jioమార్కెట్లోకి వచ్చిన తరువాత అనేక మార్పులు చోటు చేసుకోవటం తో రోజు ఎదో ఒక టెలికాం కంపెనీ ఎదో ఒక ఆఫర్ ను విడుదల చేస్తున్నాయి
రిలయన్స్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి 2016 సెప్టెంబర్ లో 4G సర్వీస్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన తరువాత
యూజర్స్ కోసం వెల్కమ్ ఆఫర్ ద్వారాగా డేటా , వాయిస్ కాల్స్ అని ఇలా ఎన్నో ఉచిత సేవలు అందించింది
ఇప్పుడు కొత్తగా ఎయిర్ సెల్ తమ యూజర్స్ కోసం ఒక కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. యూజర్స్ కోసం 2 కొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది
ఎయిర్ సెల్ ఈ కొత్త ప్లాన్ క్రింద Rs. 35 మరియు Rs. 64 లో 1GB 3G డేటా వరుసగా 3 రోజులు మరియు 7 రోజులకు దొరుకుతుంది. అయితే
Rs. 999 ధర తో యూజర్స్ కి 36GB 3G డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ పూర్తిగా ఒక ఏడాది. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లో వున్న ఆఫర్స్ తో పోలిస్తే ఇది అంత ప్రత్యేకమైన ఆఫర్ అనిపించదు
ప్రస్తుతం jio యొక్క ప్రభావం ఉండనే వుంది. రిలయన్స్ jio యొక్క ఉచిత సేవలు 31 మార్చ్ 2017 న ముగియనున్నాయి
ఏప్రిల్ 1 నుంచి jio యొక్క సర్వీసెస్ యూస్ చేసుకోవాలంటే డబ్బు చెల్లించాలిసి ఉంటుంది