టెలికాం కంపెనీలు ప్రస్తుతం వారి ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ లను అప్డేట్ చేసుకుంటున్నాయి. మొదట, జియో తన ప్రెజంట్ ప్లాన్ ధరలను మార్చింది. రిలయన్స్ జీయో యొక్క ప్లాన్ల అప్డేట్ తర్వాత ఖరీదైనవిగా మారాయి. అంటే, జియో కొన్ని ప్లాన్ ల యొక్క ధరలను పెంచింది , కొన్ని ప్లాన్ ల వాలిడిటీ తేదీని తగ్గించాయి.
దీని తరువాత, ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు ఐడియా కూడా వారి ప్లాన్ లను మార్చాయి. ఎయిర్టెల్ దాని ప్లాన్ లను కూడా అప్డేట్ చేసింది . కొన్ని ప్లాన్ లు ఒకటిన్నర రెట్లు ప్రయోజనం లభిస్తుంది . ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ ల వివరాలు తెలుసుకుందాం పదండి .
రూ. 349 ప్లాన్ - ఎయిర్టెల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన రూ .349 ప్లాన్ ని రివైజ్ చేసింది . అప్డేట్ చేసిన తర్వాత, 349 రూపాయల ప్లాన్ 28 రోజుల కు 1.5 GB డేటాను పొందవచ్చు . ఈ ప్లాన్ లో ముందు రోజుకు 1 GB డేటా వచ్చేది .
రూ 448 ప్లాన్: 448 రూ ప్లాన్ లో రోజుకు 1 GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ లో , ప్రతిరోజు 100 sms ల ను కూడా పొందవచ్చు, అయితే కాలింగ్ పరిమితి రోజుకి 300 నిమిషాలు మరియు వారానికి 1200 నిమిషాలు ఉంటుంది. ఈ ప్లాన్ అన్ని హ్యాండ్సెట్ వినియోగదారుల కోసం .
549 రూపాయల ప్లాన్ ను కంపెనీ కూడా అప్డేట్ చేసింది . గతంలో ఈ ప్లాన్ రోజుకు 2 GB డేటా లభించేది , కానీ ఇప్పుడు వినియోగదారులు 2.5 GB డేటా పొందుతారు. దీనితో పాటు, అన్ని నెట్వర్క్లలో అపరిమిత కాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
రూ 999 ప్లాన్ - ఈ పథకంలో, 90 రోజుల వాలిడిటీ , ఉచిత రోమింగ్, 100 SMSలు మరియు 60 జిబి డేటా లభ్యం ,అపరిమిత లోకల్ STD కాలింగ్.
రూ. 199 ప్లాన్ - ఎయిర్టెల్ 199 మరియు 799 ఈ ప్లాన్ లలో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎందుకంటే ఈ ప్రణాళికలు కొంతకాలం ముందే ప్రారంభించబడ్డాయి. 199 రూపాయల ప్రణాళికలో, రోజు 1జీబీ డేటా వినియోగదారులు అపరిమిత STD లోకల్ కాల్స్ మరియు 28 రోజులు పొందుతారు.
అయితే, ఈ ప్లాన్ ప్రస్తుతం అన్ని ప్రీపెయిడ్ నంబర్లలో అందుబాటులో లేదు. ఈ ఆఫర్ రీజన్ బేస్డ్ గా ఉంది. ఈ ప్లాన్ ను మీ నెంబర్ లో చెక్ చేయడానికి, ఎయిర్టెల్ యాప్ లేదా airtel.in పై చెక్ చేసుకోవచ్చు .
రూ 799 ప్లాన్:
ఎయిర్టెల్ యొక్క 799 ప్లాన్ పండుగ ఆఫర్లో ప్రారంభించబడింది. ఈ ప్లాన్లో, వినియోగదారులు 28 రోజుల రోజువారీ వాలిడిటీ తో అపరిమిత STD మరియు లోకల్ కాల్స్ మరియు 3GB 3G / 4G డేటాను పొందుతారు. మొత్తంమీద, ఈ ప్లాన్ లో వినియోగదారుకు 84GB డేటా అందిస్తున్నారు. ఈ ప్రణాళికలు ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే.
Airtel యూజర్లకు ఒక దుర్వార్త . ఎయిర్టెల్ యొక్క 3G నెట్‌వర్క్ సర్వీసులను ఇక ఆపి వేస్తున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది .
