మీ బడ్జెట్ లో భారతీయ మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, మీరు సరైన చోటికే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు కేవలం రూ.10,000 నుండి రూ.20,000 ధరలో భారతీయ మార్కెట్ లో లభిస్తున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ గురించి చుడనున్నాము. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క ప్రస్తుత మార్కెట్ ధర, స్పెక్స్ మరియు వివరాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
ధర : రూ.10,999
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది.
ధర : రూ.11,999
ఈ POCO M4 5G ఫోన్ 6.58 అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్ ను పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది. పోకో ఎం4 5G వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 2MP సెన్సార్ వుంది. ముందుభాగంలో, 8ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 5G స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.
ధర : రూ.13,999
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
ధర : రూ.13,999
ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.
ధర : రూ.14,999
రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. Realme 9i స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 8MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.
ధర : రూ.14,999
శామ్సంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు One UI 4.1 సాఫ్ట్ వేర్ తో వుంటుంది. కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ డెప్త్ మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
ధర : రూ.14,999
ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నడుస్తుంది.
ధర : రూ.15,990
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. వివో T1 5జి ఫోన్ లో వెనుక 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.
ధర : రూ.16,499
పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC తో వస్తుంది. అలాగే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది మరియు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగివుంది.
ధర : రూ.16,999
మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.
ధర : రూ.17,999
రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.
ధర : రూ.18,999
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ స్క్రీన్ ని 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేతో కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.
ధర : రూ.18,999
వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.
ధర : రూ.19,999
రెడ్ మి నోట్ 11 ప్రో+ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 108MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను కలిగివుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.
ధర : రూ.19,999
మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.
ధర : రూ.19,999
రియల్ మీ 9 5G SE ఫోన్ 6.6-అంగుళాల 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ LCD స్క్రీన్‌ను 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10, DCI-P3 కలర్ గామట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ప్యాక్ చేస్తుంది. స్పీడ్ ఎడిషన్ వెనుకవైపు, 48MP ప్రధాన సెనర్ తో పాటు 2MP మాక్రో ప్లస్ మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన కెమెరాను పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ ను కలిగివుంది. ఈ ఫోన్‌లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0 తో వస్తుంది.
ధర : రూ.21,890
వివో వి23e 5G స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ కలిగి వుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 810 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. అధనంగా, ఎక్స్ టెండెడ్ RAM 2.0 ఫీచర్ తో 4GB వరకూ వర్చువల్ ర్యామ్ అందుతుంది. V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరా మరియు వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.