accessories అంటే చాలా మందికి ఇష్టం. ఇవి స్మార్ట్ ఫోన్స్ ను మరింత క్రేజీ గా వాడుకునేందుకు సహకరిస్తాయి. ప్రస్తుతం కొన్ని useful స్టార్ట్ అప్స్ వీటిపై పనిచేస్తున్నాయి.
దీని పేరు Wonder Cube
చిన్న బాక్స్ షేప్ లో ఉంటుంది. లోపల అన్నీ సైజ్ లు కేబుల్స్, చార్జర్స్,అడాప్టర్స్, డ్రైవ్స్ ఉంటాయి. సైజ్ ఒక ఇంచ్ ఉంటుంది.indigogo సైట్ లో దీనిని ప్రీ ఆర్డర్ చేయగలరు. ధర 3,714 రూ. ఇంటర్నేషనల్ డెలివరీ కూడా ఉంది.
Slimger PRO
ఇది 3000 mah పవర్ బ్యాంక్. ఒక దాని పై ఒకటి పెడితే మాగ్నెటిక్ ఫోర్స్ తో చార్జ్ అవుతాయి వాటంతట అవి. అంటే ఒక రెండు తీసుకుంటే నిరంతరం చార్జింగ్ ఉంటుంది వీటికి..తద్వారా మీ ఫోన్స్ కు.
UsBidi
ఫోన్స్ ఓవర్ చార్జింగ్ ఎక్కటం చాలా కామన్. దీని వలన బ్యాటరీ లైఫ్ పాడవుతుంది కాని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు. ఇది డబుల్ స్పీడ్ తో చార్జింగ్ ఎక్కించటమే కాదు, కంప్లీట్ చార్జింగ్ అయితే వెంటనే చార్జ్ ను నిలిపి వేస్తుంది. స్ట్రెస్ ప్రూఫ్, tangle ప్రూఫ్ తో 1689 రూ లకు వస్తుంది.
eora 3D
3D స్కానర్ ఇది. ఫోన్లోనే స్కానింగ్ చేయగలరు. బ్లూ టూత్ పై రన్ అవుతుంది. 19,524 రూ. ఆపిల్ అండ్ ఆండ్రాయిడ్ సపోర్ట్ ఉంది.
Revols
మీ ఇయర్స్ పెద్దవి చిన్నవి ఇలా ఎదో ఒక కారణం చేత కొనే ఇయర్ ఫోన్స్ ఫిట్ అవటం లేదా? ఇక Revols ear pods ఎవరికైనా ఫిట్ అవుతాయి. బ్లూ టూత్ పై ఇయర్ ఫోన్స్ ఇవి. అంటే వైర్ ఫ్రీ. app equaliser, వాల్యూం కంట్రోల్స్ తో 13,849 రూ దీని ప్రైస్
uPeek
క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటుంది. ఫోన్ కు తగిలిస్తే దేనినైనా మైక్రో స్కోప్ లో చూపిస్తుంది. బ్లూ టూత్ ద్వారా ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ డివైజెస్ పై రన్ అవుతుంది. 9,796 రూ దీని ధర.
BLIPCAST
మీకు తప్ప ఎవ్వరికీ వినిపించకుండా టీవీ లేదా మ్యూజిక్ ఆడియో వినిపిస్తుంది. ఆడియో సోర్స్ కు కనెక్ట్ చేసి, స్మార్ట్ ఫోన్ లో మీ వద్ద ఉన్న ఇయర్ ఫోన్స్ పెడితే, మీరు కనెక్ట్ చేసిన ఆడియో సోర్స్ నుండి సౌండ్ మీ ఇయర్ ఫోన్స్ లో వింటారు. ఇది వైఫై ద్వారా పనిచేస్తుంది.
ఫేస్ బుక్ లో ఈ లిస్టు పై మీ కామెంట్స్ తెలియజేయండి మాకు