మనము ఊహించని కొన్ని విచిత్రమైన గాడ్జెట్స్ ఈ సంవత్సరం లో లాంచ్ అయ్యాయి. ఇవి ఎందుకు కనిపెట్టారో తెలియదు. తరువాత కాలంలో బాగా ఫెయిల్ అయ్యాయి. అవేంటో ఇక్కడ చూడండి.
గమనిక: ఈ గాడ్జెట్స్ ఫన్నీ గా అనిపించాయి కాని తయారు చేసిన వారిని sincere గా సపోర్ట్ చేస్తాము వర్క్ పరంగా.
Bruno Smart Trash Can
జస్ట్ wifi ద్వారా మీ ఫోనులో డస్ట్ బిన్ ను క్లిన్ చేయమని నోటిఫికేషన్స్ ఇస్తుంది.
Green Cube
ఒక క్యూబ్ లో ప్లాంట్స్ కు కావలిసిన వాతావరణాన్ని కుత్రిమంగా క్రియేట్ చేసి ప్లాంట్స్ నుండి మంచి రిసల్ట్స్ ఇస్తుంది.
Lovense Blush Vibe
ఇది వైర్ లెస్ గా కంట్రోల్ అయ్యే సెక్స్ టాయ్. అంటే దీని సహాయంతో దూరం గా ఉండి కూడా మీ పార్ట్నర్ తో pleasure షేర్ చేసుకోగలరు. అయితే ఆపిల్ వాచ్ పైనే పని చేస్తుంది.
Makey Makey Go
జస్ట్ కనేక్టర్ గా పనిచేస్తూ దేనినైనా టచ్ ప్యాడ్ గా మారుస్తుంది. ఒక ఎండ్ ను మీకు నచ్చిన దేని కైనా కనెక్ట్ చేసి మరొక దానిని లాప్ టాప్ కు కనెక్ట్ చేస్తే చాలు. usb సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది లోపల.
Mask
ఇది మీ కళ్ళకు కంప్లీట్ గా కవరింగ్ చేసి enlarged డిస్ప్లే ను ఇస్తుంది. సినిమాలు చూడటానికి, గేమింగ్ ఆడటానికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
Miito
మీ కాఫీ, మిల్క్, వాటర్ ఏదైనా వేడి చేయటానికి జస్ట్ సన్నని ఈ రాడ్ ను కప్ లో ఉంచితే వేడి చేస్తుంది వాటిని.
Mint
ఇది నోటిలో పెట్టి గట్టిగా గాలి వదిలితే, మీ నోటి గాలిని బట్టి మీకు స్మార్ట్ ఫోన్ లో రిసల్ట్స్ ను చూపిస్తుంది. మీరు టూత్ పేస్ట్ మార్చాలా? మింట్ వాడలా అనేవి కూడా తెలియజేస్తుంది.
Sensoria Fitness Socks
ఇవి సాక్స్ కాని దీనికి బాండ్ ఉంటుంది. మీరు మీ కాళ్ళ పై ఎంత స్ట్రెస్ పెడుతున్నారు వంటి విషయాలను ట్రాక్ చేసి మీ స్టాండింగ్ పొసిషన్స్ ను సజెస్ట్ చేస్తుంది.
The Hug
ఇది కంప్లీట్ వాటర్ ఫిట్ నెస్ బ్రాండ్. మీరు ఎంత తాగాలి. ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు ఎంత తాగాలి, ఎన్ని సార్లు తాగారు వంటి విషయాలను ట్రాక్ చేసి మీ వెయిట్ కు అనుగుణంగా మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
Toshiba Chihiraaico humanoid
మనుషులతో రియల్ హ్యూమన్ ఎమోషన్స్ తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడగలిగే రోబో.
XploreAir Paravelo
4000 అడుగుల ఎత్తు వరకూ గాలిలో తొక్కే సైకిల్ ఇది. ప్యారాచూట్ సహాయంతో పని చేస్తుంది.