మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 20 2016
మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

ఇప్పుడు అందరూ one year దాటితే చాలు వాళ్ల స్మార్ట్ ఫోన్ మార్చటానికి ఆశక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం మొబైల్ మార్కెట్ లో రోజుకు ఒక మోడల్ తక్కువ ధరకు ఎక్కువ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో రావటమే. సో గతంలో వాడిన పాత బేసిక్ బ్లాక్ అండ్ వైట్ మరియు కలర్ ఫోనులను సెకెండ్ హ్యాండ్ లో అమ్మటం, ఉచితంగా ఎవరికైనా ఇవ్వటం లేదా వెస్ట్ గా పరిగణించి ఒక మూలన విడిచి పెట్టడం చేస్తుంటారు. కాని ఇప్పటికీ వాటి వలన ఉండే 5 మంచి ఉపయోగాలు చూద్దాం రండి. ఇవి సింపుల్ uses. కాని కొన్ని నెలలు పాటు స్మార్ట్ ఫోన్ వాడిన వారికీ సడెన్ గా వీటినుండి ఆ అవసరాలు తీర్చుకోవటం కచ్చితంగా ఇష్టపడే విషయం. ఎందుకంటే చాలా ఈజీగా అవసరాలు తీర్చటం ఒక కారణం అయితే రెండవది మిమ్మల్ని గతంలోకి తీసుకువెళ్లటం. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

అత్యవసర ఫోన్
మీరు ప్రస్తుతం వాడిన ఫోన్ సడెన్ గా రిపేర్ వచ్చి లేదా సర్వీస్ సెంటర్ కు తీసుకు వెల్ల వలసి వస్తే సరైన సమయంలో రెండవ ఫోన్ గా బెస్ట్ యూజ్ఫుల్. మీ మిత్రుల దగ్గరా రెండు ఫోనులు ఉండవు. అందరూ డ్యూయల్ సిమ్ ఒకే హాండ్ సెట్ లో వాడుతుంటారు. సో మీ పాత ఫోన్ ను దాచుకుంటే అత్యవసర సమయాల్లో బెస్ట్ యూజ్ఫుల్ అవుతుంది.

మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

FM రేడియో
మీ ఫోన్ లో రేడియో ఉందా, అయితే నిజంగా బెస్ట్ టైమ్ పాస్, ఎప్పుడూ లేటెస్ట్ సాంగ్స్ కలెక్షన్ ను స్మార్ట్ ఫోన్ లో వింటూ ఉండే మనకు ఒక్కసారి FM ఆన్ చేసి, అన్నీ చానెల్స్ ట్యూన్ చేయండి. కచ్చింతంగా ఆనందిస్తారు. ఇవి ఇంటిలో ఎప్పుడూ వంటి ఇంటిలో గడిపే అమ్మకు బాగా కాలక్షేపం అవుతుంది. జస్ట్ ear ఫోన్స్ ( పాడైనవి అయిన ఫర్వాలేదు, జస్ట్ హెడ్ ఫోన్ కనెక్ట్ చేస్తే చాలు
) కనెక్ట్ చేసి, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరూ వినగలరు కదా! 

మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

ఇంటి అవసరాలు
ఇంటిలో గుర్తుపెట్టుకోగలిగే ప్లేస్ లో దాచి ఉంచితే, టార్చ్ అవసరం వచ్చినా, సడెన్ గా అమ్మకు కాని నాన్నకు కాని calculator లేదా కేలండర్ అవసరం వచ్చినా ఇవి use అవుతాయి.

మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

ఇన్స్టాంట్ మ్యూజిక్
కొన్ని బేసిక్ ఫోనులకు మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. మీ వద్ద 3.5mm ఆడియో జ్యాక్ ఉన్న లౌడ్ స్పీకర్స్ (2.1 or 5.1) ఉంటే, జస్ట్ ఆడియో జ్యాక్ ను ఫోన్ కు తగిలించి, స్పీకర్స్ కు పవర్ కోసం ప్లగ్ తగిలిస్తే చాలు వెంటనే instant గా మ్యూజిక్ వినగలరు. అయితే ఇదే జస్ట్ మీ స్మార్ట్ ఫోన్ స్పీకర్ నుండి కూడా వినగలరు కాని రెండింటికీ చాలా తేడా ఉంది. పైగా స్మార్ట్ ఫోన్ లో మ్యూజిక్ ను లౌడ్ స్పీకర్ లో కాకుండా ear phones లో వినటానికే ఇష్టపడతారు ఎక్కువ శాతం. అలాగే స్పీకర్స్ ను బేసిక్ ఫోన్ కే కాకుండా, మీ స్మార్ట్ ఫోన్ కు కూడా తగిలించి వినవచ్చు కాని మీరు ఏంతో ఇస్టపడి కొన్న ఫోన్ ను చాలా జాగ్రత్తగా వాడుతుంటారు, అది మీతో పాటు మీ పాకెట్ లో ఉంటుంది. పాత ఫోన్ అయితే అదే ప్లేస్ లో ఇంటి దగ్గర ప్లగ్ in చేసి వదిలేవచ్చు. జస్ట్ అన్ లాక్ చేసి మ్యూజిక్ ప్లే చేయటమే. ప్లే లిస్ట్ సపోర్ట్ ఉంటే, ఇంకా బెటర్ మీకు నచ్చిన పాటలను లౌడ్ సౌండ్ లో చాలా తొందరగా వినగలరు. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, బయటకు వెళ్లటానికి తయారవుతున్నప్పుడు కేవలం మ్యూజిక్ వినటానికి pc ఆన్ చేసి, అన్నీ సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవటానికి పట్టే టైమ్ మీ కోరికను చంపేస్తుంది. స్మార్ట్ ఫోన్ తో మీరు చాటింగ్, ఫేస్ బుక్ వంటి పనులతో బిజీగా ఉంటారు సో ఇది కూడా వర్క్ అవుట్ అవదు.

మీ దగ్గర బేసిక్ బ్లాక్ అండ్ వైట్ లేదా ఓల్డ్ అవుట్ డేటెడ్ ఫోన్ ఉందా? అయితే దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే ఉండే 5 లాభాలు..

ల్యాండ్ లైన్
లాస్ట్ అండ్ ఫైనల్ గా.... లాండ్ లైన్ ఫోన్ గా వాడుకోవచ్చు. BSNL మరియు ఇతర ల్యాండ్ లైన్ ఫోనులకు incoming rentals అవీ పే చేయలి. మీరు వాడకపోయినా వాటికీ నెల వారి బిల్స్ వస్తుంటాయి. అవన్నీ escape అవచ్చు ఈ సింపుల్ ఐడియా తో. రెండు మూడు నెలలకు 10 రూ రీచార్జ్ చేస్తే చాలు, సిమ్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. గమనిక: డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.