Elon Musk అనే అతను Tesla అనే ఎలక్ట్రిక్ కార్ కంపెని తో కార్స్ ను తయారు చేస్తూ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కంపెని తయారు చేసిన కారులలో రీసెంట్ గా లాంచ్ అయిన Tesla Model 3 ఖచ్చితంగా ఇంపార్టెంట్ గా నిలవనుంది. ఈ మోడల్ లో చీప్ వేరియంట్ ఇండియన్ మార్కెట్ లో కూడా రానుంది 2018 లో. అప్పుడే దేశంలోని సంపన్నులు దీనిని ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. చూస్తుంటే Tesla Model 3 రెండు సంవత్సరాలలో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో భారి మార్పులను తేవనుంది అని అనిపిస్తుంది.
ప్రైస్ - ఇండియన్స్ కు చీప్ కాదు
బేసిక్ మోడల్ 25 లక్షలు ఉండనుంది సుమారు. అయితే ఇది ఇండియాలోకి వచ్చేసరికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అన్ని కలుపుకుని 50 లక్షలు ఉండవచ్చు అని అంచనా. కాని 67,000 రూ కట్టి ప్రీ బుక్ చేసుకోగలరు కార్ ను. కాని డెలివరి 2018 లో స్టార్ట్. U.S లో 2017 లో స్టార్ట్.
డిజైన్: లక్సరీ అండ్ కంఫర్ట్
ఐదుగురు కూర్చోగలిగే కంఫర్ట్ సీటింగ్, ఇది ఎలెక్ట్రిక్ కార్ అవటం వలన ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా లగేజ్ స్పేస్ ఉంది. లోపల కూడా అంతా మినిమల్ గా ఉంటుంది. అలాగే Tesla లోపల సింగిల్ లార్జ్ టచ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసింది Model 3 లో.
Engine: 0-60mph వెళ్తుంది 60 సెకండ్స్ లో..
సూపర్ కార్ కన్నా వేగంగా ఉంది. సింపుల్ లాజిక్ ఏంటంటే దీనికి పిట్రోల్ లేదా ఎటువంటి మెకానిజం ఉండదు కాబట్టి స్టార్ట్ చేసిన వెంటనే స్పీడ్ ను అందుకోగలదు మోడల్ 3.
Safety: 5-star రేటింగ్
ఇది అన్నిటికన్నా సేఫెస్ట్ కర్. వెనుక మరియు ముందు నుండి చాలా క్రాష్ టెస్ట్ లలో నెగ్గింది టెస్లా మోడల్ 3 కార్.
స్మార్ట్ కార్: ఆటో పైలట్ మోడ్
కార్ తన అంతట అదే స్టిరింగ్ చేసుకోగలదు. సొంతంగా పార్కింగ్ కూడా చేసుకోగలదు. అలాగే ట్రాఫిక్ ను తెలుసుకొని cruise కంట్రోలింగ్ కూడా చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఆప్షన్స్ అన్నీ బేస్(స్టార్టింగ్) మోడల్ లో ఉండవు.
సవాళ్ళు ఏంటంటే రేంజ్ మరియు రీచార్జ్
ఇప్పటి వరకూ అడపా దడపా చాలా ఎలెక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. కాని అవేమి సక్సెస్ వరకు వెళ్ళకపోవటానికి కారణం పిట్రోల్ లేదా డీజల్ కార్ల అంత సౌక్యంగా వాడటానికి వీలు లేకపోవటమే. చార్జ్ అవటానికి ఎక్కువ టైమ్ తీసుకోవటం, తక్కువ దూరమే రన్ అవటం వంటివి ప్రధాన మైనస్ పాయింట్స్. కాని tesla లో ఫాస్ట్ చార్జింగ్ మరియు 346 KM రన్నింగ్ రేంజ్ ఉంది. అయితే ఇందుకు చార్జింగ్ స్టేషన్స్ కూడా ఉండాలి. కంపెని ఇండియాలో వీటిని నెలకొల్పటానికి కూడా పనిచేస్తుంది అని రిపోర్ట్స్.