Asus కంపెని జెన్ ఫోన్ 3 కొత్త సిరిస్ లో మూడు ఫోనులను ప్రవేశ పెట్టింది చైనా లో. ZenFone 3, జెన్ ఫోన్ 3 Deluxe మరియు Zenfone 3 Ultra. Asus కంప్లీట్ గా design language ను మర్చి వేసింది. ఫోనుల్లో glass మరియు metal construction ఉంది. ఇంకా హార్డ్ వేర్ పరంగా కూడా ప్రొసెసర్స్ అన్నీ Qualcomm's SoC చిప్ సెట్స్. మరిన్ని డిటేల్స్ తో పాటు ఫోను క్లోజ్ ఇమేజెస్ ను చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
standard Asus ZenFone 3 స్పెక్స్:
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 625
RAM: 3/4GB
Storage: 32/64/128GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0
Asus కంపెని ZenFone 3 సిరిస్ లో కొత్త డిజైన్ ను తీసుకు వచ్చింది. ప్రివియస్ జెన్ ఫోన్లకు ప్లాస్టిక్ బాడీ ఉండేది. కొత్త వాటికీ ఫుల్ మెటల్ Construction. ఇంకా వాల్యూం రాకర్ బటన్స్ కూడా వెనుక నుండి సైడ్స్ కు షిఫ్ట్ చేసింది ఆసుస్.
single 5 magnet speaker system ఉంది ఫోన్ లో. NXP అండ్ స్మార్ట్ AMP తో కూడా equip అయ్యింది. ఇవి సౌండ్ ను ఆటోమేటిక్ గా పెంచటానికి పనిచేస్తాయి.
ZenFone 3 ఫ్రంట్ లో 5.5-inch display, 1920 x 1080p resolution తో వస్తుంది. అయితే చాలా ఫోనులు నేవిగేషన్ బటన్స్ ను ఫోన్ స్క్రీన్ లో కలిపెస్తుంటే, ఆసుస్ మాత్రం ఇంకా హార్డ్ వేర్ సాఫ్ట్ టచ్ నేవిగేషన్ బటన్స్ ఇవ్వటానికి మొగ్గు చూపిస్తుంది.
16MP కెమెరా సోనీ sensor ఉంది వెనుక. దీనికి లేసర్ ఆటో ఫోకస్, 4 axis ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్, PDAF అండ్ డ్యూయల్ tone ఫ్లాష్ కూడా ఉన్నాయి. కెమెరా క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు మీరు చూడగలరు ఇమేజ్ గమనిస్తే.
రెండు వైపులా 2.5D curved Gorilla Glass తో వస్తుంది జెన్ ఫోన్ 3. 7.7mm thin బాడీ. కెమెరా bump ఉంది ఫోన్ వెనుక. Sapphire Black, Moonlight White and Shimmer Gold కలర్స్ లో రానుంది ఫోన్.
మూడింటిలో Asus ZenFone 3 most affordable ZenFone 3 మోడల్. ZenFone 3 Deluxe flagship phone.
Display: 5.7-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 6GB
Storage: 64/128/256GB
Camera: 23MP, 8MP
Battery: 3000mAh
OS: Android 6.0
ZenFone 3 Deluxe ఫోన్ full metal construction మరియు బెటర్ specifications తో వస్తుంది స్టాండర్డ్ జెన్ ఫోన్ 3 మోడల్ తో పోలిస్తే. 7.5mm స్లిమ్ బాడీ తో వస్తుంది. డిస్ప్లే 5.7-inches.
రేర్ కెమెరా కూడా పెద్ద అప్ గ్రేడ్ అని చెప్పాలి. 23MP సోనీ sensor. OIS, PDAF, laser autofocus మరియు dual-tone flash ఉన్నాయి. కెమెరా క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
Asus ZenFone 3 Ultra చూద్దాం రండి ఇప్పుడు... ఇది అతి పెద్ద ZenFone ఆసుస్ బ్రాండ్ లో. 6.8-inch display ఉంది. specifications మాత్రం standard Asus ZenFone 3 మరియు Asus Zenfone 3 Deluxe లానే ఉన్నాయి.
Asus ZenFone 3 Ultra క్విక్ స్పెక్స్ చూడండి ముందుగా..
Display: 6.8-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 625
RAM: 3/4GB
Storage: 32/64/128GB
Camera: 23MP, 8MP
Battery: 4600mAh
OS: Android 6.0
Asus ZenFone Ultra లో డ్యూయల్ స్పీకర్ సిస్టం ఉంది క్రింద. ఎంటర్టైన్మెంట్ పరంగా ఇది మంచి equipment అని చెప్పాలి..
phablet డిజైన్ Asus ZenFone 3 and ZenFone 3 Deluxe ఫోనుల కన్నా భిన్నంగా ఉంది. ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ముందు ఉంది వాల్యూం బటన్ ఫోన్ వెనుక ఉంటుంది.