ఇండియాలో ఇప్పుడు మోదీ ఆద్వర్యంలో జరుగుతున్న డిజిటల్ ఇండియా అందరికీ తెలిసినదే, కాని దానిపై పనిచేసే కొన్ని యాప్స్ ఎవ్వరికీ తెలియవు. అవి ఎందుకు...ఎలా use అవుతాయి..ఏంటి? అనే విషయాలు తెలిసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగలరు. వెరీ ఇంపార్టంట్ uses.
Digi Locker
ఆధర్ కార్డ్ ఉన్న ఇండియన్ సిటిజెన్స్ కు గవర్నమెంట్ ఇస్తున్న పర్సనల్ స్టోరేజ్ స్పేస్ ఇది. మీ స్టడీ డిజిటల్ కాపిస్, డాక్యుమెంట్స్ - పాన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ etc వంటివి చాలా ఇందులో స్టోర్ చేయగలరు. వేరు వేరు శాఖలు ఇచ్చే ఈ - డాక్యుమెంట్స్ యొక్క uniform రిసోర్స్ identifier - URI లింక్ ను కూడా స్టోర్ చేయగలరు. e-docs పై సైన్ చేసేందుకు e sign ఫెసిలిటీ కూడా ఉంది. వెబ్ సైట్ లింక్ ప్లే స్టోర్ లింక్
MyGov Mobile App
పాలసీలు ఏర్పాటు మరియు implementation వంటి ముఖ్యమైన విషయాలలో డైరెక్ట్ గా సిటిజెన్స్ ను పాల్గొనేలా use అవుతుంది యాప్. కామెంట్స్, సజెషన్స్ పంపవచ్చు సెంట్రల్ మినిస్ట్రీస్ కు. గవర్నమెంట్ చేసిన పోల్స్ అండ్ బ్లాగ్ రిలేటెడ్ నేషనల్ డెవెలప్మెంట్ లో పాల్గొనగలరు. ప్లే స్టోర్ డౌన్లోడ్ లింక్
స్వచ్చ్ భారత్ అభియాన్ యాప్
మీ చుట్టుపక్కల ప్రదేశాలను క్లిన్ చేయాలని అనిపిస్తే మీరు ఈ యాప్ లో కాంపెయిన్ స్టార్ట్ చేసి అందరినీ invite చేయగలరు. సోషల్ మీడియా కనెక్టివిటి ద్వారా మీరు చేసిన కార్యక్రమాలను షేర్ కూడా చేసుకోవచ్చు. ప్లే స్టోర్ డౌన్లోడ్ లింక్
e-hospitals
ఇది దేశంలోని 30 మేజర్ పబ్లిక్ హాస్పిటల్స్ లో రన్ అవుతున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (HMIS) ఇంటిగ్రేషన్ తో వస్తుంది. యాప్ ద్వారా ఆన్ లైన్ అప్పాయింట్మెంట్స్ ను రిజిస్టర్ చేసుకోగలరు. హాస్పిటల్ ఫీ మరియు రిపోర్ట్స్ కూడా ఇంటర్నెట్ సహాయంతో దీనిలో పొందుతారు. AIIMS, RML(డిల్లీ) అండ్ NIMHANS(బెంగుళూరు) వంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వెబ్ లింక్
National Scholarships Portal
ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కాలర్ షిప్స్ వివరాలు.. స్టూడెంట్ అప్లికేషన్, వెరిఫికేషన్, sanction, disbursal to end beneficiary ఈ యాప్ లో పొందుతారు. ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు అన్నింటికీ. ఎవరికి ఏది suit అవుతుందో కూడా సజెషన్ ఇస్తుంది. వెబ్ లింక్ డౌన్లోడ్ లింక్
ePathshala
స్టూడెంట్స్ , teachers అండ్ పేరంట్స్ కొరకు అన్నీ టెక్స్ట్ బుక్స్, ఆడియో, వీడియో, periodicals, ప్రింట్ అండ్ నాన్ ప్రింట్ మేటేరియల్స్ ను పొందుతారు ఈ యాప్ లో. డౌన్లోడ్ లింక్
డిజిటల్ ఇండియా యాప్
పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతటికీ, డిజిటల్ ఇండియా యాప్ అనేది ఇన్ఫర్మేషన్ సెంటర్. సో ఆ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేయటానికి ముందు ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.