మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 20 2016
మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

WiFi రూటర్స్ అనేవి మీరు ఉన్న దగ్గర (ఇంటిలో లేదా ఆఫీస్ లో) ప్రతీ మొబైల్, లాప్ టాప్ లో ఇంటర్నెట్ ను వైర్ లెస్ గా వాడుకోవటానికి ఉపయోగపడతాయి అని అందరికీ తెలుసు. కాని వీటిలో ఉన్న మిగిలన uses గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫర్ eg అదనపు అమౌంట్ పెట్టి range పెంచటానికి మరొక రూటర్ కొనకుండా మీ వద్ద ఉన్న రూటర్ తోనే పెంచుకోగలరు. ఇలాంటివి మరి కొన్ని చూడండి.. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

USB పోర్ట్
మీరు ఈ మధ్యన రూటర్ తీసుకున్నట్లు అయితే, మీ రూటర్ లో USB పోర్ట్ ఉంటుంది. పాత వాటిలో ఉన్నా వర్క్ అవుతుంది. దీనికి మీ పెన్ డ్రైవ్ లేదా external హార్డ్ డిస్క్ ను కనెక్ట్ చేసి మీ స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్.. దేని నుండి అయినా ఆ డేటా ను యాక్సిస్ చేయగలరు. అయితే అందరూ ఒకే WiFi లోని కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇక ప్రతీ సారి డేటా ను ఒకరికి ఒకరు ట్రాన్స్ ఫర్ లేదా ప్రతీ సారి కనెక్ట్ చేసి యాక్సిస్ చేసే పనులు ఉండవు. ఇది చాలా సింపుల్ గా చేసుకునే విషయం కాని బెస్ట్ useful.

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

Network Drive
పైన చెప్పుకున్న స్టోరేజ్ థీమ్ లోనే మరొకటి ఉంది. మీ పర్సనల్ డేటా లేదా ఫిలిమ్స్, పిక్స్, ఇతర డేటా ను ఒక సెంట్రల్ స్టోరేజ్ లో సేవ్ చేసి, దాని నుండి డేటా ను ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా యాక్సిస్ చేయటానికి NAS (నెట్ వర్క్ అసిస్టేడ్ స్టోరేజ్) డ్రైవ్స్ అని ఉన్నాయి. WD My Cloud, Seagate సెంట్రల్ స్టోరేజ్ ఆఫర్ వంటి డివైజెస్ 2TB నుండి 4TB కెపాసిటీ లతో అందుబాటులో ఉన్నాయి. ఇవి కొని, WiFi రూటర్స్ కు Ethernet లేదా usb ద్వారా కనెక్ట్ చేస్తే ఇక మీరు ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా మీ ఇంటిలో ఉన్న డేటా ను యాక్సిస్ చేయగలరు. డేటా ట్రాన్స్ ఫర్ స్పీడ్ NAS కనెక్ట్ అయిన WIFI అప్ లోడ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడే అదే WiFi లో ఉంటే ట్రాన్స్ ఫర్ స్పీడ్ గానే ఉంటుంది. వీటితో పాటు యాప్ అండ్ PC సాఫ్ట్ వేర్ కూడా వస్తుంది డేటా ను అక్కడే ఉండి యాక్సిస్ చేయటానికి. 

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

పవర్ లైన్
మీ దగ్గర old Western డిజిటల్ లేదా Lomega డ్రైవ్ లేదా ఇతర బ్రాండ్ లోని Etherent కనెక్షన్ సపోర్ట్ చేసే మీడియా ప్లేయర్ ఉందా? సాధారణంగా ఇవి WiFi తో రావు.సో వీటిని రూటర్ కు కనెక్ట్ చేయటం కష్టం. రూటర్ వేరే రూమ్ లో ఉండటం కూడా ఇబ్బందే. దీనికి పవర్ లైన్ ఉపయోగపడుతుంది. ఒక ఎండ్ WiFi రూటర్ కు మరొకటి డివైజ్ యొక్క ఈథర్నెట్ కు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ లేని అవుట్ డేటెడ్ డివైజెస్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. పవర్ లైన్ TP లింక్, DLink వంటి ఇతర కంపెనీలు కూడా తయారు చేస్తాయి.

