మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Sep 04 2015
మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

ఆండ్రాయిడ్ అంటే unlimited ఆప్షన్స్, customisation, యూజ్ఫుల్ యాప్స్, షాపింగ్ with కూపన్స్ అండ్ ఆఫర్స్. ఇన్ని ఇంటరెస్టింగ్ అవసరాలు దీని ద్వారా అందుతున్నాయి. సో ఆండ్రాయిడ్ ఫోన్ లేని వారు దీనిని pc లేదా లాప్ టాప్ లో వాడటానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఆండ్రాయిడ్ అలవాటు గా మారిపోయి, సడెన్ గా స్మార్ట్ ఫోన్ పోవటం, పాడవటం లేదా అస్సలు ఆండ్రాయిడ్ ను ఇంతవరకూ వాడని వారు... ఆండ్రాయిడ్ గురించి తెలుసుకోవటానికి అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు కూడా.. ఇంకా pc లో కూడా సరదాగా ఎలా ఉంటుంది అని టెస్ట్ చేసే వారికి ఈ ఆర్టికల్. వీటిలో ఎక్కువ శాతం సాఫ్ట్ వేర్ల కు లేటెస్ట్ కాన్ఫిగరేషన్ హార్డ్ వేర్ ఉంటే బెటర్. గేమ్స్ వంటివి ఆడేటప్పుడు ఇంటర్నెట్ అవసరం లేదు కాని మిగిలిన సమయాల్లో అవసరం. ఎన్ని విధాలుగా ఆండ్రాయిడ్ ను కంప్యూటర్ లో వాడగలమో తెలుసుకోవటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి. సాఫ్ట్ వేర్ లను డౌన్లోడ్ చేయటానికి టాప్ లో ఉండే వాటి పేర్ల పై క్లిక్ చేయండి.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

BLUESTACKS
దీని పేరు బ్లూ స్టాక్స్. అసలు ఆండ్రాయిడ్ os ను ఫోన్ లో కాకుండా కంప్యూటర్ లో కూడా వాడేలా మొదటిగా వచ్చిన సాఫ్ట్ వేర్ ఇదే. జస్ట్ సాఫ్ట్ వేర్ ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసి, ఇంస్టాల్ చేసి 3 స్టెప్స్ లో సెట్ అప్ చేసి వాడుకోగలరు.
ప్లస్ - ఇది ఫేమస్ అనే కాదు కొంచెం అన్నీ విధాలుగా వాడటానికి అనువుగా ఉంటుంది. అన్నీ యాప్స్ పనిచేస్తాయి.

మైనస్ - ఇది రన్ అయితే pc లో మిగతా పనులు ఏమైనా చేస్తే చాలా స్లో గా ఉంటాయి. సో మీ కంప్యూటర్ లో 4gb లేదా అంతకు మించి ర్యామ్ అండ్ లేటెస్ట్ ప్రొసెసర్ ఉంటే బెస్ట్. అలానే ఫ్రీగా వాడటానికి అప్పుడప్పుడు ప్రొమోషన్ ఫ్రీ యాప్స్ ను ఇంస్టాల్ చేయమని అడుగుతుంది.

పైన పేరుపై క్లిక్ చేసి దీనిని డౌన్లోడ్ చేసుకోండి.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

ARC WELDER
ఇది లేటెస్ట్ గా వచ్చిన మెథడ్. గూగల్ క్రోమ్ బ్రౌజర్ లో extension తో పాటు ఉండే బ్రౌజర్ యాప్స్ ద్వారా వాడగలరు. దాదాపు 130MB సైజ్ లో ఉండే దీని బ్రౌజర్ యాప్ డేటా ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసి, బ్రౌజర్ కు యాడ్ చేసి ఓపెన్ చేసి వాడటమే. ఇది యాప్ డెవలపర్స్ కోసం టెస్టింగ్ చేయటానికి తయారు చేసారు. 
ప్లస్ - సింపుల్, ఫ్రీ అండ్ ఫాస్ట్. సాఫ్ట్ వేర్ ఇన్స్టాలేషన్ ఉండదు. os ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. వాట్స్ అప్ కూడా పనిచేస్తుంది.
మైనస్ - ప్లే స్టోర్ లేదా ఆండ్రాయిడ్ os ఉండదు. యాప్స్ ను సెపరేట్ గా డౌన్లోడ్ చేసి apk ఫైల్ ను లోడ్ చేసి వాడుకోవాలి. అది కూడా ఒక్కొక్క సారి ఒక్క యాప్ మాత్రమే. పైగా అన్ని యాప్స్ పనిచేయవు. అప్పుడప్పుడు గతంలో పని చేసిన యాప్స్ పనిచేయవు.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

