ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 23 2016
ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ లాలి పాప్ OS తో రన్ అయ్యే ఫోనులు ఉన్నాయి. కానీ OS తో పాటు కొన్ని hidden విషయాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కువశాతం మందికి తెలియదు. సో క్రిందకు స్క్రోల్ (మొబైల్ లో చదివే వారు )చేస్తే మీరు ఆ విషయలు తెలుసుకోగలరు. గమనిక: క్రింద తెలిపిన టిప్స్ దాదాపు అన్నీ stock ఒరిజినల్ ఆండ్రాయిడ్ OS(యూజర్ ఇంటర్ఫేస్) లో ఉన్నవి. అంటే మీ ఫోనులో custom OS(Xiaomi MIUI, lenovo UI, Asus Zen ui) వంటివి ఉంటే క్రింద తెలిపినవి ఉండకపోవోచ్చు.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

డిఫరెంట్ యూజర్ అకౌంట్లను వాడగలరు

మల్టీ యూసర్ సపోర్ట్ కొరకు బెస్ట్ useful.: User account, Guest account and Profile account అని ఉంటాయి.

User account: ఇది administrator account మాదిరాగానే ఉత్నుంది.  

Guest account: ఇందులో ఏమి చేసినా ఏమి స్టోర్ అవ్వవు. temporary. క్రోమ్ బ్రౌజర్ లో incognito మోడ్ లాంటిది.

Profile account: .ఇది secondary user లాంటి ప్రొఫైల్. దీనిలో కొన్ని యాప్స్ అండ్ సర్వీసెస్ ను లిమిట్ చేయగలరు user అకౌంట్ వ్యక్తి. అంటే మీ ఇంట్లో వారికి ఒకే ఫోన్లో వేరే అకౌంట్ క్రియేట్ చేసి ఫోన్ వాడుకునే అవకాసం ఇవ్వటం. అలాగే ఎవరైనా ఫోన్ అడిగినప్పుడు ఈ ప్రొఫైల్ అకౌంట్ లోకి మార్చి ఇవ్వగలరు.

ఇవి Settings > Users( enable guest account లేదా different అకౌంట్స్ ను వాడటానికి) లో ఉంటాయి. వెంటనే ఒక user నుండి ఒక user కు మారాలంటే Quick Settings లో మీకు కావలసిన user ను సెలెక్ట్ చేయగలరు. 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Flappy ఆండ్రాయిడ్ గేమ్ ను ఆడుకోగలరు

దీనిని Easter egg అని కూడా అంటారు. ఇది Flappy Bird ను inspire అయినది. ఇది చూడటానికి Settings > About > లోకి వెళ్లి ఆండ్రాయిడ్ వెర్షన్ line మీద ఎక్కువసార్లు టాప్ చేసి ఇప్పుడు లాలిపాప్ బొమ్మ పై లాంగ్ ప్రెస్ చేస్తే Easter egg వస్తుంది.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

స్క్రీన్ ఆన్ అవటానికి డబుల్ టాప్

Power button ప్రెస్ చేయకుండా స్క్రీన్ పై డబుల్ టాప్ చేస్తే చాలు స్క్రీన్ ఆన్ అవుతుంది. ఇది చాలామందికి తెలిసినదే కానీ తెలియని వారికీ తెలిసినట్లే కదా అని లిస్టు లో యాడ్ చేయటం జరిగింది. తెలిసిన వాళ్ళు ignore చేయగలరు దయచేసి. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే హార్డ్ వేర్ లో కూడా సపోర్ట్ ఉండాలి. సో అన్ని ఫోనులపై పనిచేయదు ఇది. 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Settings లో లోపల ఉన్న సెట్టింగ్స్ ను కూడా సర్చ్ చేయగలరు.

లోపల ఉండే sub సెట్టింగ్స్ లోకి ఒక దాని తరువాత ఒకటి టాప్ చేస్తూ వేల్లనవసరం లేకుండా వాటి పేరులను మెయిన్ సెట్టింగ్స్ పైన ఉండే సర్చ్ వద్ద సర్చ్ చేయగలరు.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

 Wi-Fi network ఇంటర్నెట్ లో కూడా ఎంత డేటా వాడారో తెలుసుకోగలరు.

లిమిటేషన్ కూడా పెట్టుకోగలరు సెల్యూలర్ డేటా కు పెట్టుకున్నట్లు. వార్నింగ్ ఇస్తుంది కూడా. ఇందుకుSettings > Data usage > Network restrictions లోకి వెళ్లి Wi-Fi ను metered గా సెట్ చేసుకోవాలి. 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Notifications లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనపడకుండా ఉండాలంటే...

లాక్ స్క్రీన్ లో  sensitive(మెసేజెస్)  నోటిఫికేషన్స్ ఏమి కనపడకుండా సెట్ చేయగలరు. అయితే ఇది లాక్ స్క్రీన్ కు security యాడ్ చేస్తే పనిచేస్తుంది.అంటే పిన్ లేదా పాటర్న్ enable చేస్తేనే. ఇందుకు Settings > Security > Screen lock లోకి వెళ్లి PIN/pattern సెట్ చేయాలి. ఇప్పుడు మీకు “Hide sensitive notification content” అని కనిపిస్తుంది. దానిపై టాప్ చేయాలి.

ఆల్రెడీ సెక్యూరిటీ ఆన్ లో ఉన్నవారు డైరెక్ట్ గా సెట్టింగ్ లోకి వెళ్లి > Sound and notification > Notification లోకి వెళ్తే “When device is locked” అని ఉంటుంది. అక్కడ “Hide sensitive information content” ను సెలెక్ట్ చేయాలి.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Priority mode

“high priority” అని సెట్ చేసిన యాప్స్ మాత్రమే మీకు నోటిఫికేషన్స్ ఇవ్వటానికి ఈ ఫీచర్. యాక్టివేట్ చేయటానికి Settings > Sound and notifications > App notifications లోకి వెళ్ళాలి. ఇక్కడ కంప్లీట్ గా ఒక యాప్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా సెట్ చేసుకోగలరు. అలాగే priority ఆప్షన్స్ కూడా సెట్ చేయగలరు. ఇలాంటివేమి సెట్  యాప్స్ నార్మల్ గానే నోటిఫికేషన్స్ ఇస్తాయి. ఇప్పుడు వెంటనే ఎప్పుడైనా ప్రయారిటీ మోడ్ ను enable చేయటానికి వాల్యూం బటన్స్ లో ఎదో ఒకటి ప్రెస్ చేసి ప్రయారిటీ ను ఆన్ చేయగలరు.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

“Do Not Disturb” mode

Priority mode మాత్రమే కాకుండా అదనంగా Do not disturb mode. కానీ దీనిని చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇది స్పెసిఫిక్ యాప్స్ తో ముడిపడి కాకుండా స్పెసిఫిక్ times తో sync అయ్యి ఉంటుంది. యాక్టివేట్ చేయటానికి Settings > Sound and notification > Interruptions లోకి వెళ్లి రోజులను సెలెక్ట్ చేసి స్టార్ట్ టైమింగ్ అండ్ ending టైమింగ్ ఇవ్వాలి. అంతే! 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

బ్యాటరీ percentage

Android Lollipop  లో స్టేటస్ బార్ లో బ్యాటరీ percentage ఉండదు. కాని మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే దానిని క్విక్ సెట్టింగ్స్ లో చూడగలరు. ఇది చాలామందికి తెలిసినదే, కాని తెలియని వారికి తెలిపినట్లే కదా అని లిస్టు లో చేర్చటం జరిగింది.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

ఎవరికైనా ఫోన్ ఇచ్చే ముందు మీరు ఇచ్చే యాప్/స్క్రీన్ మినహా మరొకటి ఏదీ ఓపెన్ అవకుండా సెట్ చేయగలరు

Screen పైన ఒకే యాప్ ఉంచాటానికి PIN అనే ఫీచర్ ఉంది. అంటే చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చేముందు లేదా వేరే అవసరాలకు దీనిని enable చేస్తే కనుక మీరు స్క్రీన్ పై ఏది ఉంచుతారు అదే ఉంటుంది. మరొక స్క్రీన్ కు వెళ్ళదు OS. ఇది disable చేయాలంటే నేవిగేషన్ బటన్స్ లో కుడివైపు ఉండే రీసెంట్ యాప్స్ బటన్(స్క్వేర్ షేప్ లో ఉంటుంది) + back బటన్ రెండూ ఒకే సారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఫోన్ లాకింగ్ కు సెట్ చేసుకున్న password అడుగుతుంది. దానిని ఎంటర్ చేయాలి.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Bluetooth Unlocking

మీరు అదనంగా బ్లూ టూత్ ఉన్న డివైజ్ వాడితే దానితో మీ ఫోన్ unlocking ను ముడి పెట్టుకోగలరు. అంటే ఆ బ్లూ టూత్ డివైజ్ (ఫర్ eg స్మార్ట్ వాచ్) సమీపంలో ఉన్నప్పుడు లేదా మీ ఫోన్ తో pairing లో ఉంటే కనుక డివైజ్ లాక్ అవకుండా ఉంటుంది. ఇందుకు ముందుగా మీ వద్ద ఉన్న Bluetooth device ను pair చేసి ఉండాలి. ఇప్పుడు Settings > Security > Smart Lock వద్దకు వెళ్లి PIN/పాస్స్వార్డ్ లేదా పాటర్న్ ఎంటర్ చేస్తేap “Trusted devices” అని ఉంటుంది. దాని పై క్లిక్ చేసి plus icon మీద టాప్ చేసి, “Bluetooth” ను సెలెక్ట్ చేసుకుని మీరు pair చేసిన డివైజ్ ను సెలెక్ట్ చేయాలి.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Built-in flash light

ఇది కూడా ఉంది డిఫాల్ట్ గా. మీ స్టేటస్ బార్ నుండి రెండు వేళ్ళతో క్రింద స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ లో  flashlight ఆప్షన్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

 

Face unlocking స్మార్ట్ ఫీచర్

face unlocking method ఉంది డిఫాల్ట్ గా OS లో. మీరు స్క్రీన్ లాక్ ను enable చేస్తేనే స్మార్ట్ లాకింగ్ అనే సెట్టింగ్ ఆన్ అవుతుంది. దానిలో ఉంటుంది. face తో ఫోన్ unlock చేసే సెట్టింగ్. Settings > Security > Smart lock లోకి వెళ్లి PIN/Password/pattern ఎంటర్ చేసి Trusted Face > Setup సెట్టింగ్ లోకి వెళ్లి దీనిని ఆన్ చేయగాలరు..

ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్: TIPS మరియు ట్రిక్స్ [NOV 23]

Turn on battery saver mode

Inbuilt గా బ్యాటరీ సేవ్ చేసే ఫీచర్ తో వస్తుంది OS. కానీ చాలామంది దానిని వినియోగించకుండా అదనపు యాప్స్ ఇంస్టాల్ చేసుకుంటారు అదే purpose కు.  ఇది Settings > Battery > tap the Menu button > select Battery Saver వద్ద ఉంటుంది.