ఆండ్రాయిడ్ లో చాలా లాంచర్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని అందరికీ తెలిసినవే, అయితే ఇక్కడ ఉన్న 9 లాంచర్స్ లో మీరు ఏదైనా చూడనట్టు అయితే తెలుసుకోండి. మిగిలిన లాంచర్ యాప్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
Buzz Launcher and Themer
Buzz లాంచర్ మరియు Themer రెండూ ఎక్కువ కస్టమైజేషన్ ను అందించే లాంచర్స్. ఎక్కువ థీమ్స్ ను ఇష్టపడి, కాని ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఈ రెండు లాంచర్స్ చాలా సింపుల్ స్టెప్స్ తో అద్భుతమైన థీమ్స్ ను ఇస్తాయి. అయితే వీటి వలన మీ ఫోన్ స్పీడ్ కచ్చితంగా తగ్గుతుంది. అందుకే థీమ్స్ ఎక్కువ ఉన్నా, దీనిని లాస్ట్ లో చేర్చాము.
డౌన్లోడ్- Buzz Launcher, Themer
Nova Launcher
ఇది చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్స్ కు తెలిసిన లాంచర్. కాని నోవా లాంచర్ అన్నిటికన్నా చాలా స్టేబల్ మరియు ఫాస్ట్ లాంచర్ అని తెలిసి ఉండకపోవచ్చు. అన్ని లాంచర్ ఫీచర్స్ తో పాటు దీనికి ఐకాన్ థీమింగ్ ప్యాక్స్ ఎక్కువ ఉంటాయి. క్రింద లింకు లో దీనిని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్- Nova Launcher
Yahoo Aviate
అవును ఇది మీరు అనుకుంటున్న Yahoo డెవెలప్ చేసిన అప్లికేషన్. ఇది రొటీన్ యూజర్ ఇంటర్ఫేస్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. రోజులోని టైమింగ్స్ బట్టి లాంచర్ వాల్ పేపర్ తో పాటు థీమ్ ను కూడా మార్చుకుంటుంది. దీని ప్రత్యేకత స్పీడ్ తో పాటు డిఫెరెంట్ యూజర్ ఇంటర్ఫేస్.
డౌన్లోడ్- Yahoo Aviate
Google Now డౌన్లోడ్ లింక్
సింపుల్ గా ఉంటుంది. అదనంగా హోమ్ లో రైట్ లో google కార్డ్స్ అని ఉంటాయి. ఇక్కడ రిమైండర్స్, బర్త్ డేస్, షిప్ మెంట్స్ etc చూడగలరు. కొత్త ఆండ్రాయిడ్ M అప్ డేట్ తో వెర్టికల్ స్క్రోలింగ్ కు మారింది యాప్ డ్రాయర్.
Arrow Launcher by Microsoft డౌన్లోడ్ లింక్
ఇది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన లాంచర్ యాప్. అన్నీ హోమ్ లో కనిపించేలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మైక్రోసాఫ్ట్.
SF లాంచర్ 2 డౌన్లోడ్ లింక్
మేటేరియాల్ డిజైన్ లవర్స్ కు ఇది నచ్చుతుంది. దీనిలో హెడర్ ఇమేజ్ తో కలిపి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ ను మార్చుకోవచ్చు కూడా. రెగ్యులర్ లాంచర్ యాప్స్ UI కు డిఫరెంట్ గా ఉంటుంది.
Quixey Launcher డౌన్లోడ్ లింక్
ఓల్డ్ అండ్ న్యూ డిజైన్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. లేటెస్ట్ లాంచర్ యాప్. క్రింద నుండి ఒకసారి పైకి స్వైప్ చేస్తే యాప్ డ్రాయర్ ఓపెన్ అవుతుంది. దీనికి కూడా గూగల్ నౌ లాంచర్ వలె కార్డ్స్ ఉన్నాయి హోమ్ స్క్రీన్ లో. డ్రాయర్ కూడా వెర్టికల్ స్క్రోలింగ్
TSF Launcher 3D Shell డౌన్లోడ్ లింక్
ఇది చాలా ఓల్డ్ లాంచర్. కాని దీని ప్రత్యేకత వేరు. హోమ్ నుండి యాప్ డ్రాయర్ వరకూ చాలా unique గా ఉంటుంది. విపరీతమైన customisation. లిమిటెడ్ థీమ్స్ కూడా ఉన్నాయి.
ఎండ్ లైన్
మీకు సింపుల్ but ఎక్కువ customisation అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ కావాలి అనుకుంటే నోవా లాంచర్ బెస్ట్. ఐకాన్స్ సైజ్ మార్చటం నుండి, డెస్క్ టాప్ స్వైప్స్ వరకూ అన్నీ ఉంటాయి. కాని కొన్ని పెయిడ్ వెర్షన్ లో ఉన్నాయి.
వారానికి ఒక డిఫరెంట్ థీమ్ కావాలి అనుకుంటే Buzz లాంచర్. థీమ్స్ ను manual గా కూడా సెట్ అప్ చేయనవసరం ఉండదు. జస్ట్ డౌన్లోడ్ అండ్ అప్లై.
మీకు అన్నీ సమయానికి తగ్గట్టుగా ఆటోమేటిక్ గా మారాలా? అయితే Yahoo Aviate బెస్ట్ ఛాయిస్.
ఐకాన్ సైజెస్, ఫాంట్స్ వంటివి ఏమీ మార్చే ఇంటరెస్ట్ లేదా, అయితే డిఫాల్ట్ గా సింపుల్ గా ఉండే గూగల్ అఫిషియల్ NOW లాంచర్ గుడ్ ఛాయిస్.