ప్రతీ సంవత్సరం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. 2015 లో వచ్చిన గమనించదగ్గ మార్పులు...అండర్ 10K బడ్జెట్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 3gb ర్యామ్. మరి 2016 ఏమి రానున్నాయి..క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయండి.
RAM
2015 లో 4gb ర్యామ్ అరంగేట్రం చేసింది. అది ముందుగా ఆసుస్ జెన్ ఫోన్ 2 లో వచ్చింది. దీని ప్రైస్ కూడా 17 వేలు సుమారు. దాని తరువాత oneplus 2, వెంటనే ఇండియన్ బ్రాండ్ Yutopia. వీటి ధరలు 25 వేలు. అంటే 2016 చివరికి 4gb ర్యామ్ అండర్ 15K వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ 3gb ర్యామ్ 9 వేలకు వస్తుంది కూల్ ప్యాడ్ నోట్ 3 లో.
ఫాస్ట్ చార్జింగ్
గంటలో కంప్లీట్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీ వచ్చింది మిడ్ నుండి హై ఎండ్ బడ్జెట్ లో. సో ఇది ఇయర్ ఎండింగ్ లోపు బడ్జెట్ సెగ్మెంట్ కు కూడా రానుంది అని అంచనా. కంపెనీలు కూడా 2AMP చార్జర్స్ తో రానున్నాయి.
USB టైప్ C పోర్ట్
oneplus, Gionee, గూగల్ నేక్సాస్ etc.. డివైజ్ లలో ఇది ఉంది ప్రస్తుతం. 2016 ముగిసే లోపు ఇది కూడా నార్మల్ స్పెక్ అవుతుంది అని అంచనా. డేటా ట్రాన్స్ ఫరింగ్ లో స్పీడ్ పెరగటమే కాదు, రివర్సిబుల్ కనెక్టింగ్, యూనివర్సల్ ఫాస్ట్ చార్జింగ్ వంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి దిని వలన.
2K and 4K డిస్ప్లే
LG G4, సామ్సంగ్ గెలాక్సీ S6, నేక్సాస్ 6P వంటి డివైజెస్ 2K స్క్రీన్ రిసల్యుషన్స్ తో రావటం జరిగింది ఈ ఇయర్ లో. సోనీ మరింత ముందుకు వెళ్లి 4K ను కూడా ప్రవేశ పెట్టింది Z5 ప్రీమియం లో. మరి ఇక 2016 లో ఇవి కూడా రెగ్యులర్ గా వస్తాయని అనుకోవటంలో అతిశయోక్తి లేదు.
BezelLess
2015 లో 5.5 స్క్రీన్ సైజ్ మార్కెట్ చాలా ఎక్కువ శాతం లో ఉన్నప్పటికీ వాటి ఓవర్ ఆల్ ఫోన్ సైజ్ ను మాత్రం దాదాపు కంపెనీలు అన్ని వీలైనంత వరకూ చాలా కాంపాక్ట్ గా ఉంచటానికే మొగ్గు చూపాయి. ఇది 2016 మరింత కాంపాక్ట్ గా ఉంచటానికి సైడ్ బెజేల్స్ ను బాగా trim చేయనున్నాయి కంపెనీలు. ఎందుకంటే ఇంతకు మించి ఆప్షన్ కూడా లేదు వాటికి.