2016 లో రిలీజ్ అయిన చాలా సైంటిఫిక్ మూవీస్/షోస్ లిస్టు నుండి బెస్ట్ మూవీస్/టీవీ షోస్ ను క్రింద పొందిపరచటం జరిగింది. క్రిందకు స్క్రోల్ చేయండి.
5. Arq
ఇది నెట్ ఫ్లిక్స్ చే ప్రొడ్యూస్ చేయబడిన ఒరిజినల్ కంటెంట్, Edge of Tomorrow లో ఉన్న time repeating లైన్ లో ఉంటుంది సినిమా. మంచి ఆక్షన్ సన్నివేశాలు, మరియు సీట్ లో కదలకుండా చేసే ఇతివృత్తం ఉంటుంది. Netflix లో చూడగలరు.
4. Star Trek Beyond
పర్సనల్ గా దీనికి ముందు వచ్చిన Darkness కన్నా అంతగా నచ్చలేదు కాని ఇది కూడా గ్రేట్ స్పేస్ adventure. Captain James T. Kirk అనే వ్యక్తి తన స్పేస్ షిప్ మరియు సిబ్బంది ను పోగొట్టుకుంటాడు. ఆ తరువాత ఏమి జరిగింది అనేది ప్రధాన ఇతివృత్తం.
3. Westworld
1973 లో రిలీజ్ అయిన Westworld సినిమా నే inspire అయ్యి ఇప్పుడు కొత్తగా షూట్ చేసి టీవీ షో లో సిరిస్ లు గా అందిస్తున్నాయి. ఒక పార్క్ లో ఉండే టెక్నాలజీ పరమైన పనులకు ఇప్పటి ప్రపంచం ఎలా ఎదుర్కొని నిలబడుతుంది అనేది సారంశం.
2. Black Mirror Season 3
ఇది కూడా సైంటిఫిక్ టీవీ షో. టెక్నాలజీ addiction మరియు టెక్నాలజీ జీవితాలను ఎలా నెగటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది, మనం దానికి ఎలా బానిసలు అయిపోయాము అని అంతర్లీనంగా తెలిపే షో.
1. Stranger Things
Netflix Original గా ప్రొడ్యూస్ చేసే టీవీ షో ఇది. మన వద్ద ఉండే టీవీ షో లతో కంపేర్ చేసుకోకండి. ఇవి హాలివుడ్ సినిమాలకు ఏ మాత్రం తక్కువ కావు. అసలు సినిమానా టీవీ షో నా అని తెలుసుకోవటం కూడా కష్టం. గవర్నమెంట్ కొన్ని supernatural experiments చేస్తూ ఉంటుంది ఒక ప్రదేశంలో. దాని గురించి కొందరికి తెలుస్తుంది. ఇక మిగిలినది అక్కడే చూడండి. .