స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంత ఫాస్ట్ బిజినెస్ మరొకటి లేదు అనేలా రోజుకొక మోడల్ రిలీజ్ అవుతున్నాయి. సో కంపెనీలు కాంపిటిషన్ లో నిలబడేందుకు చాలా భారీగా ప్రీ ప్రొమోషన్స్ చేస్తున్నాయి. అందువలన రిలీజ్ కు ముందు అంచనాలు బాగా పెరుగుతున్నాయి మోడల్స్ పైన. కాని అన్నీ అనుకున్నంత కంటెంట్ తో రావటం లేదు లాంచ్ అయిన తరువాత. అలా 2015 లో expectations తో రిలీజ్ అయ్యి, తరువాత ఫెయిలయిన స్మార్ట్ ఫోన్స్ ఏంటో చూడండి.
గమనిక: ఇవి బాగా హైప్ వచ్చి ఫెయిల్ అయిన ఫోన్స్ లిస్ట్, కేవలం ఫెయిల్ అయిన ఫోన్స్ కాదు.
Oneplus X - రివ్యూ
మొదటి ఫోన్ తో మార్కెట్ మొత్తం తన వైపు తిప్పుకున్నప్పుడే oneplus కు భారీగా క్రేజ్ వచ్చింది. సో అదే బ్రాండ్ నుండి మొదటి సారి ఒకే ఇయర్ లో రెండవ ఫోన్ లాంచ్ చేస్తుంది అని తెలిసినప్పుడు అందరూ బాగా అంచనాలను పెట్టుకున్నారు కాని కంప్లీట్ satisfication ఇవ్వలేకపోయింది. లుక్స్ వైజ్ గా చాలా బాగుంది.
సోనీ Xperia Z3+
Z3+ లో హిటింగ్ ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 810 అనే మైనస్ తో పాటు ఒక్క ప్లస్ కూడా లేకపోవటం ఈ ఫోన్ ఈ లిస్ట్ లోకి చేరింది.
సోనీ Xperia Z5 ప్రీమియం
దీనిలో 4K ఉంటుంది అని అనుకుంటే కేవలం 1080P డిస్ప్లే నే కొన్ని సార్లు 4K తో మరి కొన్ని సార్లు నార్మల్ రిసల్యుషణ్ తో దింపింది సోనీ.
OBI వరల్డ్ ఫోన్ SF1 - రివ్యూ
దీని పేరులోనే భారీగా వరల్డ్ ఫోన్ అని పెట్టి, ఫోన్ లోపల మాత్రం ఏమీ పెట్టకుండా చాలా మందిని నిరాశ పరిచిన రీసెంట్ మోడల్ ఇది. కేవలం డిఫరెంట్ గా ఉంది అనిపించుకోవటానికి బాగా కష్టపడి మిగిలిన విషయాలన్నీ ignore చేసింది కంపెని.
లావా పిక్సెల్ V1
ఆండ్రాయిడ్ వన్ పేరుతో గూగల్ స్వయంగా కొన్ని మోడల్స్ ను లాంచ్ చేస్తుంది అని అన్నప్పుడు చాలా మంది బాగా ఆశించారు. అలాగే అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఇండియాలో 3 మోడల్స్ బాగానే ఉన్నాయి కానీ తరువాత వచ్చిన పోటీ కారణంగా ఆండ్రాయిడ్ one కనపడకుండా పోయింది. సెకెండ్ జనరేషన్ లో లావా దించిన ఈ మోడల్ కనీసం ఫర్స్ట్ సిరిస్ లో వచ్చిన వాటిని తాకలేదు.
మైక్రోమాక్స్ కాన్వాస్ స్లివర్ 5
Hugh Jackman వంటి హాలీవుడ్ స్టార్ తో ప్రోమోట్ చేసినా లుక్స్ బాగున్నప్పటికీ కేవలం ప్రైస్(17,999 రూ) భారీగా ఉండటం వలన ఫెయిల్ అయ్యింది.
