2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Dec 02 2015
2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

ప్రస్తుత మార్కెట్ లో ఒక బ్రాండ్ నుండి నెలకు ఒక మోడల్ రిలీజ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో అయితే రెండు మూడు నెలలకు కొత్త మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇండియన్ మొబైల్ మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. సో వారానికి కనీసం 5 కొత్త స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మంచి పని తనం తో ఉన్నప్పటికీ పబ్లిసిటి మరియు రివ్యూస్ లేక మంచి స్మార్ట్ ఫోన్స్ గా బాగా reach అవలేకపోతున్నాయి. అలా 2015 లో 8 మంచి స్మార్ట్ ఫోన్స్ కన్స్యుమర్స్ కు వాటి పనితనం తెలియుకుండా ఉండిపోయాయి. అవేంటో చూడటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

Meizu M2 నోట్ - రివ్యూ
9,999 రూ లకు లాంచ్ అయిన కంపాక్ట్ అండ్ గ్రేట్ డిస్ప్లే ఫోన్. డిసెంట్ పెర్ఫార్మెన్స్, డిజైన్ బిల్డ్, మంచి కెమేరా చాలా బాగుంది. దీనిలో హై బ్రిడ్ స్లాట్ ఉండటం వలన దీనిని కొనటానికి విముఖత చూపించారు చాలా వరకూ. కాని 10 వేల బడ్జెట్ లో విపరీతమైన కాంపిటీషన్ ఉండటం వలన ఇది underrated లిస్ట్ లోకి వెళ్ళింది.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

హానర్ 7
ఇది రీసెంట్ గా మిడ్ ర్యాంజ్ ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లోకి లాంచ్ అయిన మోడల్. ఒక మంచి ఫోన్ కు కావలసిన అన్నీ దీనిలో ఉన్నాయి.  మెటల్ బాడీ తో మంచి ప్రైస్ లో లాంచ్ అయ్యింది. కాని దీని కన్నా ముందు వచ్చిన oneplus 2 అండ్ మోటో G 3 బాగా పాపులర్ అవటం వలన ఇది under rated గా మిగిలిపోయింది.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

ZTE నూబియా Z9 మిని రివ్యూ
టాప్ 10 బెస్ట్ కెమేరా ఫోన్స్ జాబితా లో స్థానం సంపాదించిన పేరు తెలియని (చాలా మందికి) బ్రాండ్ అండ్ బడ్జెట్ ఫోన్ ఇదే. గ్రేట్ డిస్ప్లే కూడా ఉంది. కాని బాగా under rated అయ్యిన ఫోన్లలో ఇది మొదటిది అని చెప్పాలి. ఇందుకు బ్రాండ్ పబ్లిసిటి లేకపోవటం ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను 9 వేల బడ్జెట్ లో లాంచ్ చేసిన మొదటి ఫోన్ ఇదే. మంచి ఫోన్ కాని రివ్యూస్ మరియు మార్కెట్ వైజ్ గా deservable ప్లేస్ లో లేదు. చాలా లైట్ వెయిట్ అండ్ బెస్ట్ బిల్డ్.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

మైక్రో సాఫ్ట్ లుమియా 640XL
950 మోడల్స్ రిలీజ్ అవనంత వరకూ విండోస్ ఫోన్స్ ను ఇష్టపడే వారి అందరకీ ఇది ఒకే ఒక king.  మంచి కెమేరా, బిల్డ్ క్వాలిటీ అండ్ చాలా కాలం పాటు విండోస్ ఫోన్ అంటే ఇది eg గా ఉండేది. కాని చాలా రివ్యూస్ mixed గా రావటం వలన అన్ పాపులర్ అయ్యింది.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

LG G4 రివ్యూ
డిఫరెంట్ డిజైన్ పరంగా బాగా పేరు వచ్చింది దీనికి. కాని గేలక్సీ S6 అండ్ ఐ ఫోన్ మోడల్స్ వలన overshade అయిపొయింది. ప్రైస్ తగ్గించినా మార్కెట్ ను ఆకర్షించ లేకపోయింది. S6 కన్నా బెస్ట్ కెమేరా ఫోన్. ఓవర్ ఆల్ గా మంచి ఫోన్.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

యు యురేకా ప్లస్  రివ్యూ
మిడ్ ర్యాంజ్ స్పెక్స్ ను బడ్జెట్ లోకి లాంచ్ చేసిన మొదటి ఫోన్ ఇదే. యురేకా కన్నా కెమేరా బాగా ఇంప్రూవ్ అయ్యింది, మంచి డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటి కాని మార్కెట్ లో deserving పొజిషన్ తెచ్చుకోలేకపోయింది.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

ఆసుస్ జెన్ ఫోన్ 2 (2gb ర్యామ్ - ఇంటెల్ ప్రొసెసర్) రివ్యూ
కేవలం ఇదే మోడల్ లో 4gb ర్యామ్ వేరియంట్ ఉండటం వలన ఇది పాపులర్ కాలేకపోయింది. కాని ఇది నిజంగా రిలీజ్ అయిన పిరియడ్ లో బెస్ట్ ఫోన్.

2015 లో రిలీజ్ అయిన 9 మోస్ట్ under rated బెస్ట్ ఫోన్స్

InFocus M810 రివ్యూ
దీనిలో స్నాప్ డ్రాగన్ 810 ఉంది. చాలా పవర్ ఫుల్. కాని 801 ప్రోసేసర్స్ కాకుండా అప్ డేటెడ్ ప్రోసేసర్స్ ఉన్న మార్కెట్ లో ఇది రిలీజ్ అవటం వలన పెద్దగా పేరు రాలేదు.