GENY MOTION

పైన పేరు మీద క్లిక్ చేసి వెబ్ సైటు కు వెళ్లి, కొత్త GENY అకౌంట్ క్రియేట్ చేయండి.ఇప్పుడు  GET GENY బటన్ పై ప్రెస్ చేసి 127mb  ఉండే సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసి, ఇంస్టాల్ చేయటమే. ఇది virtual box తో రన్ అయ్యే ఆండ్రాయిడ్ emulator.
ప్లస్ - బ్లూ స్టాక్స్ కన్నా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. pc లోని ర్యామ్ ను ప్రొసెసర్ ను ఎక్కువ తీసుకోదు.
మైనస్ - ప్లే స్టోర్ ఉండదు, apk లను డౌన్లోడ్ చేసి వాడుకోవటమే. ఇంస్టాల్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది.



 

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

MANY MO
దీనికి సిస్టం లో ఇన్స్టాలేషన్, డౌన్లోడ్ వంటివి ఏమీ ఉండవు. అంతా ఇంటర్నెట్ లోనే. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి, ఆండ్రాయిడ్ యాప్స్ ను ఆన్ లైన్ లోనే వాడుకోగలరు. పైన పేరు పై క్లిక్ చేసి సైటు లోకి వెళ్ళాక, లాంచ్ ఆన్ ఆండ్రాయిడ్ emulator ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కావలసిన స్క్రీన్ సైజ్ ను ఎంచుకోమని ఆప్షన్స్ ఇస్తుంది. అంతే!
ప్లస్ - వెంటనే టెస్ట్ లేదా అవసరం ఉన్నావాల్లకు బెస్ట్.
మైనస్ - ఇది పెయిడ్ సర్వీస్. మొదటి 10 సార్లు మాత్రమే ఫ్రీ గా వాడుకోగలం.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

ANDY
ఇది కూడా virtual box ఇంస్టాల్ చేసుకొని emulator పద్దతిలోనే వాడగలరు. సాఫ్ట్ వేర్ సైజ్ 2mb సైజ్ లో చిన్నదిగా ఉంటుంది కాని ఇంస్టాల్ అవ్వటానికి చాలా ఇబ్బందులు పడుతుంది. ఒకవేళ అంతా బాగా ఇంస్టాల్ అయి ఓపెన్ అయితే, బ్లూ స్టాక్స్ కన్నా ఫాస్ట్ గా ఉంటే ఇది బెస్ట్. కంపెటబిలిటీ తక్కువ. పైన పేరు పై క్లిక్ చేసి వెబ్ సైటు లోకి వెళ్లి మరింత సమాచారం తెలుసుకోండి.
ప్లస్ - no చార్జెస్. అన్నీ ఫ్రీ. ఎన్ని యాప్స్ అయినా ఎంత కాలం అయినా వాడుకోవచ్చు
మైనస్ - అన్నీ సిస్టం లలో పనిచేయదు. కంపేటబిలిటీ తక్కువ.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

WINDROY
ఇది చైనీస్ సర్వీస్. కాని మీరు పైన ఉన్న దాని పేరు పై క్లిక్ చేస్తే సైటు ఇంగ్లిష్ లో ఓపెన్ అవుతుంది. windroye 2.8.2 a, windroy 1.2 అండ్ windroye mobile అనీ మూడు emulator మోడ్ లలో ఉంటుంది. క్లియర్ గా చదివి మీ అవసరం తగ్గట్టుగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోగలరు. windroye 2.8.2 వెర్షన్ సైజ్ 258mb ఉంటుంది.

మీ కంప్యూటర్ లో ఆండ్రాయిడ్ os లేదా యాప్స్ వాడటానికి 7 పద్ధతులు

YouWave
విండోస్ xp నుండి విండోస్ 8 వరకూ అన్నీ వెర్షన్స్ లో పనిచేస్తుంది. 144MB సైజ్ లో కేవలం సాఫ్ట్ వేర్ ఒక్కటే డౌన్లోడ్ చేసి, ఇంస్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
ప్లస్ - బ్లూ స్టాక్స్ కన్నా స్మూత్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ర్యామ్ లేదా ప్రొసెసర్ ను ఎక్కువ వాడదు.
మైనస్ - కేవలం 10 రోజులు మాత్రమే ఫ్రీ. ఆ తరువాత పెయిడ్.