చాలా మందికి బెస్ట్ కెమెరా ఫోన్ అంటే కేవలం మంచి కెమెరా ఉంటే చాలు అనుకుంటారు. ఆఫ్ కోర్స్ ఇమేజ్ క్వాలిటీ బాగుంటే కెమేరా బాగుంటుంది, కాని అలాగే ప్రొసెసర్, ర్యామ్ etc కూడా మంచి కెమెరా ఫోన్ కు అవసరం. ఆపిల్ ఐఫోన్ ప్రతీ మోడల్ ఇప్పటికీ బెస్ట్ కెమెరా ఫోన్ గా ఉంటుంది. కారణం అది ఫాస్ట్ గా మంచి ఇమేజెస్ ను తీస్తుంది ఎలాంటి లైటింగ్ కండిషన్స్ లో అయినా. కాని దాని ధర బాగా ఎక్కువ... అయినా మంచి కెమెరా ఫోన్ కావాలంటే ప్రతీ సారి ఎక్కువ అమౌంట్ పెట్టనవసరం లేదు.. మిడ్ ర్యాంజ్ బడ్జెట్ లో కూడా మంచి కెమెరా ఫోనులు ఉన్నాయి. అవేంటో చూడండి. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
ZTE నుబియా Z9 మినీ
మిడ్ ర్యాంజ్ ప్రొసెసర్, స్నాప్ డ్రాగన్ 615 పై రన్ అవుతుంది. కాని హై ఎండ్ IMX240 సోనీ ఇమేజ్ సెన్సార్ కెమెరా ఉంది. గేలక్సీ S6 తో పోటిగా మంచి ఇమేజెస్ తీస్తుంది ఇది.
మోటో x ప్లే
ఇది కూడా స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్ పై రన్ అవుతుంది. కాని బెస్ట్ కెమెరా ను దీనిలో పెట్టింది కంపెని. బెస్ట్ కెమెరా అండర్ 20K అండ్ మంచి balanced ఫోన్ ఇది.
Oneplus one
16gb స్టోరేజ్ కొంచెం ప్రాబ్లెం గా అనిపిస్తుంది కాని మంచి కెమెరా ఉంది దీనిలో.
xiaomi మి 4i
దీని ప్రైస్ 13 వేల లో ఉంటుంది. కాని 13MP కెమెరా చాలా బాగుంటుంది. HDR మోడ్ బెస్ట్ పిక్స్ ఇస్తుంది.
xiaomi మి 4
దీనిలో కూడా 13MP కెమెరా ఉంది. ఈ మొబైల్ 64gb వేరుయంట్ కరెక్ట్ చాయిస్. 64gb ప్రైస్ 17,999 రూ లకువ్ వస్తుంది. మంచి కెమెరా.
కూల్ ప్యాడ్ dazen x7
సబ్ 20K సెగ్మెంట్ లో x7 ఇది చాలా మందికి తెలియకపోయినా మంచి ఫోన్. 13MP సోనీ IMX214 సెన్సార్ తో xiaomi 4i లానే మంచి ఫోటోస్ తీస్తుంది.
మైక్రోసాఫ్ట్ లూమియా 640XL
ఇది లూమియా సిరిస్ లో ది బెస్ట్ కెమెరా మోడల్ కాదు.. కానీ సబ్ 20k బడ్జెట్ లో ఇది కూడా గ్రేట్ కెమెరా షూటర్.
ఆసుస్ జెన్ ఫోన్ సేల్ఫీ
దీనిలో రెండు వైపులా 13MP మంచి కేమెరా ఉంది. మంచి ఫోటోస్ ఇస్తుంది.
ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్
లేసర్ assisted ఆటో ఫోకస్ 10 వేల కు రావటం వలన ఇది ఈ లిస్ట్ లో చేరింది. షార్ట్ ర్యాంజ్ ఫోటోలకు మంచి అవుట్ పుట్ ఇస్తుంది. లాంగ్ ర్యాంజ్ లో చెడ్డవి ఇవటం లేదు కానీ... షార్ట్ ర్యాంజ్ అంత బాగా ఉండటం లేదు.
meizu m2 నోట్
ఇది ఆసుస్ లేసర్ కు పోటీ. కాని దీని కన్నా లేసర్ కే కొంచెం బెటర్ కేమెరా ఉంది అని చెప్పాలి. డిఫరెన్స్ పెద్దగా తెలియదు రెండు ఫోనులతో తీసిన పిక్స్ ను పక్క పక్కన పెడితే కాని.
శామ్సంగ్ గెలాక్సీ J7
శామ్సంగ్ కేమేరాస్ బాగుంటాయి. J7 కొంచెం ఓవర్ రేట్ ఫోన్. కాని మంచి ఫోటోలను ఇస్తుంది.