ఎప్పుడు సరికొత్త ఆఫర్లతో జనాన్ని ఆకర్షించే ఎయిర్టెల్ మరొక కొత్త టెక్నాలజీ తో మిమ్మల్ని ఆకర్షించేటందుకు సిద్ధమయినది ,ప్రస్తుతం 4 జీ అనేది లేటెస్ట్ ట్రెండ్ అనే విషయం మీకు తెలుసు
కానీ చాలా పట్టణాల లో ఈ 4 జి సౌకర్యం అంతగా పనిచేయడం లేదనే వార్తలు మీకు వినిపిస్తున్నాయి ,దాదాపు చాల రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో ,3 జి మాత్రమే వాడుకలో వుంది , అందుకే ఎయిర్టెల్ జనాధారణను పొందటానికి సరికొత్త ప్రణాళికలతో మీ ముందుకు వస్తోంది
దీని ద్వారాగా ,4 జి యొక్క స్పీడ్ ని మీరు 3 జీ అందుకోవచ్చని కంపెనీ వారు తెలియచేస్తున్నారు .
దీని కోసం ఎయిర్‌టెల్ Dual Carrier అనే టెక్నాలజీని తీసుకొస్తోంది,
దీని ద్వారాగా రెండు 5MHz carriersని 2100 MHz bandలో ఉపయోగించటం ద్వారాగా
3 జి లో 4 జి స్పీడ్ పెరుగుతుందని తెలియ చేశారు ,దీని వల్ల నెట్వర్క్ కవరేజీ పెరిగి ,డేటా స్పీడ్ పెరుగుట మరియు లాంగ్ టైం వాయిస్ కాల్స్ చేసుకోవటం లాంటి ప్రయోజనాలను పొందవచ్చు
దీని కోసం Carrier aggregation అనే టెక్నాలజీ ని ప్రవేశ పెట్టింది ,ఆల్రెడీ మెయిన్ సర్కిల్స్ లలో ఉపయోగించటం ప్రారంభమైనది ,త్వరలో అన్ని ప్రాంతాలలో తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తుంది