YU యుఫోరియా - రివ్యూ
మైక్రోమాక్స్ సబ్ బ్రాండింగ్ లో యురేకా తరువాతి మోడల్ ఇది. ఈ కంపెనికు hype తేవటం బాగా తెలిసు. 7K బడ్జెట్ లో వచ్చిన మొదటి మెటాలిక్ బాడీ ఫోన్ ఇది. కాని అది ఒక్కటే ఉంది చెప్పుకోవటానికి. రెడ్మి 2 ప్రైమ్ దీని మార్కెట్ మొత్తం తీసుకుంది. పబ్లిసిటీ ఎక్కువ చేసే బ్రాండ్ కంటెంట్ కూడా ఎక్కువుగా ఉండాలి అని తెలుసుకోవాలి.
మోటో E 2nd Gen - రివ్యూ
ఒరిజినల్ మోటో E మార్కెట్ లో బడ్జెట్ ఫోన్ కు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాలి. ఇది రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తరువాత చాలా కంపెనీలు బడ్జెట్ లో వచ్చాయి. అయినా మోటోరోలా తన 2nd Gen మోటో E ను కేవలం ఎవేరేజ్ ఇంప్రూవ్డ్ స్పెక్స్ తో లాంచ్ చేసింది. సో రిసల్ట్ ఫెయిల్ అయ్యింది. బ్రాండ్ ను బాగా నమ్మేవారు తప్ప మరొకరు దీనిని వాడటం లేదు. తరువాత్ లాంచ్ అయిన 4G వేరియంట్ కూడా సేమ్ రిసల్ట్ ఇచ్చింది.
లెనోవో వైబ్ షాట్ - రివ్యూ
లెనోవో నుండి ఏ మొబైల్ లాంచ్ అయినా ఫర్వాలేదు, మన వాళ్ళందరూ దానిపై పడిపోతారు. ఇందుకు పెద్ద కారణం లెనోవో లాంచ్ చేసిన A6000 ప్లస్ అండ్ నోట్ 3 మోడల్స్. కాని అవి కొన్న వారికే తెలుసు కంపెని లో నాణ్యత ఎంత వరకూ ఉందో. దీని కన్నా బెటర్ కంటెంట్ తో వస్తున్న ఇతర బ్రాండ్ మోడల్స్ చాలా ఉన్నాయి. అవి హానర్, రెడ్మి, meizu. కాని అవేమి పట్టించుకోరు. రివ్యూస్ చూసి కొనాలి ఫోన్స్, మన నమ్మకాలను బేస్ చేసుకొని కాదు. వైబ్ షాట్ ఫోన్ లో గ్రేట్ కెమేరా ఉంది. కాని అది ఒక్కటే ఉంది చెప్పుకోవటానికి. ప్రైస్ ఏమో 20K బడ్జెట్ లో ఉంది. గ్రేట్ కెమేరా ఒకటే ఉంటే చాలు అని ఎవరూ అనుకోరుగా?
Xolo black
మైక్రోమాక్స్ YU వలె xolo కూడా బ్లాక్ అనే సబ్ బ్రాండింగ్ లాంచ్ చేసింది కాని ఫెయిల్ అయ్యింది. డ్యూయల్ కెమేరా సెట్ అప్, attractive ఫోటోగ్రాఫ్స్ తో బాగా హైప్ ఇచ్చింది.కాని రీ ఫోకసింగ్ తప్పితే దీనిలో ఏమీ లేదు అని చెప్పాలి నిజానికి. రీసెంట్ లాంచ్ సెకెండ్ బ్లాక్ మోడల్ రివ్యూ ఈ లింక్ లో.
గమనిక: ఇవి బాగా హైప్ వచ్చి ఫెయిల్ అయిన ఫోన్స్ లిస్ట్, కేవలం ఫెయిల్ అయిన ఫోన్స్ కాదు.