బాహుబలి అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఒక అద్భుతమైన సినిమా తెలుగు సినిమా చరిత్ర లో మైలు రాయి. ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా తన హావా ను కొనసాగిస్తూ ప్రతీ ఒక్కరి దృష్టి తెలుగు సినిమా పై పడేలా చేసింది.
ఈ మధ్యనే 1600 కోట్ల మైలు రాయి ని కూడా చేరుకోవటం గమనార్హం . అయితే కొంతమంది ఈ సినిమా ని పైరసీ చేసి క్యాష్ చేసుకుంటున్నారు.
ఈమద్యనే బీహార్ లోని ఒక గ్రూప్ రాజమౌళి కి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయటం కూడా అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఏకంగా ఒక వ్యక్తి ఈ సినిమా లింక్ ను పేస్ బుక్ లో పెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఈ సినిమా గురించి ఎక్కడా వెతుక్కోకుండా ఏకంగా యు ట్యూబ్ లో పెట్టాశారు. యు ట్యూబ్ ఓపెన్ చేయగానే టాప్ రో లో కనపడటం గమనార్హం .
అయితే ఆ తరువాత సినిమా యూనిట్ ఈ పని చేసినవారిని పోలీసుల సహాయంతో పట్టుకోవటం మరియు యు ట్యూబ్' నుంచి సినిమా ను తొలగించటం జరిగింది.
అయితే ఈ సారి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారికి చాలా గట్టి శిక్ష ఉంటుందని దర్శకుడు రాజమౌళి బాహాటం గానే ప్రెస్ మీట్ లో వార్న్ చేశారు.