ఈ సమయంలో భారతీ ఎయిర్టెల్ DTH సీఈఓ మరియు డైరెక్టర్ సునీల్ తాల్దార్ ఈ విధముగా చెప్పారు. ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ద్వారాగా ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ మధ్యనున్న వ్యత్యాసం తగ్గించవచ్చు . కొత్త కస్టమర్ల కోసం దీని ధర రూ 4999 గా ఉంటుంది.
భారతీ ఎయిర్టెల్ డిటిహెచ్" Airtel Digital TV" Android ఆధారంగా ఒక కొత్తసెట్ టాప్ బాక్స్ ప్రారంభించింది. దీని సహాయం తో కన్స్యూమర్
రెగ్యులర్ శాటి లైట్ ఛానల్ కాకుండా ఇంటర్నెట్ కంటెంట్ కూడా టీవీ లో చూడవచ్చు
దీనిలో మూవీ అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ ముందే డౌన్లోడ్ చేసివుంటుంది. అదే సమయంలో యు ట్యూబ్ యొక్క కంటెంట్ల సపోర్ట్ కూడా ఉంటుంది.
యూజర్స్ కి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ మరియు టీవీ యొక్క ప్లే గేమ్ కూడా డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం కలదు.
7999 రూ ఖర్చు తో కొత్త కస్టమర్స్ ఈ డివైస్ తో పాటుగా Airtel DTH యొక్క దాదాపు 500 ఛానెల్స్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితముగా పొందవచ్చు.
ఇప్పటికే యాడ్ అయి వున్నవారు 3999 రూ లకే దీనిని పొందవచ్చు దీనిలో ఎయిర్టెల్ Airtel DTH ఒక నెల పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కలదు. ఇది అమెజాన్ లో కూడా అందుబాటులో కలదని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ ప్రారంభ దశలోనే 20 ఎంపిక నగరాల్లో దీనిని అమ్ముతుంది