మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 19 2016
మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది కానీ దానితో కేవలం ఫోన్ లాకింగ్, unlocking మినహా అదనపు ఫంక్షన్స్ ఏమీ రావటం లేదా? కొన్ని ఫోనుల్లో OS కారణంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కెమెరా ఓపెన్ చేయటం, ఫ్లాష్ లైట్ ఆన్ చేయటం ఇతరత ఫంక్షన్స్ వస్తాయి. కాని వీటికి మించి ఎక్కువ ఫంక్షన్స్ ఉండవు ఏ ఫోన్ అయినా. సో మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ ఉంటే చాలు, ఏ ఫోన్ అయినా ఫర్వాలేదు, అదనపు ఫంక్షన్స్ ను ఆనందించగలరు.  క్రిందకు స్క్రోల్ చేయండి డిటేల్స్ కొరకు...

మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

యాప్ పేరు ఫింగర్ ప్రింట్ క్విక్ ఆక్షన్ . ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది యాప్. సైజ్ 855KB (1MB కన్నా తక్కువ) అండ్ 4.7 స్టార్ రేటింగ్ కూడా కలిగి ఉంది.

మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

ఇది రెగ్యులర్ గా ఫోన్ కంపెనీలు  ఇవ్వని అదనపు ఫంక్షన్స్ ను ఫింగర్ ప్రింట్ తో అందించగలదు. మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే చాలు.. ఇందుకు రూటింగ్ కూడా అవసరం లేదు.

మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

ఏమి చేస్తుంది?
ఫింగర్ ప్రింట్ స్కానర్ సహాయంతో కేవలం ఫోన్ unlocking వంటి బేసిక్ ఫంక్షన్స్ మాత్రమే కాకుండా అదనంగా మరిన్ని సదుపాయాలు పొందగలరు. ఏంటి అవి...

  • ఫోన్ లో sleep మోడ్ లోకి ఎంటర్ చేస్తుంది.
  • నేవిగేషన్ బటన్ లో ఉండే back ఫంక్షన్ ను అందిస్తుంది.
  • అలాగే home నేవిగేషన్..
  • రీసెంట్ యాప్స్
  • పవర్ మెను
  • split స్క్రీన్
  • నోటిఫికేషన్స్ panel డ్రాప్ down/expanding
  • క్విక్ సెట్టింగ్స్ expand

మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

రెండు మోడ్స్ లో పనిచేస్తుంది. xposed framework modeలో మరియు xposed framework అవసరం లేకుండా కూడా. xposed mode లో మరింత స్టెబిలిటీ ఉంటుంది. 

Xposed framework అనేది ఆండ్రాయిడ్ లో బాగా ఫేమస్ యాప్. ఇది వాస్తవంగా బ్యాక్ గ్రౌండ్ లో OS లో యూజర్ ఇంటర్ఫేస్ లో మార్పులు చేయకుండా మనకు మాత్రం కనిపించే మార్పులు చేస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ లో. ఇది రూటింగ్ చేసుకొని ఉంటేనే సపోర్ట్ అవుతుంది. అయితే అన్ని ఫోనులకు సపోర్ట్ ఉండదు. ఉన్నా లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది. OS కు సంబంధించినది అవటం వలన అవగాహన లేకుండా ఇంస్టాల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే ఫోన్ bootloop(అంటే కంటిన్యూ గా రీస్టార్ట్ అవుతుంది) వంటి issues ఇస్తుంది.

మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా? దానితో అదనపు ఫీచర్స్/ఫంక్షన్స్ పొందండిలా

ఏలా వాడాలి యాప్?
యాప్ ఓపెన్ చేయగానే మీకు పైన enable ఫింగర్ప్రింట్ క్విక్ యాక్షన్ అని ఉంటుంది.  దాని పక్కన ఉన్న బాక్స్ పై టాప్ చేస్తే enable/on అవుతుంది.

వెంటనే ఫోన్ యొక్క accessibility settings లో fingerprint quick action ను on చేయమని అడుగుతుంది. On చేయండి. ఇప్పుడు మీకు non xposed mode అనే సెక్షన్ లో Single tap మీద ప్రెస్ చేసి మీకు నచ్చిన యాక్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ పై సింగిల్ టచ్ చేసినప్పుడు ఆ యాక్షన్/ఫంక్షన్ రన్ అవుతుంది. ఒకవేళ పనిచేయకపోతే, యాక్షన్ సెట్ చేసిన తరువాత రీస్టార్ట్ చేయండి, పనిచేస్తుంది!