ఆసుస్ తాజాగా కంప్యుటేక్స్ పేరుతో ఆసుస్ టెక్ షో చేసింది. ఈ ఈవెంట్ లో తన కంపెని నుండి రకరకాల కేతగిరిలకు సంబందించిన ఎలక్ట్రానిక్ డివైజ్ లను లాంచ్ చేసింది. తైవాన్ లో జరిగిన ఈ ఈవెంట్ లో X మరియు K సిరిస్ లో ఆసుస్ నాలుగు లాప్టాప్లను విడుదల చేసింది. ఇంటెల్ కోర్ i3, i5 మరియు i7 ప్రాసెసర్స్ తో వస్తున్న ఇవి విండోస్ 10 కు ఫ్రీ జెన్యూన్ అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. వాటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకోండి.
రెండు సిరిస్ మోడల్స్ లలో ఆన్ బోర్డ్ DIMM సాకేట్ తో 4జిబి DDR3 1600MHz ఉంది. 8జిబి వరకూ పెంచుకునే అవకాశం ఉంది.
x455 మోడల్ కు 14 in (1366 x 768) స్క్రీన్, మరియు x555 మోడల్ కు 15.6 in స్క్రీన్ ఉంది. రెండింటికి ఒకే రిసల్యుషణ్.
రెండింటికి Nvidia GeForce 940M 2జిబి DDR3 V ర్యామ్ అమర్చారు.
ఆసుస్ x555 500జిబి/2TB జిబి హార్డ్ డిస్క్ తో పాటు 128 మరియు 256 జిబి SSD హార్డ్ డిస్క్ ల మోడల్స్ తో కూడా ఉంది. x455 మాత్రం కేవలం హార్డ్ డిస్క్ తోనే వస్తుంది. అదనపు SSD ఆప్షన్స్ లేవు.
x555 మరియు x455 లకు సూపర్ మల్టీ డీవీడీ డ్రైవ్స్ మరియు 802.11 b/g/n వైఫై, బ్లూటూత్ 4.0 ఆప్షనల్ ఎడిషన్ ఉన్నాయి.
వీటిలో సౌండ్ సోనిక్ మాస్టర్ టెక్నాలజీ పవర్ఫుల్ సౌండ్ ఎక్సిపిరియన్స్ ఉంది.
x555 మోడల్ విడ్త్ 25.6 cm ఉండగా, పొడవు 38.2cm ఉంది. బరువు 2.3 KG లు ఉంది.
x455 బరువు 2.1KG బరువు ఉంది. మేసార్మేంట్స్- 34.8x24.28x2.56cm.
ఆసుస్ N సిరిస్ లో N551JQ మరియు N552VX మోడల్స్ ను కూడా లంచ్ చేసింది. 4th జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్ మరియు విండోస్ 8.1 ఉన్నాయి వీటిలో.
ఇవి కూడా సోనిక్ మాస్టర్ ప్రీమియం ఆడియో మరియు HD విడియో కెమేరాలతో వస్తున్నాయి.
రెండింటికి ఏంటి గ్లేర్ FHD IPS 178 డిగ్రి వ్యూయింగ్ ఏంగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. N551JQ మోడల్ కు 17 in డిస్ప్లే ఉంది, N552Vx మోడల్ కు 15.6 in డిస్ప్లే ఉంది.
రెండింటికి ఆప్షనల్ బ్లూ రె డ్రైవ్ ఉంది మరియు ఇతర స్టాండర్డ్ ఫీచర్స్ అలానే ఉన్నాయి.
ఈజీ గా కేరి చేసేందుకు డిజైన్ చేయబడింది. ఆసుస్ క్రోమ్ బుక్స్ రాక చిప్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ లతో 2జిబి ర్యామ్ లతో ఉన్నాయి. ఇవి క్రోమ్ os ను రన్ చేయటానికి సరిపోతాయి. బరువు 0.3KG.
11.6 in HD డిస్ప్లే, HD కెమేరా మరియు 13 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.