Turing రోబోటిక్స్ ఇండస్ట్రీస్ నుండి Turing స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. కంపెని మాటలు ప్రకారం ఇది "Phone engineering" ను రి డిఫైన్ చేస్తుంది ఈ ఫోన్. ఇది Toughest మరియు Safest స్మార్ట్ ఫోన్. అందుకే Unbreakable మరియు Unhackable అని చెబుతుంది కంపెని. దీని క్లోజ్ లుక్స్ ను చూద్దాం రండి.
కంపెని చెప్పే సెక్యురిటీ మరియు strong బిల్డ్ అనేది కేవలం పబ్లిసిటి కాదు. దీనికి కొత్త liquid మెటల్ ను కనుగొన్నారు. దీని పేరు Liquidmorphium. ఇది Titanium కన్నా స్టీల్ కన్నా strong అని చెబుతుంది కంపెని. స్పెసిఫికేషన్స్ ప్రకారం దీనిలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 801 SoC, 3GB ర్యామ్, 5.5 in FHD డిస్ప్లే, 16/64/128 GB ఆప్షన్స్ లో 39,000 రూ నుండి మొదలవుతుంది దీని ప్రైస్.
ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 మరియు Turing AEmaeth UI పై రన్ అవుతుంది ఫోన్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు turing సొంత encrypted స్టోరేజ్ చిప్ సెట్ సెక్యురిటీ వాడారు.
దీని సెక్యురిటినీ ఎంత సీరియస్ గా తీసుకున్నారు అంటే, ఆడియో జాక్ కూడా దీనిలో వాడలేదు. కేవలం బ్లూ టూత్ హెడ్ సెట్ సపోర్ట్ పెట్టారు. మైక్రో usb పోర్ట్ కూడా లేదు. దీని బదులు Wallaby Magstream పవర్ కేబుల్ కనెక్టర్ ఉంటుంది.
3000 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ఫోన్ అంతా సీల్ packed గా ఉంటుంది. వాటర్ రెసిస్టంట్ IPX8 certification.
13MP కెమేరా, డ్యూయల్ LED ఫ్లాష్, 8MP ఫ్రంట్ కెమేరా.
ప్రస్తుతానికి 10,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రీ ఆర్డర్ చేసుకోగలరు ఇప్పుడు.
లుక్స్ పరంగా చాలా బాగుంది కాని పెద్ద ఫోనులా ఉంది
షార్ప్ మరియు ఎడ్జ్ డిజైన్ రెగ్యులర్ ఫ్లాగ్ షిప్ ఫోనులకు దూరంగా ఉంది.
కలర్ ఛాయిస్ మరియు ఫినిషింగ్ చూస్తుంటే ఇది రోబోటిక్స్ చేసే కంపెని తయారు చేసిందని తెలుసుకోగలరు