విండోస్ ఫోన్స్ మరియు యాప్స్ eco సిస్టం ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ అంత ఎక్కువ పాపులర్ కాదు. అయినప్పటికీ విండోస్ లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఆండ్రాయిడ్ లో implement చేయవచ్చు. అవేంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
ఆఫ్ లైన్ మ్యాప్స్
నోకియా మ్యాప్స్, here maps పేరులతో ఆఫ్ లైన్ లో కూడా మ్యాప్స్ ను చూడటానికి ఫర్స్ట్ టైమ్ ఇది నోకియా విండోస్ లుమియా ఫోన్స్ లోనే వచ్చింది.
ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషణ్
విండోస్ ఫోన్ 920 లో ఇది ఫర్స్ట్ టైమ్ వచ్చింది. ఇమేజెస్ ను మూవ్ అవుతున్న కదలికలు లేకుండా వీడియో షూట్ అలాగే blur లేకుండా ఇమేజెస్ క్లిక్ చేయటానికి useful.
Glance స్క్రీన్
Glance స్క్రీన్, Ambient డిస్ప్లే, always on ఏదైనా ఫీచర్ ఒకటే. నోటిఫికేషన్స్ మరియు టైమ్ ను డిస్ప్లే ఆన్ చేయకుండానే చూపిస్తుంది. లుమియా 925 నోకియా ఫోన్ లో మొదటిగా వచ్చింది.
Living ఇమేజెస్
దీని గురించి తక్కువ మందికి తెలుసు. ఫోటో క్లిక్ చేసే ముందు రెండు మూడు సేకేండ్స్ ఆ ఫోటో కు ముందు జరిగిన విషయాలను కూడా రికార్డ్ చేస్తుంది. విండోస్ ఫోన్లలో నోకియా లుమియా 930 కు లో వచ్చింది ఫర్స్ట్ టైమ్.
లిక్విడ్ కూలింగ్
స్నాప్ డ్రాగన్ 810 అనేది హిటింగ్ ప్రాబ్లెం ఉన్న SoC. అయినా మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 950XL మోడల్ లో ఈ ప్రాసెసర్ ను పెట్టడం జరిగింది. అయితే ఇంతకూ ముందు ఎవ్వరు పెట్టని లిక్విడ్ కూలింగ్ ఫీచర్ ను ప్రవేశ పెట్టింది విండోస్ ఫోన్ హీటింగ్ ను తట్టుకొవటానికి.
Continuum
కరెంట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటున్నాయి. ఈ విషయాన్నీ మరింత బల పరస్తూ స్మార్ట్ ఫోన్ ను PC లా కూడా వాడుకునే continuum ఫీచర్ ను అనౌన్స్ చేసింది మైక్రోసాఫ్ట్. మొబైల్ ను మానిటర్ కు dock ద్వారా కనెక్ట్ చేసి కీ బోర్డ్ అండ్ మౌస్ ను కూడా తగిలిస్తే వేరేగా cpu అవసరం లేకుండా PC ను యాక్సిస్ చేయగలరు.
Iris recognition
ఐరిస్ స్కానర్ ను తెచ్చింది విండోస్ ఫోన్ కాదు కాని గ్లోబల్ గా పబ్లిక్ కు అందుబాటులో తెచ్చింది మైక్రోసాఫ్ట్ విండోస్ 950 మోడల్స్. ఈ ఫీచర్ Fujitsu Arrows NX-F04G స్మార్ట్ ఫోన్ లో ముందుగా వచ్చింది.