ఫేస్ బుక్ ను ఒక్క రోజు కూడా చూడకుండా ఉండని వారు ఉండరు. దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి చాలా మందికి ఉన్నట్టు కూడా తేలియాదు. వాటిలో ఒక 5 విషయాలను ఇక్కడ మీ కోసం. క్రిందకు స్క్రోల్ చేయండి.
నోట్: ఇవ్వన్నీ డెస్క్ టాప్ ఫేస్ బుక్ లో పనిచేస్తాయి.. యాప్ లో కూడా కొన్ని మాత్రమే పనిచేస్తాయి.
SAVING: read later
మీరు న్యూస్ ఫీడ్ లో స్క్రోల్ చేస్తూ ఏదో మీకు నచ్చిన పోస్ట్ కనిపించి దానిని ఇప్పుడు చదవే టైమ్ లేక పోస్ట్ ను మిస్ అయ్యారా? ఇక నుండి మిస్ అవకండి. ఫేస్ బుక్ లో పోస్ట్ - స్టేటస్ అప్ డేట్, వీడియో, లింక్ ఏదైనా ఉంటే దాని పైన రైట్ కార్నర్ లో డౌన్ arrow బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు save అనే ఆప్షన్ కనపడతుంది. దానిని సెలెక్ట్ చేస్తే ఆ పోస్ట్ సేవ్ అవుతుంది. తరువాత మీరు ఎప్పుడైనా చదవగలరు. సేవ్ చేసిన వాటిని www.facebook.com/saved ఈ లింక్ లో చూడగలరు.
Personal Ads:
మెయిన్ సేట్టింగ్స్ లోకి వెళ్లి, ads పై క్లిక్ చేస్తే Ads based on my preferences అని ఉంటుంది. దాని పక్కన edit ఆప్షన్ పై క్లిక్ చేసి Visit ad preferences ఉంటుంది. అందులో మీకు ఏ కేటగిరి లో యాడ్స్ మాత్రమే కనిపించాలి అని సెట్ చేసుకోగలరు. టెక్నాలజీ, ఫుడ్, షాపింగ్ etc చాలా ఉంటాయి చూడండి.
Favourite person/page :
మీ న్యూస్ ఫీడ్ లో ఏ పేజ్ ముందుగా అన్నిటికన్నా పైన కనిపించాలి, ఏ person యొక్క అప్ డేట్స్ పైన ఉండాలి, ఎవరివి ఉండకూడదు, అన్ ఫాలో అయిన వారిని మళ్ళీ ఎలా ఫాలో అవ్వాలి ఇలా అన్నీ సెట్ చేయటానికి ఫేస్ బుక్ లో పైన బ్లూ బార్ లో లాక్ సింబల్ ప్రక్కన డ్రాప్ డౌన్ మెను పై క్లిక్ చేస్తే News feed preferences కనిపిస్తుంది. దానిలో అన్నీ ఉంటాయి.
Total Facebook Data Download:
మీ ఫేస్ బుక్ డేటా అంతా ఫోటోస్ అండ్ వీడియోస్ తో పాటు మీ కంప్యుటర్ లోకి సేవ్ చేసుకోవచ్చు తెలుసా. ఇందుకు మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి General టాబ్ క్లిక్ చేస్తే క్రింద Download Copy అని ఉంటుంది. దాని పై క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది.
Facebook Name Change:
ఫేస్ బుక్ లో మీ ప్రొఫైల్ నేమ్ ను అనవసరంగా ఎక్కువ సార్లు మార్చకండి. 4 to 5 టైమ్స్ మించి నేమ్ మారిస్తే ఇక పేరును మార్చుకోవటానికి అవ్వదు. కాని మీరు అప్పటివరకూ మార్చిన పేరులలో ఏదో ఒకటి పెట్టుకోగలరు. మీరు లిమిట్ దాటాక, పేరును మరలా మార్చుకోవటం చాలా అవసరం అయితే ఈ లింక్ లో కి వెళ్లి డేటా ను ఎంటర్ చేసి ఫేస్ బుక్ కు అప్లై చేయాలి నేమ్ change గురించి.