మీలో చాలా మందికి 4జి స్మార్ట్ ఫోన్స్ కావాలని ఉంటుంది . కానీ వాటిని కొనుక్కునేంత స్థోమత కొంతమందికి ఉండక పోవచ్చు . మరియు వాటి ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంభందించి అంత సమాచారం లేక కూడా 4జి స్మార్ట్ ఫోన్స్ ని కొనటానికి సందేహిస్తూ వుంటారు .
అయితే అలాంటి వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు . ఎందుకంటే కేవలం 3 వేలకే మార్కెట్ లో చాలా మంచి 4జి ఫోన్స్ అందుబాటులో వున్నాయి . కానీ మనలో చాలా మందికి దీని గురించి అంత ఐడియా లేదు . అయితే మేము కేవలం 3 వేలకే మార్కెట్ లో లభిస్తున్న కొన్ని 4జి స్మార్ట్ ఫోన్స్ యొక్క క్లియర్ డీటెయిల్స్ అండ్ వాటియొక్క స్పెసిఫికేషన్స్ వివరాలు మీ కోసం పొందుపరచాము . మీరు దీన్ని క్షుణ్ణం గా పరిశీలించి వీటిలో మీకు నచ్చినది ఎంచుకోండి . ఈ ఫోన్స్ యొక్క వివరాలు తెలుసుకొనుటకు ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి .
Ziox Quiq Cosmos 4G
ఇది అత్యంత తక్కువధరకే లభించే 4జి స్మార్ట్ ఫోన్ గా మనం పరిగణించవచ్చు . ఈ జియోక్స్ క్యూక్ కాస్మోస్ 4G ఫోన్ యొక్క ధర కేవలం రూ. 2999 మాత్రమే ఇక దీనియొక్క ఫీచర్స్ గమనిస్తే మొదట డిస్ప్లే 4 ఇంచెస్ 850 x 480 పిక్సల్స్ రిజల్యూషన్ డిస్ప్లే ని కలిగి వుంది .
ఇక దీనిలో RAM చూస్తే 512 MB RAM ఇచ్చారు . ఇక ప్రోసెసర్ పరంగా 1.3 జిహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మరియు 4 G ఇంటర్నల్ స్టోరేజ్ దీనిని మనం ,32జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేయవచ్చు . దీనిలో 1450 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు .
iVooMi Iv
ధర రూ. 2779
ఈ ఇవూమి ఐవీ ఫోన్ కూడా అత్యంత తక్కువ ధరలో లభించే మంచి 4జి స్మార్ట్ ఫోన్ . దీని ధర కేవలం రూ. 2779
ఇక దీని స్పెసిఫికేషన్స్ గమనిస్తే దీనిలో మొదటగా డిస్ప్లే చూస్తే 4 ఇంచెస్ 850 x 480 పిక్సల్స్ల్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే కలిగి వుంది , ఇక RAM పరంగా 512 MB RAM ఇక స్టోరేజ్ పరంగా చూస్తే 4GB ఇంటర్నల్ స్టోరేజ్ , ఇక ప్రోసెసర్ పరంగా 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఇక స్టోరేజ్ ని కూడా 128జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేయొచ్చు , ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఫై నడుస్తుంది . 2 ఎంపీ రేర్ కెమెరా అండ్ 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు .1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు . ఇక కనెక్టివిటీ పరంగా 4GVOLTE అండ్ డ్యూయల్ SIM ఫోన్ .
bell smart 101
ధర రూ. 2999
ఈ బెల్ స్మార్ట్ 101 కూడా చాలా తక్కువ ధరకే లభించే మంచి 4జి స్మార్ట్ ఫోన్ ఇక దీని లీకెడ్ స్పెసిఫికేషన్స్ గమనిస్తే కనుక ఇది ఒక డ్యూయల్ సిం స్మార్ట్ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ వి 5.1 ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది . ఇక కెమెరా పరంగా వెనుక వైపు 8 ఎంపీ కెమెరా మరియు ఫ్రంట్ సైడ్ 3.2 ఎంపీ కెమెరా ఇచ్చారు . ఇక ప్రోసెసర్ పరంగా 1.3 GHzక్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇక RAM పరంగా చూస్తే 1GBRAM , 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు దీనిని , 32 జిబి వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . ఇక బ్యాటరీ 2800 MAH బ్యాటరీ ఇచ్చారు .
Swipe Neo Power
కేవలం 2,999 లకే లభిస్తున్న మంచి 4జి స్మార్ట్ ఫోన్ . ఇక దీని ఫీచర్స్ చూసినట్లయితే
4 ఇంచెస్ 850 x 480 పిక్సల్స్ రిజల్యూషన్ గల డిస్ప్లే ఇది గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది . ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఫై నడుస్తుంది . ఇక ప్రోసెసర్ పరంగా 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ram చూస్తే 512 MBRAM , 4 GB స్టోరేజ్ ని 32 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేయొచ్చు , ఇక కెమెరా ఫై కన్నేస్తే 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టివిటీఆప్షన్స్ 4GVOLTE , బ్లూటూత్ 4.0, ఇక బ్యాటరీ 2500 MAH బ్యాటరీ. ఇది డ్యూయల్ SIM ఫోన్ .