిన 144Hz Fluid డిస్ప్లే మరియు 67W భారీ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5080 mAh బిగ్ బ్యాటరీ వంటి చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది.
ధర: రూ.24,999
ఐకూ నుండి ముందుగా ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు తగ్గింపు ధరలో లభిస్తోంది. ఈ 5G ఫోన్ క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 870 5G SoC తో వస్తుంది. ఈ ఫోన్ 64MP OIS ట్రిపుల్ రియర్ కెమేరా, 120Hz E4 AMOLED రేట్ కలిగిన FHD+ డిస్ప్లే మరియు 80W భారీ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 4700 mAh బిగ్ బ్యాటరీ వంటి చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది.