లేటెస్ట్ గా అసుస్ బ్రాండ్ Computex పేరు మీద ఒక ఈవెంట్ చేసింది. తైవాన్ లో జరిగిన ఈ ఆసుస్ టెక్ షో లో మొత్తం నాలుగు డివైజ్ లను లాంచ్ చేసింది ఆసుస్. వాటిలో ఒకటి జెన్ ఫోన్ Selfie స్మార్ట్ ఫోన్, జెన్ ప్యాడ్ 8 ట్యాబ్లెట్, జెన్ ప్యాడ్ 10 టాబ్లెట్ మరియు ఆసుస్ AIO PC (కంప్యూటర్). వీటిలో జెన్ ప్యాడ్స్ రెండు వేరిఎంట్స్ లో వస్తున్నాయి. మాకు వీటిని చూసే అవకాశం దొరికింది. ఇక్కడ ఈ నాలుగు డివైజ్ ల గురించి కొన్ని విషయలు తెలుసుకుందాం.
ఆసుస్ Zenfone Selfie
క్విక్ specs
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615
RAM: 2 / 4GB
నిల్వ: 16/32 / 64GB
కెమెరా: 13MP వెనుక మరియు 13MP ముందు
OS: Android లాలిపాప్
5.5 in 1080P డిస్ప్లే ఉంది సేల్ఫీ లో
దీని ముందు రిలీజ్ అయిన జెన్ ఫోన్ 2 లానే ఉంది డిజైన్, కాకపొతే పవర్ బటన్ ఫోన్ పైన ఇచ్చారు.
వాల్యూమ్ బటన్ ఫోన్ వెనుక ఉంది. రెండు కెమేరా లకు లేజర్ ఆటో ఫోకస్ మరియు డ్యూయల్ టోన్ led ఫ్లాష్ ఉంది.
సేల్ఫీ ఫోన్ కూడా జెన్ 2 లాగే బ్యాక్ ప్యానల్స్ లో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇది ఆసుస్ జెన్ ప్యాడ్ 8. ఇందులో ఇంటెల్ ఆటమ్ 1.4GHz x3 SoC ప్రాసెసర్. మాలి 450 MP4 GPU. 1జిబి మరియు 2 జిబి ర్యామ్ మరియు 8జిబి, 16జిబి స్టోరేజ్ ల తో రెండు మోడల్స్ లో రిలీజ్ అవుతుంది జెన్ ప్యాడ్. 5MP బ్యాక్ మరియు 2MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి వీటిలో.
డిస్ప్లే 8 in 1280x800P IPS తో వస్తుంది. ఈ టాబ్లెట్ బడ్జెట్ సెగ్మెంట్ మోడల్ అని అర్థమవుతుంది.
జెన్ ప్యాడ్ వెనుక ప్యానల్ ను రిమూవ్ చేస్తే మీకు సిమ్ స్లాట్ మరియు మైక్రో ఎస్డి స్లాట్ కనిపిస్తాయి.
జెన్ ప్యాడ్ ట్యాబ్లేట్ క్రింది భాగంలో హెడ్ ఫోన్స్ జ్యాక్ మరియు మైక్రో USB పోర్ట్ లను అమర్చింది ఆసుస్.
జెన్ ప్యాడ్ ట్యాబ్లేట్ కు సైతం ఆసుస్ బ్యాక్ ప్యానల్స్ కోసం డిఫెరెంట్ కలర్స్ ను దింపింది.
జెన్ ప్యాడ్ కోసం ఆసుస్ ఒక డాల్బీ DTS కవర్ ను వీడియో లు చూడటానికి తయారు చేసింది. ఆ కవర్ లోనే 6 చానల్ ఆడియో సపోర్ట్ ఉంది.
ఇది జెన్ ప్యాడ్ s8, దీనిలో ఇంటెల్ ఆటమ్ Z3580 SoC, 4జిబి ర్యామ్, 16/32/64 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ , 8 MP బ్యాక్, 5MP ఫ్రంట్ కేమేరాస్, 8 in (2048 X 1536) డిస్ప్లే ఉన్నాయి. అయితే ఈ మోడల్ లో కేవలం వైఫై సపోర్ట్ మాత్రమే ఉంది.
ఇది జెన్ ప్యాడ్ 10, 10.1 in ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ఇది. దీనితో కీ బోర్డ్ కూడా వస్తుంది.
కీ బోర్డ్ ను చాలా ఈజీగా ట్యాబ్లేట్ కు తగిలంచ వచ్చు.
ఇది కీ బోర్డ్ క్లోస్ లుక్. మీరు గమనిస్తే పెద్ద స్పీకర్ గ్రిల్ ను కీ బోర్డ్ పై భాగంలో అమర్చింది ఆసుస్.
బ్యాక్ సైడ్ left ఎడ్జ్ లో కెమేరా మాడ్యుల్ ను మీరు గమనించగలరు.
ఇది ఆసుస్ జెన్ ప్యాడ్ 10 ఫుల్ వ్యూ.
దీనికి కూడా కలర్ ఫుల్ బ్యాక్ కవర్ ఆప్షన్స్ ను ఇచ్చింది ఆసుస్.
వీటితో పాటు ఆసుస్ జెన్ AiO PC ను లాంచ్ చేసింది. దీనిలో ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 32 జిబి ర్యామ్ (బెస్ట్ స్పెక్), 512 జిబి PCIe Gen 3x4 SSD హార్డ్ డిస్క్ మరియు Nvidia GTX 960M GPU ను అమర్చబడ్డాయి.
ఆసుస్ PC డిస్ప్లే 21.5 in మరియు 23.8 in సైజులలో లభిస్తుంది. మొత్తం రెండు.
వెనుక పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. USB 3.1 టైప్ C కనెక్టర్ కూడా వెనుక ఉంది.
ఆసుస్ జెన్ AiO లో ఇంటెల్ రియల్ సెన్స్ కెమేరా టెక్నాలజీ ఉంది.