2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

బై Adamya Sharma | అప్‌డేట్ చేయబడింది Dec 28 2015
2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

నిన్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ బాలివుడ్ సెలబ్రిటి ల మధ్యనే జరిగిన Jio ఈవెంట్ లో Jio 4G సేవలను స్టార్ట్ చేశారు ఇండియాలో. ఇది ప్రస్తుతానికి కేవలం రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే అందుతుంది. త్వరలోనే అందరికీ. అయితే రిలయన్స్ దీనితో పాటు బడ్జెట్ లో 4g హాండ్ సెట్స్ కూడా తేవనుంది అని బాగా న్యూస్ అప్ డేట్స్ వచ్చాయి ఇప్పటివరకూ. అవేమి అయ్యాయి?.. అవి నిజమే కాని వాటికీ ఇంకా టైమ్ తీసుకోనుంది కంపెని. అసలు 4G సర్వీసెస్ పేరుతో రిలయన్స్ తెచ్చే కొత్త టెక్నాలజీస్ ఏంటో చూద్దామా? క్రిందకు స్క్రోల్ చేయండి.

2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

మొబైల్ 4G కనెక్టివిటి
మార్చ్ 2016 లోపల ఇది మార్కెట్ లో విడుదల అవుతుంది. ఇంటర్నెట్ తో పాటు Jio  వాయిస్ టెలిఫోనీ సర్వీసెస్ కూడా తేవనుంది 4G పై. దీనిని వాయిస్ over LTE లేదా VoLTE అని అంటారు టెక్నికల్ గా. దీనిలో హై క్వాలిటీ కాల్స్ ఉండనున్నాయని రిపోర్ట్స్.

2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

హోమ్ బ్రాడ్ బాండ్ అండ్ WiFi సర్వీసెస్
2,50,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్స్ ను ఇండియాలో వేసింది దీని కొరకు. లోకల్ గా ఆల్రెడీ ఇలాంటి సదుపాయాలు అందించే కేబుల్ నెట్ వర్క్స్ తో ఒప్పొందం లేదా వాళ్ళను కొనటం వంటి ఆలోచనలో కూడా ఉంది. 2016 చివరికల్లా 10 లక్షల ఇళ్ళను దీని ద్వారా కనెక్ట్ చేయనున్నాము అని అంబానీ వెల్లడించారు. ఆల్రెడీ నార్త్ లో కొన్ని సిటీస్ లో Jionet వైఫై హాట్ స్పాట్ 70mbps స్పీడ్ కు చేరుకుంది. ఎవరేజ్ గా అయితే 15 నుండి 30mbps లో ఉంటుంది డౌన్లోడ్ స్పీడ్. ఇది బీటా మాత్రమే.

2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

టీవీ అండ్ వీడియో on డిమాండ్ సర్వీసెస్
ఈ ఇయర్ లో మల్టీ సిస్టం ఆపరేటర్(MSO) ను pan ఇండియాలో లో లాంచ్ చేసేందుకు రిలయన్స్ కు అప్రూవల్ కూడా వచ్చింది. MSO అంటే లార్జ్ కేబుల్ నెట్ వర్క్ కంపెని అని చెప్పాలి. దీని క్రింద చిన్న చిన్న కేబుల్ కంపెనీలు ఉంటాయి. ఇంకా దీనిని ప్రవేశపెట్టలేదు కాని 2016 లో VoD సర్వీసెస్ తో పాటు టీవీ చానెల్స్ ను కూడా ఇవనుంది.

2016 లో రిలియన్స్ Jio నుండి వస్తున్న 4 టెక్నాలజీస్

యాప్స్ అండ్ డివైజ్ ecosystem
డిజిటల్ మనీ, డిజిటల్ పేమెంట్ etc వంటి యాప్స్ తో ఇంటెక్స్ అండ్ Huawei కంపెనీలు చే తయారు చేయబడ్డ Jio హాండ్ సెట్స్ ను తీసుకు వస్తుంది. సో డిజిటల్ ఇండియాలో భాగంగా రిలియన్స్ తెస్తున్న టెక్నాలజీస్ ఇవి. అయితే వీటి తో కంపెని 2016 లో ప్రజాదరణ పొందుతుందా లేదా అనేది సర్వీసెస్ availability అండ్ క్వాలిటీ వంటి విషయాలపై ఆధారపడనుంది