Pokemon గురించి మీరు ఆల్రెడీ చాలా సార్లు వినే ఉంటారు(దీని గురించి మీకు ఆర్టికల్ కావాలంటే FB కామెంట్స్ లో తెలపండి). ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది ఒక్కసారిగా. సింపుల్ గా గేమ్ గురించి చెప్పలంటే, మీరు ఫిజికల్ బయట నిజంగా నడుచుకుంటూ వెళితే గూగల్ మ్యాప్స్ లో ఎక్కడ ఏ షాప్ ఉంది అని తెలిపినట్లు ఈ గేమ్ లో మీ చుట్టు పక్కల రియల్ places లో కొన్ని పోకేమోన్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి వద్దకు నిజంగా నడుచుకుంటూ వెళ్లి వాటిని క్యాచ్ చేయాలి. Augmented reality గేమ్. సో ఈ గేమ్ ఆడుతూ కొంతమంది కొన్ని అసాధారణ పనులు చేశారు. అవేంటో తెలుసుకోండి క్రింద కు స్క్రోల్ చేసి.
Tom Currie అనే వ్యక్తీ pokemon game మీద బాగా ఫోకస్ పెట్టి అందరికన్నా బెస్ట్ గా ఆడాలని, తన ఉద్యోగం కూడా మానివేయటం జరిగింది. :) అవును నిజమే!
Jonathan Theriot అనే వ్యక్తి వైఫ్ డెలివరీ అవుతున్నప్పుడు Pidgey(గేమ్ లోని క్యారెక్టర్) ను పట్టుకుంటూ ఇలా స్క్రీన్ షాట్ తీసి ప్రపంచానికి, తన పుట్టబోయే పిల్లల కన్నా పోకేమోన్ ప్రియారిటీ అన్నట్లు ప్రచారం చేశాడు.
బాధాకరమైన విషయం ఏంటంటే, పోకేమోన్ ఆడుతూ గేమ్ లో నిమగ్నమై కొండ చర్య పై నుండి క్రిందకు పడిపోయారు ఇద్దరు వ్యక్తులు. మీరు గేమ్ మొదలు పెట్టేముందు, స్క్రీన్ పై మీ పరిసరాలు చూసుకోమని ఉంటుంది హెచ్చరిక గా.
కొన్ని బిజినెస్ లు pokemon ద్వారా లాభాలు పొందే ప్రయత్నాలు చేశాయి. వాళ్ళ షాప్ లోకి వచ్చి పోకేమోన్ ను పట్టుకుంటే డిస్కౌంట్స్ ఉంటాయి అని తెలిపారు.
జనరల్ గా అంత సేపు నడుచుకుంటూ ఆడటానికి అందరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా బద్దకంగా ఉండే వారికీ. ఫిజికల్ గా కదిలితేనే గాని pokemon ఆట అనేది లేదు. అయినా పాపులర్ అయ్యింది. కాని ఒక వ్యక్తీ ఇలా తమ కుక్కకు మొబైల్ ను కట్టివేసి ఆడటం జరిగింది. అలాగే మరొకరు celing ఫ్యాన్ కు కట్టి దానిని రొటేట్ చేస్తూ ఆడే ప్రయత్నాలు చేశారు. ఇలా ఆడటం కుదురుతుందా లేదా అనేది ప్రశ్న కాదు, కానీ వాళ్ళ ప్రయత్నాలు.
ఒక పక్క ఇబ్బందులకు కారణం అవుతున్నా, మరో example లో ఇద్దరు marine వెటరన్స్ pokemon ఆడుకుంటూ వెళ్తూ అనుకోకుండా ఒక మర్డర్ ను ఆపగలిగారు.