ఎయిర్టెల్ కి సంభందించిన ఒక అధికారి రానున్న 3-4 సంవత్సరాలలో మొత్తం 3G సర్వీసెస్ క్లోజ్ చేయనుందని అండ్ 3G స్పెక్ట్రమ్‌లను 4G సర్వీ సెస్ లో యాడ్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం 4జీ టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా ఇన్వెస్టిమెంట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇకపై 3G నెట్వర్క్ ఫై ఎటువంటి ఇన్వెస్టిమెంట్ చేయకుండా ఓన్లీ 4G నెట్వర్క్ డెవలప్ చేయనున్నట్లు తెలిపారు .
మరియు మార్కెట్లో అన్ని టెలికాం కంపెనీలను ఎదుర్కోవడానికి ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ ఈ ప్లాన్ లో యూజర్ కు 300 జిబి డేటాను ఇస్తోంది. దీనితో పాటు, ఈ కంపెనీ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తోంది
ఈ ప్లాన్ లో రోజువారీ డేటా ఉపయోగం కోసం లిమిట్ లేదు. ఒక సంవత్సరానికి ఎప్పుడైనా ఈ 300GB డేటా ని యూజర్స్ ముగించవచ్చు . ఈ ప్లాన్ ధర రూ. 3999. వినియోగదారుకు ఒక నెలలో రూ. 334 వరకు అవుతుంది .
ఒకవేళ మీరు ఈ ఈ ఎయిర్టెల్ ప్లాన్ ని ఇష్టపడకపోతే, ఎయిర్టెల్ యొక్క 349 రూపాయల విలువైన ప్లాన్ ను పొందవచ్చు. దీని కింద, యూజర్ 1.5 GB 4G డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS పొందువచ్చు .
మరియు ఎయిర్‌టెల్ తన ఇప్పటి వరకు పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే డేటా రోల్ ఓవర్ ఫీచర్ ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు సరికొత్తగా తన బ్రాడ్ బ్యాండ్ యూజర్స్ కి కూడా ఈ డేటా రోల్ ఓవర్ ఫీచర్ ని అందిస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది .
ఎవరైతే బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్ ఒక నెలలో డేటా వినియోగించలేకపోతే కనుక వారు వచ్చే నెలలో మిగిలిన డేటా మొత్తం వాడుకొనే సౌకర్యం కల్పిస్తుంది . మరియు యూజర్స్ మాక్సిమం 1000 GB వరకు వాడుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది .
మరియు ఈ మద్యనే భారతీ ఎయిర్టెల్ మరియు మొబైల్ ఫోన్ మేకర్ సిలికాన్ కలిసి4 జి స్మార్ట్ఫోన్ ని 1,349 రూపాయల తో ప్రారంభించింది.
నాలుగు అంగుళాల టచ్స్క్రీన్, డ్యూయల్ సిమ్ స్లాట్లు, ఎఫ్ఎమ్ రేడియో తో 'Celkon Smart 4G'(మార్కెట్లో రూ. 3,500 ధర) అందుబాటులో ఉంది. ఇది ఒక ఆండ్రాయిడ్ ఆధారిత 4G స్మార్ట్ఫోన్, ఇది YouTube ప్లే స్టోర్ అన్ని సేవలను అందిస్తుంది, YouTube, Facebook మరియు వాట్స్ యాప్ కలిగి వుంది .ఈ డివైస్ మైఎయిర్టెల్ యాప్ , వింగ్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ టీవీ యాప్ తో ప్రీలోడెడ్ అయి వస్తుంది.
ఎయిర్టెల్ ఈ స్మార్ట్ఫోన్ను రూ .169 నెలవారీ ప్యాక్ తో ప్రారంభించింది, ఇది చాలా కాలింగ్ మరియు డేటాను అందిస్తుంది.భారతీయ ఎయిర్టెల్ డైరెక్టర్ (కన్స్యూమర్ బిజినెస్), చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజ్ పుడిపేది మాట్లాడుతూ, స్మార్ట్ఫోన్ ఆప్షన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన డివైసెస్ లో ఒక ఓపెన్ ఎకోసిస్టమ్ ని రూపొందించాలని, మేము సిలికన్ భాగస్వామ్యాన్ని కలిగి వున్నందుకు సంతోషంగా ఉన్నాము " అని తెలిపారు . ఈ ఆఫర్ పొందడానికి,
కస్టమర్ 2,849 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలిసి ఉంటుంది మరియు 36 నెలల వరకు నెలకు రూ .169 రీఛార్జ్ రీఛార్జ్ చేయవలసి ఉంది. 18 నెలల తరువాత, వినియోగదారుడు రూ .500 క్యాష్ రిఫండ్ అందుకుంటారు మరియు 36 నెలల తరువాత 1,000 రూపాయల క్యాష్ రిఫండ్ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా కస్టమర్ మొత్తం రూ .1,500 ల లాభం పొందుతాడు