బాహుబలి ఇన్ని రికార్డ్స్ వ్యూ సాధించుటకు వెనుక jio హస్తమేమిటని తెలిసికొనుటకు ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి.
బాహుబలి అంటే తెలుగు సినిమా మరియు తెలుగు సినిమా అంటే బాహుబలి అనే విధముగా తెలుగు ఖ్యాతి ని ఈ విశ్వమంతా చాటి చెప్పేలా రాజమౌళి ఈ సినిమా ను రూపొందించారు. పార్ట్ 1 రిలీస్ అయ్యిన తరువాత అనేక రికార్డ్స్ బద్దలు కొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే.
బాహుబలి పార్ట్ 1 చూసిన తరువాత ప్రపంచం మొత్తం బాహుబలి 2 సినిమా గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది . అయితే ఈ వెయిటింగ్ కి కొంతవరకు తెరపడిందనే చెప్పాలి 16 మార్చ్ న ఉదయం రిలీస్ అయిన బాహుబలి 2 ట్రైలర్ సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ తో దుమ్మురేపుతుంది.
బాహుబలి 2 చిత్ర మేకింగ్ లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీ ది పెద్ద హస్తమే వుంది . విజువల్ ఎఫెక్ట్స్ (VFX) టెక్నాలజీ లేకుండా బాహుబలి చిత్రం పూర్తవటం కష్టమనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ద్వారా వెనుకనున్న బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ గా వచ్చాయని చెప్తున్నారు. అయితే
సాధారణం గా కొన్ని సీన్స్ ను రియల్ షూట్ చేయటం కుదరదు . కానీ అటువంటి సీన్స్ ను చాలా సులభముగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ద్వారా చిత్రీ కరించవచ్చు
విజువల్ ఎఫెక్ట్స్ కంప్యుటర్ లోని యానిమేషన్ సహాయము తో లేదా కంపోజిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా తయారుచేస్తారు. మీరు ఈ చిత్రం ప్రత్యక్షంగా చూసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్రాముఖ్యత ఎంతవుందో తెలుస్తుంది
ఇప్పటివరకు ఏ ఒక్క ఇండియన్ మూవీ కు సాధ్యం కాని విధముగా 24 గంటల్లో 50 మిలియన్ల( 5 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించి ఎనలేని రికార్డ్ సృష్టించింది.
అత్యధిక లైక్స్ ను పొందిన' సినిమాలుగా 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్' లు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు బాహుబలి వీటన్నిటిని తలదన్ని లైక్స్ విషయం లో ముందుకు దూసుకు పోతుంది
ఒక్క తెలుగు యూట్యూబ్ వ్యూస్ కనుక మనం గమనించినట్లయితే (3 కోట్ల 10 లక్షల 26 వేల 406 వందల ) వ్యూస్ ఇప్పటి వరకు సాధించింది. అయితే
మొదట్లో అవెంజర్స్‌కు 5 లక్షల 16 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డ్‌ను తిరగ రాసింది . వ్యూస్ పరంగా అవెంజర్స్‌ను బీట్ చేయలేకపోయినా.. 5 లక్షల 57 వేలకు పైగా లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది.మరి jio కారణం ఏంటని ఆశ్చర్య పోతున్నారా ?
jio తన 4జి సేవలు ప్రారంభించిన తరువాత ఇప్పుడు 4జి హ్యాండ్ సెట్ల వాడకం బాగా ఎక్కువఅయ్యింది. మరియు నెట్ యూస్ చెయ్యని వారు లేరు, అంటే అందరికి చేతిలో రోజంతా ఇంటర్నెట్' సదుపాయం వుంది. ఈ ఒక్క విషయం బాహుబలి రికార్డ్స్ వ్యూస్ కి చాలా వరకు దోహద పడిందనే చెప్పాలి
ఈ నెల ఆఖరున jio ఫ్రీ ఆఫర్స్ ముగుస్తున్నాయి.
ఈ ఆఫర్ కంటిన్యూ కోసం యూజర్స్ ఒకసారి 99 రూ చెల్లించాలిసి ఉంటుంది. 99 రూ చెల్లించి ఈ ప్రైమ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. మరియు తరువాత మీరు ప్రతినెలా 303 రూ చెల్లించి అన్ని సేవలను పొందవచ్చు. ఎలాగైతే హ్యాపీ న్యూ ఆఫర్ దొరికిందో . ఈ ఆఫర్ మార్చ్ 2018 వరకు చెల్లుబాటులో ఉంటుంది . మరియు దీని క్రింద వినియోగదారులు
అపరిమిత లాభాలు పొందుతారు,ఈ jio ప్రైమ్ మెంబర్స్ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద వచ్చే లాభాలను మార్చ్ 31 2018 వరకు పొందవచ్చు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవటానికి మార్చ్ 31 వరకు టైమ్ వుంది , ఆ తరువాత ఈ ప్రైమ్ మెంబెర్ షిప్ దొరకదు
ఈ నెల ఆఖరున ఈ ఫ్రీ ఆఫర్స్ ముగుస్తున్నాయి. సో రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్‌లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు