jio ధన్ ధన్ ఆఫర్ కి పోటీగా నిన్న కాక మొన్న అదిరి పోయే ప్లాన్ ను విడుదల చేసింది. ఇప్పుడు మరో సంచలనానికి తెర తీసింది. హాలిడే సర్ప్రైజెస్ ఆఫర్ వాలిడిటీ సమయాన్ని మరో 30 రోజులపాటు పొడిగించింది.
దీనితో 1 మోర్ బిల్లింగ్ సైకిల్ క్రింద ఫ్రీ డేటా ను పోస్ట్ పైడ్ యూజర్స్ వాడుకోవచ్చు.
ఇప్పటివరకు ఎయిర్టెల్ సర్ప్రైజ్ ఆఫర్ క్లయిమ్ చేసుకోని వారికి ఏప్రిల్ 30 వరకు టైం వుంది
కేవలం వేసవి సెలవులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లుగా ఎయిర్టెల్ ప్రకటించింది.
ఈ డేటా సర్ప్రైజ్ ఆఫర్ ఫిబ్రవరి 28 కంటే ముందే ఎయిర్టెల్ నెట్వర్క్ లోకి మారిన పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం మాత్రమే
ఎలాంటి చార్జెస్ లేకుండా నెలకి ఉచిత 10 జీబీ 4జి డేటా ను అందిస్నున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ క్రింద నెలకు 10 జీబీ డేటా చొప్పున 3 నెలలకు 30 జీబీ డేటా ఇస్తుంది
ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ యూజర్స్ కి ఇమెయిల్ ద్వారా పంపిన విషయం ఏమిటంటే తరువాత 3 నెలలకు ప్రతినెలా ఫ్రీ డేటా పొందవచ్చని మరియు ఇది వేసవి సెలవులకు ఇచ్చిన ఆఫర్ అని తెలిపారు
ఏ కస్టమర్స్ అయితే విదేశాల కు వెళ్లే వారికి వేల్యూ ప్యాక్ ఆఫర్ ద్వారాగా అవసరమైన విధముగా ప్లాన్స్ ను ఆక్టివేట్ చేసేవిధముగా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు సింగపూర్ కు 499 తో డైలీ ప్యాక్ ఆఫర్ చేస్తే దానిని యూజర్స్ ఆక్టివేట్ చేసుకోకపోతే సింగపూర్ వెళ్ళినప్పుడు కంపెనీ ఆటోమేటిక్ గా కంపెనీ దీనిని యాక్టీవేట్ చేస్తుంది. అయితే యూజర్స్ డైలీ వాడకం 499 కి మించితేనే ఈ ప్యాక్ ని కంపెనీ ఆక్టివేట్ చేస్తుంది.
ఒకవేళ 499 కంటే తక్కువ వాడకం ఉంటే సాధారణ రెట్లప్రకారం చార్జెస్ వేస్తుంది