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

Range ఎక్స్ టెండర్
సో మీకు WiFi రూటర్ అండ్ WiFi డివైజెస్ అన్నీ ఉన్నాయి. కాని ఇంట్లోని కొన్ని మార్పుల వలన WiFi ఎక్కువ దూరం సిగ్నల్ రావటం లేదు. ఇలాంటి పరిస్థితులలలో.. Repeater లేదా Range Extender వంటివి వాడగలరు. ఇప్పుడు వీటిని సిగ్నల్ బాగుంది కాని తగ్గుతుంది అనే ప్లేస్ లో దీనిని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ వరకూ వస్తున్న సిగ్నల్ ను క్యాచ్ చేసి, మళ్ళీ అక్కడ నుండి మిగిలిన ప్లేస్ లకు ఎక్స్ టెండ్ చేస్తుంది. ఇవి ఎంట్రీ లెవెల్ లో 1000 రూ నుండి మొదలవుతాయి. పెద్ద ఇల్లులు ఉన్నవారికి బాగా useful అవుతుంది రెండు మూడు రూటర్స్ కొనే అవసరం లేకుండా.

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

హోమ surveillance (ఇంటిని క్లోజ్ గా చూడటం)
ఈ రోజుల్లో సెక్యురిటీ పెద్ద ప్రాబ్లెం గా ఉంది. వీటిని స్మార్ట్ గా కనిపెడుతూ ఉండవచ్చు. మీరు ఒక్కరే ఇంటిలో ఉంటున్నారా? అయితే మీరు లేనప్పుడు ఇంటిని టెక్నాలజీ తో వాచ్ చేస్తూ ఉండవచ్చు. ఇంటిలో ఇతర సభ్యులు ఉంటే.. వాళ్ళని వాళ్ళకు తెలియకుండా గమనించటం కరెక్ట్ కాదు.  చట్ట రీత్యా నేరం కూడా ( మీ ఇల్లు అయినప్పటికీ). ఇప్పుడు మీ ఇంటిలోని WiFi ఇంటర్నెట్ యాక్టివ్ గా ఉంచి, ఒక హోమ surveillance కెమేరా ను కొని మీ స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ నుండి సెక్యురిటీ పరమైన విషయాలను గనించవచ్చు. ఈ కెమేరాస్ 3K నుండి అందుబాటులో ఉంటాయి.

 

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

రిమోట్ కంట్రోల్
మీ స్మార్ట్ ఫోన్ కు ఇన్ఫ్రా రెడ్ సపోర్ట్ లేకపోయినా WiFi కారాణంగా universal రిమోట్ కంట్రోల్ లా వాడుకోగలరు. అయితే మీరు కంట్రోల్ చేయదలచుకున్న డివైజెస్ కు WiFi ఉండాలి. రెండూ ఒకే wifi పై ఉంటే, రిమోట్ కంట్రోల్ చేయటానికి ప్లే స్టోర్ అండ్ ఆపిల్ స్టోర్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి రిమోట్ కంట్రోలింగ్ కొరకు. కాని ప్రస్తుతం కేవలం స్మార్ట్ టీవీ లకే wifi అందుబాటులో ఉన్నాయి.

మీ ఇంటిలోని Wi-Fi రూటర్ తో మీకు తెలియని కొన్ని useful పనులు చేసుకోవచ్చు..

ప్రింటింగ్
ఈథర్నెట్ పోర్ట్ లేదా WiFi enabled ప్రింటర్ కనుక ఉండి.. మీరు ఎక్కువుగా ప్రింటింగ్ పనులు చేస్తుంటే.. Wi-Fi ప్రింటింగ్ మంచి ఆప్షన్. అంటే ఒక డివైజ్ కు మించి ఎక్కువ డివైజెస్ తో ప్రింట్స్ తీసేవారు wifi ద్వారా కనెక్ట్ అయ్యి ఈజీ ప్రింట్స్ ను పొందగలరు మీ మొబైల్, లాప్ టాప్ etc నుండి.